Bandi Sanjay : కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు దేశాన్ని విభజింటే కుట్ర.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు దేశాన్ని విభజించేందుకు కుట్ర పన్నుతున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌లో మీడియా సమావేశంలో బండి మాట్లాడుతూ..ఆ రెండు పార్టీలు దేశ విభజనకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.

New Update
 Union Minister Bandi Sanjay

Union Minister Bandi Sanjay

Bandi Sanjay : కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు దేశాన్ని విభజించేందుకు కుట్ర పన్నుతున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగాది పండుగ సందర్భంగా ఆదివారం నాడు కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ..ఆ రెండు పార్టీలు దేశ విభజనకు కుట్ర చేస్తున్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాక రాబోయో రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని బండి సంజయ్ స్పష్టం చేశారు.

ఇది కూడా చూడండి:  Ugadi IPhone Offers: ఉగాది ఆఫర్లు.. IPHONE 15_ 6/512జీబీ ధర భారీగా తగ్గింపు- డోంట్ మిస్!

"కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్‌ కోటా కింద  సన్నబియ్యం ఇస్తామని ప్రచారం చేసుకుంటుంది.. కానీ వాటిని ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం.. అందుకే రేషన్‌కార్డు, రేషన్‌ షాపుల్లో కచ్చితంగా మోదీ ఫొటో పెట్టాలి. ప్రజలకు ఇచ్చే బియ్యం కేంద్రం ఇస్తుంది.. ఒక్క కేజీ బియ్యం మీద కేంద్రం 40 రూపాయలు ఖర్చు చేస్తే.. కాంగ్రెస్ పార్టీ.. కేవలం 10 రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తుంది. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది" అని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని.. అక్రమాలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తుందన్నారు బండి సంజయ్.  అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ కుటుంబంపై చర్య తీసుకోవాలని తెలంగాణ సమాజం, బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. కానీ రేవంత్ సర్కార్ మాత్రం పగ తీర్చుకోమంటూ చేస్తోన్న వ్యాఖ్యలని చూస్తే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ఒకే గూటికి చెందినవని జనాలకు అర్థం అవుతుందంటూఎద్దేవా చేశారు.

ఇది కూడా చూడండి: UGADI 2025: క్షణాల్లో ఉగాది పచ్చడి రెడీ .. బ్యాచిలర్స్ కూడా తయారు చేసేయొచ్చు!

 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం ఆర్థిక ప్రగతిలో దూసుకుపోతోందని, ప్రధాని చేస్తున్న కృషిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జ్యోతిష్య పండితుల ప్రకారం.. ఈ ఏడాది దొంగతనాలు పెరిగే అవకాశముందని, ప్రజా ప్రతినిధులు, అధికారులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడతారని, కొత్త వ్యాధులు ప్రబలే సూచనలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ పాలనను గమనిస్తే ఈ జ్యోతిష్య ఫలితాలు నిజమని అర్థమవుతోందని అన్నారు. కాంగ్రెస్ నేతలకు ‘కరప్షన్ వైరస్’ సోకిందని విమర్శించారు. ప్రభుత్వ కాంట్రాక్టుల నుంచి పెండింగ్ బిల్లుల వరకు ప్రతి దాంట్లోనూ కమీషన్లు తీసుకోవడం సహజమైపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ అవినీతి వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

"దక్షిణాది రాష్ట్రాల పేరుతో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. దేశ విభజనకు కుట్ర చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ దేశ ద్రోహ వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మతం పేరుతో దేశాన్ని విభజించింది. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల పేరుతో దేశ విభజకు కుట్ర చేస్తుంది. వీళ్ళను రాళ్లతో కొట్టాలి" అన్నారు బండి సంజయ్. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు కలిసే పని చేశాయని బండి సంజయ్ ఆరోపించారు. అలానే రాబోయో నగర పాలక ఎన్నికల్లో ఎంఐఎం పార్టీని గెలిపించడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ అనే అవినీతి వైరస్ సోకించిందని.. అయితే దానికి తమ పార్టీ వ్యాక్సిన్ కనుకుందన్నారు. బడా నాయకుడి నుంచి చోటా నాయకుడి వరకు అవినీతి సోకిందని.. దానికి వ్యతిరేకంగా బీజేపీ పార్టీ.. ప్రజా ఆందోళన అనే వాక్సిన్ ద్వారా కాంగ్రెస్‌పై పోరాడుతాం అని బండి స్పష్టం చేశారు.

ఇది కూడా చూడండి: Ugadi 2025 Tv Offers: ఉగాది స్పెషల్.. బ్రాండెడ్ 4k TVలపై బ్లాక్ బస్టర్ ఆఫర్లు- వదిలారో మళ్లీ దొరకవ్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు