DOCTOR PRANEETHA : కుటుంబసభ్యుల వేధింపులు..పుట్టినరోజునే డాక్టర్ ఆత్మహత్యాయత్నం

భర్త, అత్తమామల వేధింపులతో ఓ డాక్టర్‌ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. గైనకాలజిస్ట్ డా.ప్రణీతకు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సికిందర్ తో పెళ్లైంది. అయితే ఇద్దరిమధ్య కొంతకాలంగా గొడవలవుతున్నాయి.

New Update
DOCTOR PRANEETHA TRY TO DIE

DOCTOR PRANEETHA TRY TO DIE

DOCTOR PRANEETHA : భర్త, అత్తమామల వేధింపులు భరించలేనంటూ ఓ ప్రభుత్వ డాక్టర్‌ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్నది. ఫెర్నాండెజ్ ఆసుపత్రిలో గైనకాలజీ డాక్టర్​గా పని చేస్తున్నది డా.ప్రణీత. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సికిందర్ రెడ్డితో ప్రణీతకు వివాహమైంది.మొదట అమెరికాలో ఉన్న వీరు 2021లో హైదరాబాద్​కు తిరిగి వచ్చారు.  

 ఇది కూడా చూడండి: Maha Kumbh Mela :  మహా కుంభమేళాలో తొక్కిసలాట.. అమృత స్నానాలపై అఖండ పరిషత్‌ కీలక నిర్ణయం

కోహెడ గ్రామానికి చెందిన కర్రి వెంకట్‌రెడ్డి కుటుంబం ప్రస్తుతం చంపాపేట ప్రెస్‌ కాలనీలో నివసిస్తోంది. వెంకట్‌రెడ్డి కుమారుడు సికిందర్‌రెడ్డికి నాంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్న ప్రణీతతో 2018లో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు ఉంది. కొంతకాలం తర్వాత భర్తతో పాటుగా అత్తామామల వేధింపులు ప్రణీతకు ఎక్కువ కావడంతో పెద్దల సమక్షంలోనూ పంచాయితీలు జరిగాయి.అయినా అత్తింటి కుటుంబం తనను నిత్యం వేధింపులకు గురి చేస్తున్నదని, వీరికితోడు వారి ఆడపడుచులు, బంధువులు కూడా ఇబ్బందులు పెడుతున్నారని ప్రణీత ఆరోపిస్తున్నది. పోలీసులకు మొరపెట్టుకున్నా తనకు న్యాయం జరగడం లేదని, డాక్టర్‌ ప్రణీత సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు మాత్రలు మింగింది. 

ఇది కూడా చూడండి: Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి విదేశయాన ప్రయత్నాలు సులభం అవుతాయి..!

భార్యభర్తల మధ్య ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువవడంతో ఇద్దరూ విడాకులకు అప్లై చేసుకున్నారు. గొడవలతో భర్త చెప్పపెట్టకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు. ప్రస్తుతం వీరి విడాకుల కేసు కోర్టులో ఉంది. ప్రస్తుతం చంపాపేటలో ఉన్న ఇంట్లోనే పై పోర్షన్​లో అత్తమామ ఉండగా కింద పోర్షన్​లో ప్రణీత ఆమె కూతురు, తోడుగా తల్లి రూప ఉంటున్నారు. ఇటీవల అత్తా కోడళ్ల మధ్య  తరచూ గొడవలు జరుగుతున్నాయి. అత్తమామల వేధింపుల కారణంగా ప్రణీత పలుమార్లు సరూర్​నగర్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు సరిగా స్పందించలేదని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.పోలీసులకు ఫిర్యాదులు చేసినా స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ప్రణీత ఆత్మహత్యాయత్నం చేసిందని ఆరోపిస్తూ బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళన చేపట్టారు.

ఇది కూడా చూడండి: Big Breaking: కుంభమేళాలో తొక్కిసలాట ..17 మంది మృతి!

సోమవారం ప్రణీత పుట్టినరోజు. ఏమైందో ఏమో తెలియదు కానీ అత్తతో  గొడవపడ్డ ప్రణీత సరూర్‌ నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు స్పందించలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో ఇంటికి వచ్చి సెల్ఫీ తీసుకుని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన తల్లి ఆమెను ఆసుపత్రికి తరలించింది. ప్రస్తుతం స్థానిక కర్మన్‌ఘాట్‌ జీవన్‌ ఆసుపత్రిలో ప్రణీత చికిత్స పొందుతోంది.  

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori: మహిళా నిర్మాతకు యో*ని పూజ.. రూ.10 లక్షలు దొబ్బేసిన అఘోరీ!

లేడీ అఘోరీ మరోమోసం బయటపడింది. యోని పూజ పేరుతో రూ.10లక్షలు దోచేసినట్లు ఓ మహిళా నిర్మాత మొకిలా పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో అఘోరీపై 308(5), 318(1),351(4),352 BNS సెక్షన్లకింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

New Update

 Aghori: లేడీ అఘోరీ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పూజల పేరిట భారీ మోసాలకు పాల్పడ్డట్లు  సైబరాబాద్‌ మొకిలా పీఎస్‌లో కేసు నమోదైంది. యోని పూజ చేస్తానంటూ రూ.10 లక్షలు తీసుకుని మోసం చేసిందంటూ మహిళా నిర్మాత ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఉజ్జయినిలోని ఫాంహౌస్‌కి తీసుకెళ్లి పూజ చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. రెండు విడతలుగా అఘోరీకి రూ. 10 లక్షలు ఇచ్చినట్లు తెలిపింది. దీంతో ఫిబ్రవరి 25న అఘోరీపై 308(5), 318(1),351(4),352 BNS సెక్షన్లకింద ఎఫ్ఐఆర్ నమోదైంది. 

Also Read: పిల్లలు థియేటర్ వైపు రావొద్దు.. హిట్-3 సెన్సార్ షాకింగ్ రిపోర్ట్

ప్రగతి రిసార్ట్స్ కు వెళ్లి..

పోలుసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రొడ్యూసర్ లేడీ అఘోరీతో 6 నెలల క్రితం పరిచయం అయినట్లు చెప్పింది. దీంతో ప్రొద్దటూర్ లోని ప్రగతి రిసార్ట్స్ కు అఘోరిని డిన్నర్ కు పిలవగా వచ్చినట్లు తెలిపింది. అప్పటి నుంచి ఫోన్ చేస్తూ తన వ్యక్తిగత విషయాలు తెలుసుకుంది. ఒక పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని నమ్మించింది. అది కూడా ప్రైవేట్ పార్ట్ యోని  పూజ అని చెప్పడంతో నిర్మాత పూజకు అంగీకరించింది. 

Also Read: మేటర్ పెద్దదే..! ఇంట్లో వాళ్ళతో మాత్రం అస్సలు చూడకండి..

ఈ క్రమంలోనే పూజ సామాగ్రి కోసం మొదట రూ. 5 లక్షలు అఘోరీ అకౌంట్ లో వేసింది. మొదటిసారి యూపీలోని ఉజ్జయిని ఫాం హౌస్ తీసుకెళ్లి పూజ చేసింది. ఆ తర్వాత మరో రూ.5 లక్షలు ఇవ్వాలని అడిగింది. లేదంటే పూజ విఫలమై ఫ్యామిలీ మొత్తం నాశనం అవుతుందని భయపెట్టింది. భయంతోనే మరో 5 లక్షలు అకౌంట్ లో వేసింది. మొత్తం రూ.10 లక్షలు పంపించినట్లు ఫిర్యాదులో మహిళా నిర్మాత పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. 

 cheating | producer | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment