Gaddar Film Awards : గద్దర్ సినీ అవార్డులకు ఎంట్రీల ఆహ్వానం.. ఏ కాటగిరీలలో అంటే...

గద్దర్ తెలంగాణ చలన చిత్ర అవార్డులకు సంబంధించి  విధి విధానాలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వండఉత్తర్వులు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం గద్దర్ అవార్డులకు జీ.ఓ ఎం.ఎస్ నెంబర్ 25  జీ,ఓ. (ఐ అండ్ పీఆర్) తేదీ.11.3.2025 ను నేడు విడుదల చేసింది.

New Update
 Gaddar Film Awards

Gaddar Film Awards

Gaddar Film Awards : గద్దర్ తెలంగాణ చలన చిత్ర అవార్డులకు సంబంధించి  విధి విధానాలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ఇచ్చిన మాట ప్రకారం గద్దర్ అవార్డులకు గాను జీ.ఓ ఎం.ఎస్ నెంబర్ 25  జీ,ఓ. (ఐ అండ్ పీఆర్) తేదీ.11.3.2025 ను నేడు విడుదల చేసింది. తెలంగాణ సినిమా రంగానికి విశేష సేవలనందించిన పైడి జయరాజ్, కాంతా రావు పేర్లపై ప్రత్యేక అవార్డులు ఇవ్వాలని, ఇప్పటికే, ప్రముఖ నటులు ఎం. ప్రభాకర్ రెడ్డి పేరుపై ఉన్న ప్రజాదరణ పొందిన చలన చిత్రానికి  అవార్డును కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ చలనచిత్రాలకు ఇవ్వనున్న గద్దర్ సినీ అవార్డుల  కార్యక్రమం ఏప్రిల్ లో జరగనున్నట్టు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్  ప్రకటించింది.

Also Read: గ్రూప్ 1 పరీక్షల ఫలితాలు...  హైయెస్ట్ మార్కులు వీరికే .. కటాఫ్ ఎంతంటే!

2014 నుండి 2023 వరకు అప్పటి తెలంగాణా ప్రభుత్వం చలన చిత్ర అవార్డులను జారీ చేయక పోవడంతో, ఆ సంవత్సరాలకు కూడా ఒక్కో సంవత్సరానికి ఒక ఉత్తమ చలన చిత్రానికి అవార్డు నివ్వాలని నిర్ణయించారు. గద్దర్ చలన చిత్ర అవార్డులకు సంబందించిన దరఖాస్తులు ఏ.సి గార్డ్స్ లోని తెలంగాణా చలన చిత్ర పరిశ్రమాభివృద్ది సంస్థ కార్యాలయంలో తేదీ.13 .3 .2025 నుండి దరకాస్తులు అందుబాటులో ఉంటాయి.  ఫీచర్ ఫిలిం కాటగిరిలో మొట్టమొదటి సారిగా ఉర్దూ భాషా చిత్రాలకు కూడా అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ గద్దర్ అవార్డులను ఈ క్రింది కాటగిరీలలో ఇవ్వడం జరుగుతుందని ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. *ఫీచర్ ఫిల్మ్స్, * జాతీయ సమైక్యతపై చలన చిత్రం *బాలల చలన చిత్రం. *పర్యావరణం/హెరిటేజ్/ చరిత్ర లపై చలన చిత్రం . *డెబిట్ ఫీచర్ ఫిల్మ్స్ *యానిమేషన్ ఫిలిం *సోషల్ ఎఫక్ట్ ఫిల్మ్స్ *డాక్యుమెంటరీ ఫిల్మ్స్ *షార్ట్ ఫిల్మ్స్  *తెలుగు సినిమాలపై బుక్స్/ విశ్లేషణాత్మక వ్యాసాలు. *ఆర్టిస్టులు/ టెక్నీషియన్లకు వ్యక్తిగత అవార్డులు

Also Read: రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాపై సస్పెన్షన్‌ ఎత్తివేత

ఇది కూడా చదవండి: హోలీ పండుగపై గందరగోళం.. అసలు తేదీ ఎప్పుడు?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

తెలంగాణలో జపాన్‌ పెట్టుబడులు.. రూ.12,062 కోట్లు

ఏడురోజుల పాటు జపాన్‌లో పర్యటించిన సీఎం రేవంత్ బృందం కీలక ఒప్పందాల చేసుకుంది. మొత్తం రూ.12,062 కోట్ల పెట్టుబడులు సాధించింది. దీనిద్వారా తెలంగాణలో యువతకు 30,500 ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

New Update
CM Revanth Team in Japan

CM Revanth Team in Japan


సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రైజింగ్ బృందం జపాన్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆ బృందం పలు కీలక ఒప్పందాలు చేసుకుంది. ఏడు రోజుల పర్యటనలో మొత్తం రూ.12,062 కోట్ల పెట్టుబడులు సాధించింది. దీనిద్వారా తెలంగాణలో యువతకు 30,500 ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్‌ ఫ్యూచర్‌ సిటీలో నెక్స్ట్‌ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌ ఏర్పాటుకు జపాన్‌కు చెందిన మారుబెని కంపెనీ ఒప్పందం చేసుకుంది. రూ.1000 కోట్ల ప్రారంభ పెట్టుబడి పెట్టనుంది.

Also Read: ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మృతి.. శివమొగ్గ కు చెందిన వ్యాపారవేత్త ...!

మొత్తంగా రూ.5 వేల కోట్ల పెట్టుబడులకు అంచనా వేసింది. అలాగే NTT డేటా, నెయిసా సంస్థలతో కూడా తెలంగాణ సర్కార్‌ ఒప్పందం చేసుకుంది. ఈ కంపెనీలు మొత్తం రూ.10,500 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్‌ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నాయి. తోషిబా  ట్రాన్స్‌మిషన్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్స్‌ ఇండియా (TTDI)తో సైతం ఒప్పందం కుదిరింది. ఆ కంపెనీ రూ.562 కోట్లతో రుద్రారంలోని విద్యుత్ పరికరాలు, సామగ్రి తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది.   

Also Read: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

ఈ కంపెనీల ద్వారా దాదాపు యువతకు 30,500 ఉద్యోగాలు రానున్నాయి. తెలంగాణ సర్కార్‌ ఆధ్వర్యంలో టామ్ కామ్‌తో టెర్న్, రాజ్‌ గ్రూప్‌లు చేసుకున్న ఒప్పందాలు వల్ల రాష్ట్రానికి చెందిన 500 మందికి జపాన్‌లో ఉద్యోగ నియామకాలకు మార్గం సుగమమైంది. ఇదిలాఉండగా.. సీఎం రేవంత్ బృందం ఏప్రిల్ 15న జపాన్‌ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 22 వరకు అక్కడ పర్యటించింది. ఈ పర్యటనలో సీఎం రేవంత్ వెంట మంత్రి శ్రీధర్‌ బాబు, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్ తదితరులు ఉన్నారు. 

Also read: పహల్గాం ఉగ్రదాడి..మోడీకి ట్రంప్‌ ఫోన్‌!

 telugu-news | rtv-news | cm revanth | japan 

 

Advertisment
Advertisment
Advertisment