Telangana Secretariat : తెలంగాణ సచివాయలంలో ప్రమాదం తప్పింది. ఐదో అంతస్తులోని డోమ్ కింద ఉన్న బీమ్ నుంచి పెచ్చులు ఊడి కింద పడ్డాయి. పెచ్చులూడిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం త ప్పింది. అయితే సచివాలయంలో పని నిమిత్తం వచ్చిన రామగుండం మార్కెట్ కమిటీ చైర్మన్ తన కారును సచివాలయం కింద పెట్టి వచ్చాడు. దీంతో పెచ్చులూడిన ప్రాంతంలోనే ఆ కారు ఉండటంతో వాహనం ధ్వంసం అయింది.సచివాలయంలో అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. అనంతరం కులగణనపై మీడియా సమావేశం కూడా నిర్వహించారు. ఆ సమయంలో అధికారులంతా సమావేశంలో ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. సమీక్ష నిర్వహించిన అనంతరం పెచ్చులూడిన విషయం భట్టి విక్రమార్క దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన ఘటన స్థలాన్ని పరిశీలించిట్లు తెలుస్తోంది.
Also Read : రాత్రి పూట మటన్ తింటే డేంజర్! ఈ విషయాలు తెలుసుకోండి
కాగా తెలంగాణలో పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా సచివాలయాన్ని నిర్మించింది. అయితే నిర్మాణ సమయంలోనూ కొన్ని అపశృతులు దొర్లినట్లు ఆరోపణలున్నాయి. ఆ తర్వాత కూడా నిర్మాణంలో పలు లోపాలున్నట్లు అధికారులు గుర్తించారు. నాణ్యతా లేని పనుల మూలంగా సచివాలయంలో పెచ్చులూడుతున్నాయన్న ఆరోపణలున్నాయి.అధికారుల ఛాంబర్ లలో శబ్ధాలు వస్తున్నాయని అధికారులు ఆరోపిస్తున్నారు.అయితే ఐదవ అంతస్తు నుంచి ప్లాస్టర్ ఆఫ్ పారీస్ ఊడి పడిందని అంటున్నారు. పెద్ద ఎత్తన శబ్ధాలతో పెచ్చులూడిపడటంతో అధికారులు, ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రమాద సమయంలో ఎవరూ కూడా లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పిందని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా సచివాలయంలో నాణ్యతా ప్రమాణాల పరీక్షలు నిర్వహించాలని సందర్శకులు కోరుతున్నారు. అలాగే వాహనాలు పార్కింగ్ చేయడానికి ఆరుభయట ఉన్న ఖాళీ స్థలాలను ఎంపిక చేయాలని, సచివాలయంలో వాహనాలకు అనుమతి ఇవ్వరాదని కోరుతున్నారు.
Also Read : రోజాకు బిగ్ షాక్ ఇచ్చిన జగనన్న.. అక్కడి నుంచి ఔట్!
Also Read : కాపాడండయ్య నన్ను.. సైబర్ క్రైమ్ను ఆశ్రయించిన పృథ్వీ!