/rtv/media/media_files/2025/02/15/08yilCwEmtyuNK0Ycyir.jpg)
Madhavi Latha Vs JC Prabhakar Reddy
Madhavi Latha Vs JC Prabhakar Reddy: తాడిపత్రి టీడీపీ(Tadipatri TDP) మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. జేసీపై కేసు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. సినీ నటి, బీజేపీ నేత మాధవీలత ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. తనను కించపరిచేలా మాట్లాడారంటూ మాధవీలత ఫిర్యాదులో వెల్లడించింది. జేసీ అనుచరులు, అభిమానులు తనను చంపుతామని.. బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది మాధవీలత.
Also Read: Maha Kumbh Mela: మహా కుంభమేళాకు 50 కోట్ల మంది భక్తులు.. యూపీ సర్కార్ సంచలన ప్రకటన
అంతేకాకుండా జేసీ నుంచి తనకు ప్రాణహాని ఉందని కూడా తెలిపింది మాధవీలత. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేసీపై కేసు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. కాగా న్యూఇయర్ వేడుకల సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, మాధవీలత మధ్య మాటల యుద్ధం నడించింది. జేసీ ఏర్పాటు చేసిన న్యూ ఇయర్ వేడుకులకు వెళ్లొద్దంటూ మాధవీలత కామెంట్ చేయగా.. మాధవీలత కామెంట్స్ తప్పుబడుతూ అనుచితంగా మాట్లాడారు జేసీ.
Also Read: Horoscope Today:ఈ రోజు ఈ రాశివారు ప్రయాణాలు వాయిదా వేసుకుంటే బెటర్!
ఇంతకీ ఏం జరిగిందంటే
తాడిపత్రిలోని జేసీ పార్కులో డిసెంబర్ 31న జేసీ ప్రభాకర్ రెడ్డి న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఈ వేడుకలను ఏర్పాటు చేశారు. అయితే ఈ వేడుకలకు మహిళలు వెళ్లొద్దని, వారి రక్షణకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందంటూ మాధవిలత వీడియో రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద స్పందించిన జేసీ ప్రభాకర్ రెడ్డి మాధవీలతపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు.
Also Read : RCB vs GG : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో ఆర్సీబీ శుభారంభం
మరోవైపు మాధవి లతపై చర్యలు తీసుకోవాలని టీడీపీ మహిళా కౌన్సిలర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జేసీ చేసిన వ్యాఖ్యలపై మాధవి లత, బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తీరును తప్పుపట్టారు. జేసీపై చర్యలు తీసుకోవాలంటూ సీఎం చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పడం గమనార్హం. ఆవేశంలో అలా అన్నానని , అలా మాట్లాడటం తప్పేనని క్షమాపణలు కోరారు. కాగా మాధవీలత జేసీపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో, హెచ్‌ఆర్సీకి కూడా ఫిర్యాదు చేశారు.
Also Read : వల్లభనేని వంశీ అరెస్ట్..ఏపీ హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు!