స్కిల్ యూనివర్సిటీలో కోర్సులు ప్రారంభం.. దరఖాస్తులకు ఆహ్వానం

తెలంగాణలో నవంబర్ 4 నుంచి స్కిల్ యూనివర్సిటీలో కోర్సులు ప్రారంభం కానున్నాయి. లాజిస్టిక్స్, ఈ కామర్స్, హెల్త్‌కేర్ తదితర విభాగాల్లో యువతకు స్కిల్స్ పెంపొందించేలా ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈ నెల 29లోపు దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించారు.

New Update
Students

తెలంగాణలో నవంబర్ 4 నుంచి స్కిల్ యూనివర్సిటీలో కోర్సులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు వాణిజ్య, పరిశ్రమలశాఖ ఈ వివరాలు వెల్లడించింది. లాజిస్టిక్స్, ఈ కామర్స్, హెల్త్‌కేర్, ఫార్మాసుటికల్స్, లైఫ్‌సైన్సెస్ విభాగాల్లో యువతకు స్కిల్స్ పెంపొందించే విధంగా ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈ నెల 29లోపు దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించారు. ప్రస్తుతం స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం జరుగుతుండటంతో దీన్ని తాత్కాలికంగా రాయదుర్గంలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో నిర్వహించున్నారు. ఇప్పటికే ఆ ప్రాంగణంలో ఉన్న రెండు భవనాలను స్కిల్ యూనివర్సిటీకి కేటాయించారు. ప్రస్తుతం ప్రాధాన్యం ఊన్న కోర్సులను ప్రారంభిస్తున్నామని.. ఆ తర్వాత క్రమంగా కోర్సుల సంఖ్యను పెంచుతామని అధికారులు తెలిపారు. 

Also Read: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. సమగ్ర కులగణనపై ఉత్తర్వులు జారీ

Advertisment
Advertisment
తాజా కథనాలు