Ravindra Bharathi : హైటెక్ సిటీకి సాంస్కృతిక కళ...మాదాపూర్‌లో మరో రవీంద్ర భారతి..

 హైదరాబాద్‌ నగరవాసులకు గుడ్‌ న్యూస్‌..నగరంలో త్వరలోనే మరో రవీంద్ర భారతి అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం అసెంబ్లీ ఎదురుగా ఉన్న రవీంద్రభారతి తరహాలోనే మాధాపూర్‌ ప్రాంతంలో  కేంద్ర ప్రభుత్వం మరోక సాంస్కృతిక కేంద్రాన్ని  ఏర్పాటు చేస్తోంది.

New Update
FotoJet (49)

Hyderabad new Ravindra Bharathi

Hyderabad new Ravindra Bharathi :  హైదరాబాద్‌ నగరవాసులకు గుడ్‌ న్యూస్‌..నగరంలో త్వరలోనే మరో రవీంద్ర భారతి అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం అసెంబ్లీ ఎదురుగా ఉన్న రవీంద్రభారతి తరహాలోనే మాధాపూర్‌ ప్రాంతంలో  కేంద్ర ప్రభుత్వం మరోక సాంస్కృతిక కేంద్రాన్ని  ఏర్పాటు చేస్తోంది. సుమారు రూ.23 కోట్ల వ్యయంతో ఈ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ఐటీ కారిడార్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలోని కళాకారులు, ప్రజలకు అందుబాటులో ఉండేలా మాదాపూర్‌లో ఉన్న సెంటర్‌ ఫర్‌ కల్చరల్‌ రిసోర్స్‌ అండ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ప్రాంగణంలో ఆధునిక సౌకర్యాలతో కల్చరల్‌ సెంటర్‌ను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ సెంటర్‌ను మంజూరు చేయించారు. కాగా, ఇప్పటికే 60 నుంచి 70 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి పూర్తిస్థాయిలో ఈ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. అవసరమైతే అదనపు నిధులు మంజూరు చేయించి.. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సెంటర్‌ను తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది.

నిర్మాణ పనులను పరిశీలించిన కేంద్రమంత్రి

కాగాహైదరాబాద్ మాదాపూర్‌లోని సీసీఆర్‌టీ ఆవరణలో రూ. 23 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న అత్యాధునిక సాంస్కృతిక కేంద్రం నిర్మాణ  పనులను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీ కారిడార్‌లోని కళాకారులకు అందుబాటులో ఉండేలా ఈ కేంద్రాన్ని నిర్మిస్తున్నామన్నారు.. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి సెంటర్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు