Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ లో కీలక మార్పులు.. మున్షీ ఔట్.. కొత్త ఇన్‌ఛార్జ్ ఎవరంటే?

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి దీపాదాస్ మున్షీని తప్పించాలని హైకమాండ్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో సచిన్ పైలట్, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్, మాజీ ఎంపీ బీకే హరిప్రసాద్ లో ఒకరికి అవకాశం దక్కే ఛాన్స్‌ ఉందని సమాచారం.

New Update
Telangana Congress In charge

Telangana Congress In charge

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ(Deepa Dasmunsi)ని తప్పించేందుకు రంగం సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వాన్ని, పార్టీని సమన్వయం చేయడంలో ఆమె ఫెయిల్ అయ్యారని హైకమాండ్ భావించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. చేరికల విషయంలో పార్టీ ముఖ్యులను, సీఎంను సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు సైతం ఆమెపై ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల సమయంలో మున్షీ అత్యంత కీలకంగా వ్యవహరించారు. అయితే.. ఆ ఎన్నికల్లో పార్టీ కేవలం 8 సీట్లకు మాత్రమే పరిమితమైంది.


ఇది కూడా చదవండి: BIG BREAKING: ''రేవంత్ కు బిగ్ షాక్.. ఆ 25 ఎమ్మెల్యేలు జంప్''

మున్షీ సరిగ్గా సమన్వయం చేయలేదని.. ఆ కారణంగానే ఆశించిన ఫలితాలు రాలేదని హైకమాండ్ ఆమెపై అసంతృప్తితో ఉన్నట్లు వార్తు వచ్చాయి. ప్రభుత్వంలోనూ జోగ్యం చేసుకుంటురన్న విమర్శు ఆమెపై ఉన్నాయి. ఈ క్రమంలోనే మున్షీని తప్పించి మరొకరికి బాధ్యతలు అప్పగించాలని హైకమండ్ డిసైడ్ అయినట్లు గాంధీ భవన్ లో చర్చ జరుగుతోంది. 


ఇది కూడా చదవండి: BC Reservations : వాళ్లకోసమే మరోసారి సర్వే.. మంత్రి పొన్నం క్లారిటీ

 

Also Read:  మరో మీర్ పేట్.. ప్రేమించిందని బిడ్డను ముక్కలుగా నరికి.. ఆ కసాయి తండ్రి ఏం చేశాడంటే.. !?

సచిన్ పైలట్ కే ఛాన్స్..?

తెలంగాణకు ఇన్ఛార్జిగా వచ్చేందుకు అనేక మంది నేతలు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న సచిన్ పైలట్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రేసులో ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్, మాజీ ఎంపీ బీకే హరిప్రసాద్ కూడా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం సచిన్ పైలట్ నే తమకు ఇన్ఛార్జిగా పంపించాలని హైమాండ్ పెద్దలను కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని సచిన్ పైలట్ ను కలవడం కూడా ఈ నేపథ్యంలోనే జరిగినట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే మరో రెండు వారాల్లో తెలంగాణకు కొత్త ఇన్‌ఛార్జ వస్తారన్న టాక్ వినిపిస్తోంది. 

Also Read: బిర్యానీ పంచాయితీ.. కస్టమర్లపై హోటల్‌ యాజమాన్యం దాడి

Advertisment
Advertisment
Advertisment