Crime News: తన కొడుకును చిన్నచూపు చూస్తున్నారని.. తోడికోడలి కుమారుడిపై దారుణం

తన కొడుకును‌ ఇంట్లో చిన్నచూపు చూస్తున్నారని కోపంతో రగిలిపోయిన మహిళ తోడికోడలి కుమారుడిపై దారుణానికి ఒడిగట్టింది. నాలుగేళ్ల చిన్నారికి యాసిడ్‌ తాగించింది. ఈ ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో తీవ్ర సంచలనం సృష్టించింది. 

New Update
FotoJet (80)

acid

Crime News:  రోజురోజుకు స్వార్థం పెరిగి పోయి మానవత్వానికి అర్థం లేకుండా పోతుంది. దీంతో ఒకరిపై ఒకరు కక్షలు పెంచుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలకే కోపాలు పెంచుకుని పెద్ద తప్పిదాలకు ఒడిగడుతున్నారు. తన కొడుకును‌ ఇంట్లో చిన్నచూపు చూస్తున్నారని కోపంతో రగిలిపోయిన మహిళ తోడికోడలి కుమారుడిపై దారుణానికి ఒడిగట్టింది. నాలుగేళ్ల చిన్నారికి యాసిడ్‌ తాగించింది. ఈ ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. 

పోలీసులు కథనం ప్రకారం మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని బోడుప్పల్ శ్రీనివాస కాలనీలో నివాసం ఉండే  పర్వతం సతీష్ కుమార్, అంజమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులున్నారు. వారి పేర్లు నాగరాజు, జగదీష్ . వారిద్దరికి పెళ్లిళ్లు అయ్యి, పిల్లలు కూడా ఉన్నారు. అయితే అంతా ఒకే ఇంట్లో  ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నారు. ఈ క్రమంలో సతీష్‌ కుమార్‌ తన మనవలు, మనవరాళ్లతో సరదగా ఆడుకుంటుండేవాడు. ఈ క్రమంలో పెద్ద కుమారుడి కొడుకు (4)పై తాత సతీష్‌ కుమార్‌ ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడని, తన బిడ్డను మాత్రం పట్టించుకోవడం లేదని చిన్న కోడలు మంజుల ఆ చిన్నారితో పాటు కుటుంబంపై కక్ష పెంచుకుంది.

ఇదిలా ఉండగానే ఇటీవల సతీష్‌ కుమార్‌ తన చేతిపై పెద్ద కుమారుడి కొడుకు పేరు టాటూ వేయించుకున్నాడు. దీంతో మంజుల మరింత రగిలిపోయింది. తన కుమారుడిని పట్టించుకోవడం లేదని కక్ష పెంచుకుంది. అదే సమయంలో తోడి కోడలు కొడుకును చంపేయాలని నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలోనే ఒకరోజు ఇంట్లో చిన్నారి నోరు, ముక్కు మూసి చేతులు పట్టుకుని చంపే ప్రయత్నం చేసింది. అయితే బాలుడి తల్లి గమనించి, ప్రశ్నించడంతో ఆడుకుంటున్నామని చెప్పి తప్పించుకుంది.  అంతటితో ఆగకుండా మరోరోజు ఆ బాలుడిని ఇంటిపై అంతస్తుకు తీసుకెళ్లి రెయిలింగ్‌పై కూర్చోబెట్టింది.  అయితే దాన్ని గమనించిన తాత సతీష్‌  ఆమెను మందలించడంతో ఆ రోజు కూడా చిన్నారి బతికిపోయాడు.‌ ఈ నెల 9న మంజుల చిన్నారిని కిచెన్‌లోకి తీసుకెళ్లి జ్యూస్ తాగితే చాక్లెట్ ఇస్తానని నమ్మించింది. అ క్రమంలో యాసిడ్ తాగించింది. దీంతో బాలుడు అపస్మారక స్థితికి చేరుకోవడంతో  పరిస్థితి గమనించిన తల్లిదండ్రులు సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ప్రస్తుతం చిన్నారి కోలుకుంటున్నాడు.  బుధవారం రాత్రి చిన్నారి తల్లి.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

Advertisment
తాజా కథనాలు