/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-6-16.jpg)
Ration shop
Ration cards : మీరు తెలంగాణలో నివసిస్తారా? మీకు రేషన్ కార్డు ఉందా? ఉంటే మీకు ఇప్పటినుంచి షాపుల్లో బియ్యం కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం ఇచ్చేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. అనేక ఏండ్ల నుంచి రేషన్ కార్డుద్వారా దొడ్డు బియ్యం మాత్రమే ఇస్తున్నారు. చాలామంది పేదలు ఆ బియ్యాన్నే తింటున్నారు. దొడ్డు బియ్యం తినలేనివారు వాటిని దోస,ఇండ్లి పిండికోసం వినియోగిస్తున్నారు. దానికి కూడా వినియోగించలేని వారు బయట అమ్ముకుంటున్నారు. తద్వారా వచ్చిన డబ్బులతో సన్నబియ్యం కొనుక్కుంటున్నారు. అయితే దీన్ని నివారించడానికి ప్రభుత్వమే సన్నబియ్యం ఇవ్వడానికి సిద్ధపడింది.
ఇది కూడా చూడండి: TG JOBS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 50 వేల ఉద్యోగాలకు సీఎం గ్రీన్ సిగ్నల్!
ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో సన్నబియ్యం కేజీ రూ. 50 నుంచి రూ.70 మధ్య పలుకుతోంది. దీంతో చాలామంది అంతా డబ్బులు పెట్టలేక దొడ్డుబియ్యమే తింటున్నారు. అందుకే ఇక నుంచి అంత డబ్బు పెట్టి బయట కొనకుండా ఉచితంగానే రేషన్ కార్డుపై సన్నబియ్యం ఇవ్వాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఒక్కో సభ్యుడికి 6 కేజీల చొప్పున ఎంత మంది ఉంటే అన్ని ఆరు కేజీల ఉచిత సన్న బియ్యం ఇచ్చేందుకు రేవంత్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఇది కూడా చదవండి: ఇలా తింటే కరివేపాకుతో కూడా బరువు తగ్గొచ్చు
ఈ ఖరీఫ్ సీజన్‌లో రైతుల నుంచి తెలంగాణ పౌర సరఫరాల సంస్థ 53.95 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన వడ్లను మిల్లర్లకు కేటాయించగా.. ప్రస్తుతం అక్కడ కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) జరుగుతోంది. గతంలో కంటే ఈసారి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు సన్న ధాన్యం అధిక మొత్తంలో వచ్చింది. సన్న, దొడ్డు వడ్లను వేర్వేరుగా నిల్వచేసిన పౌరసరఫరాల అధికారులు వాటిని విడివిడిగా మిల్లింగ్ చేయిస్తున్నారు. మిల్లింగ్‌లో సన్న ధాన్యానికే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. రేషన్‌కార్డుదారులకు పంపిణీ చేసేందుకు రేవంత్ సర్కార్ ఈ సన్న బియ్యాన్ని తీసుకుంటోంది.
ఇది కూడా చదవండి: Nalgonda: పంటపోలాల్లో నోట్ల కట్టల కలకలం.. బ్యాంక్ పేరు చూసి కంగుతిన్న పోలీసులు!
వడ్ల సీఎంఆర్ ఫిబ్రవరి 20 వరకు 22 శాతం పూర్తయ్యింది. మెుత్తం 7.90 లక్షల టన్నుల బియ్యం రాగా.. ఇందులో 5.37 లక్షల టన్నుల బియ్యం సన్న రకంగా అధికారులు తెలిపారు. ఈ సన్న బియ్యాన్ని రేషన్ కార్డుల ద్వారా పేదలకు పంపిణీ చేయనున్నారు. ఈ ఏడాది ఉగాది నుంచి రేషన్ కార్డులపై సన్నబియ్యం ఇచ్చేందుకు సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే పేదలు డబ్బులు పెట్టి బయట సన్నబియ్యం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉండదు.
ఇది కూడా చదవండి: SLBC UPDATES: టన్నెల్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. ఉబికివస్తున్న ఊటనీరు!
మరోవైపు ప్రభుత్వం మార్చిలో కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వాలని భావిస్తోంది. దీంతో కార్డుదారుల సంఖ్య మరింత పెరగనుంది. అయితే పెరిగే కార్డులను కూడా దృష్టిలో పెట్టుకుని సన్నబియ్యాన్ని సేకరించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సేకరించిన బియ్యాన్ని కార్డుదారులకు సకాలంలో అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది.
ఇది కూడా చూడండి: This Week Movies: మహాశివరాత్రి స్పెషల్.. థియేటర్, ఓటీటీలో సినిమాల జాతర! లిస్ట్ ఇదే