MLC Elections : రెండు ఎమ్మెల్సీలకు పోటీ....కేసీఆర్ గేమ్ స్టార్ట్ చేశాడుగా...

తెలంగాణ రాజకీయాల్లో మాజీ సీఎం కేసీఆర్‌ చక్రం తిప్పబోతున్నారా? ఆ క్రమంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను వేదిక చేసుకోనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఇద్దరినీ పోటీలో నిలపాలని కేసీఆర్ భావిస్తున్నారు.

author-image
By Madhukar Vydhyula
New Update
KCR

KCR- MLC Elections

MLC Elections : తెలంగాణ రాజకీయాల్లో మాజీ సీఎం కేసీఆర్‌ చక్రం తిప్పబోతున్నారా? ఆ క్రమంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను వేదిక చేసుకోనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సైలెన్స్‌గా ఉన్న కేసీఆర్‌ అప్పుడప్పుడు మాట్లాడడం తప్ప మీడియా ముందుకు రాలేదనే చెప్పాలి. ఎన్నికల తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ ఆయన పాల్గొనలేదు. ఒకసారి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయడానికి, మరోమారు అసెంబ్లీ సమావేశాలకు మాత్రమే వచ్చారు. బయట కూడా మీడియాతో అంతగా మాట్లాడింది లేదు. ఈ క్రమంలో ఈ నెల 10 నుంచి అసెంబ్లీ సమావేశాలు   ప్రారంభం కానున్నాయి. 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఈ సమయంలోనే.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు అటు సీఎం రేవంత్.. ఇటు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.  

Also Read :  మూర్ఛ వ్యాధి ఎందుకు వస్తుంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా కాంగ్రెస్‌, దాని మిత్ర పక్షాలకు నాలుగు, బీఆర్‌ఎస్‌ కు ఒకటి దక్కే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 39 మంది ఎమ్మెల్యేలను గెలిసింది. తరువాతి పరిణామాల నేపథ్యంలో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సంఖ్య 29 కి చేరింది. అందులో కంటోన్మెంట్‌ ఎమ్మె్ల్యే మరణంతో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో ఆ స్థానాన్ని కూడా కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. తాజాగా  అయిదు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. ఈ క్రమంలో నాలుగు స్థానాలు దక్కించుకునే అవకాశం ఉన్న కాంగ్రెస్‌ రెండు స్థానాలను మిత్ర పక్షాలకు ఇవ్వాలనుకుంటోంది.  కాంగ్రెస్ నుంచి ఒకటి సీపీఐకు ఖరారు అయింది. ఎంఐఎంకు మరో సీటు దక్కుతుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో కాంగ్రెస్ నుంచి మూడు స్థానాల పైన కసరత్తు చేస్తున్నారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యతస్తూ అభ్యర్ధులను ఎంపిక చేస్తున్నారు. అయితే, బీఆర్ఎస్ కు ఒక స్థానం దక్కటం ఖాయంగా కనిపిస్తోంది.

ది కూడా చదవంటి:  చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో వెల్లుల్లి ఎలా పనిచేస్తుంది?

ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కొత్త వ్యూహం అమలు చేసేందుకు పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా  బీఆర్ఎస్ ఇద్దరు అభ్యర్ధులను బరిలో నిలిపే అవకాశం పైన చర్చ చేస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీలో బీఆర్ఎస్ కు 39 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉంది. తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. వీరి పైన అనర్హత వేటు వేయాల ని కోరుతూ బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టు తాజాగా ఈ కేసులో నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22 లోగా నోటీసుల పైన సమాధానం ఇవ్వాలని సూచించింది. ఇదే సమయంలో కేసీఆర్ కొత్త స్కెచ్ సిద్దం చేస్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన ఒత్తిడి పెంచే విధంగా రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేసేందుకు సిద్దం అవుతున్నట్లు గులాబీ పార్టీ నేతల సమాచారం. 

Also read : Karimnagar MLC results: కరీంనగర్ గ్రాడ్యుయేట్ MLC ఫలితాల్లో బిగ్ ట్విస్ట్

సుప్రీంలో వీరి కేసు కీలక దశకు చేరిన సమయంలో కేసీఆర్ నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది. కేసీఆర్ ఒక్క సీటుకే పోటీ చేయాలని నిర్ణయిస్తే.. ఇప్పటికే పార్టీ అభ్యర్ధి పైన నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టం అవుతోంది. ప్రధానంగా దాసోజు శ్రావణ్ కు ఎమ్మెల్సీ ఖాయంగా కనిపిస్తోంది. కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో గవర్నర్ కోటాలో శ్రావణ్ కు ఎమ్మెల్సీ సీటు పైన నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత న్యాయ పరమైన అంశాలతో అవకాశం దక్కలేదు. ఇప్పుడు బీసీకే సీటు ఇవ్వాలని గులాబీ బాస్ నిర్ణయించారు. దీంతో.. శ్రావణ్ తో పాటుగా జోగు రామన్న, బిక్షమయ్య గౌడ్ సైతం సీటు ఆశిస్తున్నారు. ప్రస్తుతం పదవీ కాలం ముగియనున్న సత్యవతి రాథోడ్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Also read :  దత్తత తీసుకున్నోళ్లకు దూరమై.. కట్టుకున్నోడి చేతిలో హతమై.. ఆ మేనమామే లేకుంటే..!

ఎస్సీ వర్గం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్, రసమయి బాల కిషన్ పేర్లు చర్చకు వచ్చాయి.  అయితే ఒక సీటుకే పోటీ చేస్తే ఆ ఒక్కటి ఎలాగు గెలుస్తుంది. కానీ పార్టీ మారిన10 మంది ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేసి ఇద్దరు అభ్యర్థులను పోటీకి నిలిపితే తప్పకుండా వారు బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఓటు వేయాల్సిందే. అలా కాదని విప్‌ను ధిక్కరిస్తే ఎమ్మెల్యే పదవికే ఎసరు వచ్చే అవకాశం ఉండటంతో వారు ఏం చేస్తారనేది చర్చనీయంశంగా మారింది. కేసీఆర్‌ వ్యూహం ఫలించి రెండు ఎమ్మెల్సీ స్థానాలు దక్కితే కాంగ్రెస్‌కు మైనస్‌ అయ్యే అవకాశాలున్నాయి. దీన్ని రేవంత్ ఎలా ఎదుర్కొంటాడో వేచి చూడాల్సిందే.

Also read :  రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్!

Also read :  13ఏళ్ల బాలుడు అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్.. ట్రంప్ నిర్ణయానికి ఇదే కారణం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి లభించింది. దీనికి సంబంధించి పర్మిషన్ పత్రాలను మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి, వినయ్ భాస్కర్, ఒడితల సతీష్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు వాసుదేవ రెడ్డి తీసుకున్నారు. 

New Update
ts

BRS

ఈ నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రజతోత్సవ సభకు పోలీసులు అనుమతులు ఇచ్చారు. వరంగల్ సీపీ ఆదేశాల మేరకు కాజీపేట రూరల్ ఏసీపీ ఉత్తర్వులు జారీచేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ సభలకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు నిరాకరించడంతో, కోర్టుల ద్వారా అనుమతులు పొందడం జరిగింది. ఆ అనుభవం దృష్ట్యా, రజతోత్సవ సభ అనుమతుల కోసం బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఈరోజు పోలీసులు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో, హైకోర్టులో వేసిన కేసును బీఆర్ఎస్ పార్టీ ఉపసంహరించుకోనుంది.

 

today-latest-news-in-telugu | brs-party | meeting | warangal 

 

Also Read: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ ఏం ఆడింది మామా..

Advertisment
Advertisment
Advertisment