/rtv/media/media_files/2025/03/12/tAjbVZ4KT7wSVy9TK9qC.jpg)
High Court for the State of Telangana
KTR Drone Flying Case: మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శించిన సందర్భంలో తనపై మహదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును కొట్టివేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు.కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‍పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. కేటీఆర్ పై తప్పుడు కేసు పెట్టారని, వెంటనే కొట్టివేయాలని కేటీఆర్ తరఫు న్యాయవాది హైకోర్టుని కోరారు.
Also Read: రెచ్చిపోయిన పోలీసులు.. రచ్చ చేశారంటూ యువతకు గుండ్లు కొట్టించి ఊరేగింపు
కేటీఆర్ గతేడాది తన అనుచరులతో కలిసి అనుమతులు లేకుండా మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించారని, అలాగే డ్రోన్ ఎగరవేశారంటూ కేటీఆర్ సహా మరికొంతమందిపై కేసులు నమోదు అయ్యాయి. అయితే, బుధవారం విచారణ సందర్భంగా.. ఎలాంటి ఆధారాలూ లేకుండా మహదేవ్‍పూర్ పోలీసులు కేటీఆర్‍పై కేసు నమోదు చేశారని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. డ్రోన్ ఎగురవేశారని అనడానికి ఎలాంటి సాక్ష్యాలూ లేవని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
Also Read: హైజాక్ నుంచి 104మందిని రక్షించిన పాక్ ఆర్మీ..16 మంది ఉగ్రవాదులు హతం
సాక్ష్యాలు లేకపోయినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే కేసు పెట్టినట్లు న్యాయవాది ఆరోపించారు. ఈ మేరకు నమోదైన ఎఫ్ఐఆర్‍ను వెంటనే కొట్టివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే తెలంగాణ రాష్ట్రానికి మేడిగడ్డ ప్రాజెక్టు ఎంతో కీలకమని హైకోర్టుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ నిషిద్ధ ప్రాంత జాబితాలో ఉందని, అనుమతి లేకుండా ప్రాజెక్ట వద్దకు వెళ్లి డ్రోన్ ఎగురవేశారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీని వల్ల డ్యాం భద్రతకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పీపీ చెప్పుకొచ్చారు. ఇరువర్గాల వాదనలూ విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈనెల 18వ తేదీకి వాయిదా వేసింది.
Also Read: కొనసాగుతున్న టారిఫ్ వార్..కెనడా మెటల్స్ మీద 50శాతం సుంకాలు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేడిగడ్డ కుంగిపోవడంపై గతేడాది పెద్దఎత్తున రాజకీయ రగడ చెలరేగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై పెద్దఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. దీన్ని ఖండిస్తూ బీఆర్ఎస్ నేతలతో కలిసి మాజీ మంత్రి కేటీఆర్ గతేడాది జులై 16న మేడిగడ్డ సందర్శనకు వెళ్లారు. కాగా, అప్పుడే డ్యాం పరిస్థితిని తెలుసుకునేందుకు డ్రోన్ ఎగరవేశారంటూ కేటీఆర్‍పై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు మహదేవ్‍పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దీనిపై విచారణ సందర్భంగా కేసు కొట్టివేయాలని కేటీఆర్ కోరారు.
రేవంత్‌రెడ్డి క్వాష్ పిటిషన్‌పై విచారణ
మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి మల్కా జిగిరి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు జన్వాడ ఫాంహౌస్‌పై డ్రోన్ ఎగురవేసిన కేసులో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. డ్రోన్ ఎగురవేతకు సంబంధించి రంగారెడ్డి జిల్లా కోర్టులో ఉన్న కేసును కొట్టివేయాలని కోరుతూ రేవంత్‌రెడ్డి 2020లో హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె. లక్ష్మణ్ ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. రేవంత్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది ఎస్. నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌పై పెట్టిన సెక్షన్లకు జరిగిన నేరానికి సంబంధం లేదని తెలిపారు.
ఇది కూడా చదవండి: వివేకా హత్య జరిగిన రోజు అసలేం జరిగిందంటే.. అసెంబ్లీలో సంచలన విషయాలు చెప్పిన చంద్రబాబు!
ఏడేళ్లలోపు శిక్షపడే నేరాలకు నోటీసులు ఇవ్వాల్సి ఉండగా పోలీసులు అత్యుత్సాహంతో రేవంత్‌ను 18రోజులు జైల్లో పెట్టారని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్‌రావుకు ఆదేశాలు జారీచేసింది. పోలీసులు రికార్డు చేసిన ఐదుగురు సాక్షుల వాంగ్మూలాలు, జన్వాడ ఫాంహౌస్ నిషేధిత ప్రాంతంలో లేదని నిరూపించేలా జీవో నెంబర్ 92ను సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 19కి వాయిదా పడింది.
Also Read: ఏపీలో ఎండలు,వేడిగాలులు...ఈ జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరికలు!