TG News: చిన్నారిని పీక్కుతున్న వీధి కుక్కలు.. తెలంగాణలో మరో దారుణం! బోధన్ పట్టణంలో వీధి కుక్కల దాడికి ఓ చిన్నారి బలైంది. కొత్త బస్టాండ్ ప్రాంతంలో చెట్టు కింద ఉన్న చిన్నారి కనిపించలేదు. దీంతో తల్లి పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలంలో మాంసపు ముద్దలను గుర్తించారు. బాలుడిని కుక్కలు చంపేసి పీక్కుతిన్నట్టు నిర్ధారించారు. By Vijaya Nimma 11 Sep 2024 | నవీకరించబడింది పై 11 Sep 2024 17:15 IST in తెలంగాణ క్రైం New Update షేర్ చేయండి TG News: వీధి కుక్కల దాడికి ఓ చిన్నారి బలైంది. నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన అందరికీ కన్నీరు పెట్టిస్తోంది. వివరాల ప్రకారం.. బోధన్ పట్టణంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. చిన్నారిని వీధి కుక్కలు పీక్కుతిన్న ఘటనతో అక్కడి ప్రజలంతా భయపడుతున్నారు. బోధన్ పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఓ మహిళ పది నెలల బాబును చెట్టు కింద ఉంచి పనిమీద వెళ్లింది. కాసేపటి తర్వాత వచ్చి చూస్తే చిన్నారి కనిపించలేదు. చుట్టుపక్కల ఎంత వెతికినా బాబు ఆచూకీ లభించలేదు. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగి గాలింపి చేపట్టారు. సీఐ వెంకటనారాయణ సిబ్బందితో కలిసి చిన్నారి అదృశ్యమైన ప్రాంతాన్ని తనిఖీ చేసి.. చూట్టు పక్కల ప్రజలను ఆరా తీశారు. ఓ బాబుని కుక్కలు నోట పట్టుకుని వెళ్లినట్టు ఓ వ్యక్తి పోలీసులకు తెలిపాడు. స్థానికుడు ఇచ్చిన సమాచారంతో చిన్నారి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడక్కడ బాబు మాంసపు ముద్దలు దొరికాయి. 10 నెలల బాలుడిని పీక్కుతిని.. శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసిన వీధి కుక్కలు నిజామాబాద్ - బోధన్‌లో బస్టాండ్ సమీపంలో 2 రోజుల క్రితం ఓ తల్లి తన 10 నెలల బిడ్డను వదిలి మూత్రశాలకు వెళ్లింది. తిరిగివచ్చి చూసేసరికి బాలుడు కనిపించలేదు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన… pic.twitter.com/myjSZUhL2m — Telugu Scribe (@TeluguScribe) September 11, 2024 అవి చిన్నారి అవయవాలుగా గుర్తించిన పోలీసులు.. బాలుడిని కుక్కలు చంపేసి పీక్కుతిన్నట్లు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం అవయవాలను సేకరించి బోధన్ ప్రభుత్వాస్పత్రిలో అప్పగించారు. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ స్థానికులు వీధి కుక్కులు మళ్లీ ఎవరిపైన దాడి చేస్తారోనని టెన్షన్ పడుతున్నారు. వీటి బెడద లేకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. #telangana-news #crime-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి