BIG BREAKING: మంత్రి కొండా సురేఖను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ రోజు కలిశారు. తన కుమార్తె వివాహ వేడుకకు హాజరుకావాలని కోరారు. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను మంత్రికి అందించారు.

New Update
Kotha Prabhakar Reddy

Kotha Prabhakar Reddy

తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ రోజు కలిశారు. తన కుమార్తె వివాహ వేడుకకు హాజరుకావాలని కోరారు. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను మంత్రికి అందించారు. మంత్రి కొండా సురేఖ ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొత్తా ప్రభాకర్ రెడ్డి కొండా సురేఖను తన కూతురు వివాహానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

HYD: హైదరాబాద్ లో రెండు కంపెనీలపై ఈడీ సోదాలు..

హైదరాబాద్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆకస్మిక సోదాలు నిర్వహించింది. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు నరేంద్ర సురానా, ఎండీ దేవేందర్ సురానా ఇళ్ళు, ఆఫీసుల్లో సోదాలు చేశారు. జూబ్లీహిల్స్, బోయిన్ పల్లి, సికింద్రాబాద్లో ప్రాంతాల్లో ఇవి జరిగాయి. 

New Update
ed

హైదరాబాద్ లో సురానా ఇండస్ట్రీస్, సాయి సూర్య డెవలపర్స్ కంపెనీలపై ఈ డీ అకస్మాత్తుగా దాడి చేసింది. ఆ కంపెనీల ఛైర్మన్ నరేంద్ర సురానా, ఎండీ దేవేందర్ సురానా ఇళ్ళల్లో, ఆఫీస్ుల్లో తనిఖీలు నిర్వహించింది. చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తున్నారన్న అనుమానంతోనే ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు ఈడీ అధికారులు చెబుతున్నారు. నాలుగు గంటలకి ఈడీ దాడులు చేశారు. మొత్తం రెండు టీములతో ఈడీ సోదాలు చేసింది. బోయిన్‌పల్లి, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో ఈడి అధికారులు సోదాలు చేస్తున్నారు. చెన్నై నుంచి వచ్చిన ప్రత్యేక ఈడి బృందాలు నాలుగు ప్రాంతాల్లో ఈ సోదాలను నిర్వహిస్తున్నాయి.

రుణాలు ఎగవేత, మనీలాండరింగ్ ఆరోపణలు..

సురానా గ్రూపు చెన్నైలోని ప్రముఖ బ్యాంకు నుంచి వేల కోట్ల రూపాయల రుణాలను పొందింది. కానీ వాటిని చెల్లించకుండా రుణాలను ఎగ్గొట్టినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దాంతో పాటూ మనీలాండరింగ్తో పాటు విదేశాలు డబ్బులు తరలించినట్లు ఆరోపణలున్నాయి. ఇంతకు ముందు సురానా గ్రూప్స్ పై సీబీఐ కేసు కూడా నమోదైంది. ఈ కారణంగానే సురానా అనుబంధ సంస్థ అయిన సాయి సూర్య డెవలప్ మెంట్స్ కంపెనీ  ఆఫీసుల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ రెండు సంస్థల ఆర్థిక లావాదేవీలు, అప్పులు లాంటి వాటిపై ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు.

 today-latest-news-in-telugu | ed | hyderabad | raids 

Also Read: AP: విశాఖలో టీసీఎస్ భారీ క్యాంపస్..99పైసలకే భూమి లీజు

Advertisment
Advertisment
Advertisment