/rtv/media/media_files/2025/03/13/1CsqFCDxF8qwATTATO88.jpg)
TS Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిల మధ్య వార్ నడించింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఫైరయ్యారు. 36 నిమిషాల గవర్నర్ ప్రసంగంలో 360 అబద్దాలు చెప్పించారని ప్రభుత్వంపై జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. రైతు రుణమాఫీ పూర్తిగా కాలేదని.. రైతు బంధు డబ్బులు పడక అన్నదాతాలు ఇబ్బంది పడుతున్నారని చెప్పుకొచ్చారు. మహిళలకు స్కూటీలు ఇచ్చారా.. రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చారా అని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు.
నువ్వేంత అంటే నువ్వేంత
జగదీష్ రెడ్డి మాట్లాడుతుండగా అడ్డుకున్న మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మీ హయాంలో ఏం చేశారో చెప్పాలన్నారు. దళితుడిని సీఎం చేశారా.. వారికి మూడెకరాల భూమి ఇచ్చారా.. రుణమాఫీ చేశారా అని నిలదీశారు. కేసీఆర్ మ్యానిఫెస్టోలో రైతులకు చెప్పింది ఒకటి చేసింది ఇంకోటని ఆరోపించారు. ఏడాదిలో తాము చెప్పినవన్నీ చేశామని.. మిగిలిన నాలుగేళ్లలో ఇంకా చేస్తామని తెలిపారు.
దీంతో మధ్యలో కలగజేసుకున్న ఎమ్మెల్యే తలసాని నువ్వేంత అంటే నువ్వేంత అని పోతే సభ నడుస్తుందా.. తాము మాట్లాడేటప్పుడు అధికార పక్ష నేతలు అడ్డు తగలకపోతే సభ సజావుగా నడుస్తుందని చెప్పుకొచ్చారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలను తలసాని ఖండించారు, కాంగ్రెస్ నాయకులు గవర్నర్ ప్రసంగం కాకుండా మిగతా అంశాలను మాట్లాడుతున్నారని అన్నారు. సభలో సభ్యులందరికీ నిబంధనలు అనేవి సమానంగా ఉంటాయని వాటిని పాటించాలన్నారు. అధికార, విపక్ష నేతల ఆందోళనల నడుమ సభ వాయిదా పడింది.
సభలో జగదీశ్ రెడ్డి తీరు దారుణమని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. స్పీకర్ ను పట్టుకుని జగదీశ్ రెడ్డి నువ్వు అంటూ సంభోదించడం తప్పన్నారు. దళిల స్పీకర్ ను అవమానించిన జగదీశ్ రెడ్డి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పీకర్ కు జగదీశ్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.