దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి TGSRTC శుభవార్త! ప్రయాణికులకు టీజీఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. దసరా పండుగ సందర్భంగా అక్టోబరు 1నుంచి 15 వరకు 5304 ప్రత్యే బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీఎండీ సజ్జనార్ తెలిపారు. ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్‌బీ నగర్, ఉప్పల్, కేపీహెచ్‌బీ నుంచి అందుబాటులో ఉంటాయి. By srinivas 30 Sep 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి TGSRTC: దసరా పండుగ సందర్భంగా ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. అక్టోబరు 1 నుంచి 15 వరకు 5304 స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ నుంచి విజయవాడ, బెంగళూరు ఇతర ప్రాంతాలకు ఈ ప్రత్యేక సేవలు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీఎండీ సజ్జనార్ తెలిపారు. ➡️హైదరాబాద్ శివారు నుంచి దసరాకు ప్రత్యేక బస్సులు➡️ఓఆర్ఆర్ మీదుగా విజయవాడ, బెంగళూరుకు సర్వీసులు➡️ దసరాకు టీజీఎస్ఆర్టీసీ 6 వేల ప్రత్యేక బస్సుల ఏర్పాటు➡️ కరీంనగర్, నిజామాబాద్ మార్గాల్లో ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు➡️ ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా… pic.twitter.com/ifIDHqlqWv — VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) September 30, 2024 ఈ మేరకు బస్సులు హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్), జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్), ఎల్‌బీ నగర్, ఉప్పల్, సంతోష్ నగర్, కేపీహెచ్‌బీ నుంచి అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఐటీ కారిడార్ ఉద్యోగుల కోసం గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్ (ORR) మీదుగా విజయవాడ, బెంగళూరు ప్రాంతాలకు వెళ్లనున్నాయి. అక్టోబర్ 9, 10, 11 తేదీల్లో రద్దీ ఉండే అవకాశం ఉన్నందున హైదరాబాద్ లో అదనపు బస్సులు నడిపిస్తామని తెలిపారు. #tgsrtc #md-sajjanar #dussehra 2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి