/rtv/media/media_files/2024/11/20/8TL1QnVDd0qt87vvOIBi.jpg)
తెలంగాణలో మద్యం అమ్మకాలు జోరుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2024-25 ఆర్థిక సంవత్సరంలో జరిగిన మద్యం అమ్మకాలకు సంబంధించిన వివరాలను ఎక్సైజ్ శాఖ తాజాగా వెల్లడించింది. సంవత్సర కాలంలో సుమారు రూ.35 వేల కోట్ల ఆదాయం.. మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్ర ఖజానాకు చేకూరిందంటే.. లిక్కర్ అమ్మకాలు తెలంగాణలో ఏ రేంజ్‌లో నడుస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే.. ప్రభుత్వం కొత్త బ్రాండ్లను ఆహ్వానించిన నేపథ్యంలో.. దేశీయ, విదేశీ మద్యం కంపెనీల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వందల సంఖ్యలో కొత్త బ్రాండ్ల అమ్మకాల అనుమతుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.
Also Read:Waqf Amendment Act: అమలులోకి వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం 2025.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం
కాదా.. మద్యం అమ్మకాల అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని సమాచారం. మొత్తం 604 కొత్త మద్యం బ్రాండ్లకు అమ్మకాల అనుమతులు కోరుతూ 92 మద్యం సరఫరా కంపెనీలు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఈ దరఖాస్తుల సంఖ్య చూస్తేనే.. తెలంగాణలో లిక్కర్ అమ్మాకల్లో పోటీ ఏ స్థాయికి చేరింది అన్నది ఇట్టే తెలిసిపోతుంది.
ఎక్సైజ్ శాఖ వర్గాల సమాచారం మేరకు.. ఇప్పటివరకు వచ్చిన ఈ దరఖాస్తుల్లో 331 బ్రాండ్లు దేశీయంగా తయారయ్యే ఇండియన్ మెడ్ లిక్కర్ కు చెందినట్టుగా తెలుస్తోంది. అంటే దేశీయ బ్రాండ్లకు తెలంగాణ రాష్ట్రం కీలక మార్కెట్‌గా మారుతోందని స్పష్టమవుతోంది. స్థానికంగా తయారయ్యే మద్యం బ్రాండ్లకి వాణిజ్యంగా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు.. 273 బ్రాండ్లు విదేశీ మద్యం కు చెందినవిగా తెలుస్తోంది. గ్లోబల్ లిక్కర్ కంపెనీలు తెలంగాణ మార్కెట్‌లోకి ప్రవేశించి తమ ఉనికిని పెంచుకునేందుకు ఆసక్తిగా చూపిస్తున్నట్టు తెలుస్తోంది. భారతదేశంలో స్పీడ్‌గా ఎదుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటిగా ఉంది. దీంతో విదేశీ కంపెనీలు ఇక్కడ తమ బ్రాండ్లకు మార్కెట్ ఏర్పాటుచేయాలనే ఉద్దేశంతో ముందుకొస్తున్నాయి.
ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో 47 కొత్త కంపెనీలు 386 బ్రాండ్లకు అనుమతులు కోరినట్టు సమాచారం. అలాగే 45 పాత కంపెనీలు 218 బ్రాండ్లకి అనుమతులు కోరినట్టు తెలుస్తోంది. వెల్లువలా వస్తున్న దరఖాస్తులను చూస్తుంటే.. కొత్త కంపెనీలు కూడా తెలంగాణ లిక్కర్ మార్కెట్లో స్థానం సంపాదించేందుకు ఎంత ఉత్సాహంగా ఉన్నాయో తెలుస్తోంది.
అయితే.. తెలంగాణలో మద్యం అమ్మకాలు ఇప్పటికే భారీ స్థాయిలో ఉన్నాయి. కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇవ్వడం ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయం మరింతగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వానికి లిక్కర్ నుంచి వచ్చే ఆదాయం ప్రధాన వనరుగా గత కొన్నేళ్లుగా కొనసాగుతోంది.అయితే.. ఈ కొత్త బ్రాండ్ల అనుమతుల ప్రక్రియకు సంబంధించి అధికారుల పరిశీలన, నియంత్రణ చర్యలు కీలకంగా మారనున్నాయి. అప్రామాణిక బ్రాండ్లు, నకిలీ ఉత్పత్తులు మార్కెట్‌లోకి రావాటాన్ని నివారించేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
liquor | telangana | telangana liquor sales | telangana-liquor-shops-tenders | telangana liquor production increase | latest-news | telugu-news | latest telugu news updates
రాష్ట్రంలో త్వరలో కొత్త విద్యుత్ విధానం: భట్టి విక్రమార్క
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగులకు సరైన టైమ్‌లో జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేదని భట్టి విక్రమార్క అన్నారు. సంక్షేమ పథకాలకు తమ ప్రభుత్వం రూ.61 వేల కోట్లు వెచ్చించిందని తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలో కొత్త విద్యుత్ విధానాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగులకు సరైన టైమ్‌లో జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేదని అన్నారు. సంక్షేమ పథకాలకు తమ ప్రభుత్వం రూ.61 వేల కోట్లు వెచ్చించిందని తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. '' బీఆర్‌ఎస్ రూ.7 లక్షల కోట్లు అప్పులు చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.52 వేల కోట్లు అప్పు చేశాం.
Also Read: ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత.. రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం
అప్పులను బ్యాంకులకు తిరిగి కట్టే పరిస్థితి తీసుకొచ్చారు. వీటికి అదనపు ఆదాయం కలిపి బ్యాంకులకు కట్టే పరిస్థితి వచ్చింది. సంక్షేమ పథకాల కోసం రూ.61 వేల కోట్లు ఖర్చు చేశాం. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, చేయుతా, ఆరోగ్య శ్రీ పథకాలకు నిధులు అందించాం. ప్రతిరోజూ అడ్డగోలుగా ఏదో ఒకటి మాట్లడటమే బీఆర్‌ఎస్ నేతలు పనిగా పెట్టుకున్నారు. త్వరలోనే రాష్ట్రంలో కొత్త విద్యుత్ విధానాన్ని ప్రకటిస్తాం.
Also Read: వడ్డీ రేట్లు యథాతథమే..ఎలాంటి మార్పులు లేవు:ఆర్బీఐ గవర్నర్!
అందరూ వద్దని చెప్పినా కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వం భద్రాద్రి విద్యుత్ ప్రాజెక్టును కట్టింది. కేంద్ర ప్రభుత్వం చేసిన ఆలస్యం వల్ల భద్రాద్రి ప్రాజెక్టుపై 42 శాతం అదనపు భారం పెరిగింది. ప్రాజెక్టు కోసం పెరిగే ధరలన్నీ కూడా చివరికీ ప్రజలపై భారం వేశారు. విద్యుత్ రంగం గురించి బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేశారు. మీరు చేసిన తప్పులను మేము తిప్పికొట్టాం.
Also read: ఈ ఆలయానికి కేజీ బంగారం, రూ.23 కోట్ల విరాళాలు.. ఇంకా లెక్కుంది
విద్యుత్ విషయానికి సంబంధించి సమగ్ర వివరాలను అందించాం. గతేడాదికంటే విద్యుత్ డిమాండ్ పెరిగినా కూడా క్వాలిటీగా విద్యుత్‌ను ఇస్తున్నాం. విద్యుత్ సరఫరాలో వచ్చిన ఇబ్బందులను గుర్తించాం. ఉత్పత్తి కేంద్రాల సమాచారం గురించి ప్రజలకు వివరించాం. థర్మల్ ఎనర్జీ వల్ల కాలుష్యం దారుణంగా పెరుగుతోందని'' భట్టి విక్రమార్క అన్నారు.
Also Read: ఉత్తరప్రదేశ్ లో ఘోరం.. జన్మనిచ్చిన కాసేపటికే లిఫ్ట్ కుప్పకూలి..
Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!
తెలంగాణలో కొత్త బ్రాండ్ల అమ్మకాల అనుమతుల కోసం మద్యం కంపెనీలు ఎగబడుతున్నాయి. ఇప్పటివరకు 92 మద్యం సరఫరా కంపెనీలు 604 కొత్త బ్రాండ్లకు అనుమతి కోరుతూ దరఖాస్తులు పెట్టుకున్నాయి.Short News | Latest News In Telugu | తెలంగాణ
🔴Live News: ఏపీలో ఏప్రిల్ 15 నుంచి మరో కొత్త ప్రొగ్రామ్..
Rain Alert : తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక
రానున్న మూడురోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. Short News | Latest News In Telugu | వాతావరణం
TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!
భద్రాధ్రికొత్తగూడెం జిల్లా జడ్ వీరభధ్రాపురంలో చేతబడి నెపంతో సొంత బాబాయినే కిరాతకంగా హత్య చేశాడు ఓ యువకుడు. క్రైం | Short News | Latest News In Telugu | ఖమ్మం | తెలంగాణ
Gym Trainer Kills : జిమ్ నిర్వాహకుడిని చంపిన యువకుడు.. డంబెల్స్‌తో కొట్టి కొట్టి....
జిమ్ ట్రైనర్ పై డంబెల్ తో దాడి చేసిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Allu Arjun : అల్లు అర్జున్ నివాసం వద్ద ఉద్రిక్తత...భారీకేడ్లు తోచుకుని.
టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అభిమానులు భారీగా చేరుకొని సందడి చేశారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Bank Merger: మే 1 నుంచి ఏపీలో ఆ బ్యాంకులు కనిపించవ్..
Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!
USA-China: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..
PBKS VS CSK: పంజాబ్ విజయం..ఇక చెన్నై ఇంటికే..
Renu Desai: నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది..రేణూ దేశాయ్