/rtv/media/media_files/2025/04/03/PsvX7JTfTvo0sYoRX1WP.jpg)
Rains
Rain Alert : ఒకవైపు ఎండలు మండుతుంటే మరోవైపు వరుణుడు కూడా తన సత్తా చాటుతున్నాడు. పొద్దంతా ఎండలు రాత్రి వర్షాలు అన్నట్లు వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రానున్న మూడురోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది.
Also read: KTR: HCU భూముల వెనుక భారీ భూకుంభకోణం.. త్వరలోనే వాళ్ల పేర్లు బయటపెడతా
నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఉందని తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోఆవరణం వరకు విస్తరించి ఉందని, ఈ అల్పపీడనం వచ్చే 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని చెప్పింది. తర్వాత దిశను మార్చుకొని ఉత్తర-ఈశాన్య దిశగా తిరిగి.. రాగల 24గంటల్లో మధ్య బంగాళాఖాతంలో క్రమంగా బలహీనంగా పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్.. తొలి విడత కింద రూ.4285 కోట్లు రిలీజ్
ఈ క్రమంలో మంగళవారం ములుగు, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. బుధవారం భూపాపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వానలు పడుతాయని చెప్పింది. 11న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేటతో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
CM Revanth Reddy : తండ్రీ కొడుకులకు బలుపు తప్పా ఏముంది..రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
పదేండ్లలో అప్పులు, తప్పులు తప్పా కేసీఆర్ చేసిందేం లేదు. అప్పుల విషయంలో కేసీఆర్ తప్పుడు లెక్కలు చూపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్, బీజేపీ లపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం మీడియాతో సీఎం మాట్టాడారు.
Telangana CM Revanth Reddy
CM Revanth Reddy : పదేండ్లలో అప్పులు, తప్పులు తప్పా కేసీఆర్ చేసిందేం లేదు. అప్పుల విషయంలో కేసీఆర్ తప్పుడు లెక్కలు చూపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్, బీజేపీ లపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో సీఎం మాట్లాడుతూ.‘నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని. కేసీఆర్‌ను ఓడించింది నేను. కేసీఆర్‌ను గుండుసున్నా చేసింది నేను. కేసీఆర్‌ను బండకేసి కొట్టింది నేను. అడ్డగోలుగా మాట్లాడడంలో కేసీఆర్‌కు మించినవాళ్ళు ఎవరున్నారు. కేటీఆర్ స్థాయి ఏంటి. కేసీఆర్‌కు బలుపు తప్ప ఏముంది. తండ్రీ కొడుకులకు బలుపు తప్పా ఏముంది.అసెంబ్లీలో అధికారపక్షం కంటే ప్రతిపక్షానికి ఎక్కువ సమయం ఇస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతిపక్షం లేని రాజకీయాలు చేయాలని తాము అనుకోవడం లేదన్నారు. వాళ్ళు మూసేసిన ధర్నా చౌక్ మేం తెరిచామన్నారు. విమర్శలు చేస్తే పరిశీలించుకుంటామని.. సలహాలు ఇస్తే తప్పకుండా స్వీకరిస్తామని వెల్లడించారు.
Also read: Vijayanagaram: బంపరాఫర్.. ఆడపిల్లని కంటే తల్లిదండ్రులకు రూ.50 వేలు క్యాష్.. మగపిల్లాడైతే ఆవు గిఫ్ట్
క్రిమినల్స్ కేసులకు భయపడరు
స్టేటస్ గురించి కేటీఆర్ మాట్లాడుతున్నారు.. అసలు కేటీఆర్ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అని ప్రశ్నించారు. అధికారం పోయిందనే అక్కసుతో కేటీఆర్ మాట్లాడుతున్నారు. కేసీఆర్‌ది అసెంబ్లీకి వచ్చే స్థాయి కాదన్నారు రేవంత్. క్రిమినల్స్ ఎప్పుడూ కేసులకు భయపడరు. కేసులకు భయపడితే క్రైమ్ చేయరు. అందుకే కేటీఆర్ భయపడను అంటున్నారంటూ రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేటీఆర్ గురించి మాట్లాడడం కూడా అనవసరం అంటూ ఎద్దేవా చేశారు సీఎం రేవంత్.
Also read: jagga reddy: లవ్ స్టోరీలో హీరోగా జగ్గారెడ్డి.. వార్ ఆఫ్ లవ్ అంటూ బాలయ్య రేంజ్‌లో
శవాలు లేస్తున్నాయని తీన్మార్ డాన్సులు
జీతభత్యాలు తీసుకొని పని చేయని వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. కేసీఆర్ చేసిన అప్పులు, తప్పులు కాగ్ రిపోర్ట్ అసెంబ్లీలో బయట పెడుతామన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు దుర్మార్గులని మండిపడ్డారు. తెలంగాణలో శవాలు లేస్తున్నాయని తెలియగానే తీన్మార్ డాన్సులు చేస్తున్నారని.. పంటలు ఎండితే ప్రతిపక్షాలు సంతోషపడుతున్నాయని విమర్శించారు. ప్రజలు ఇబ్బందులు పడితే బాధపడాలని.. ఇంత దుర్మార్గులు ప్రపంచంలో ఎవరైనా ఉంటారా అని అన్నారు. రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసు తిన్నది ఎవరని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఈ తలనొప్పులు ఉండకపోయేదన్నారు.జగన్‌ను ప్రగతి భవన్‌కు పిలిచి పంచభక్ష పరమాన్నాలు పెట్టింది ఎవరన్నారు. కరువు వస్తే ఇంత పంట పండుతుందా అని అన్నారు.
Also Read : ప్రణయ్ హత్య కేసులో నిందితుడికి ఉరి శిక్ష
కిషన్ రెడ్డి నిధులు తెస్తే సన్మానం చేస్తా
ఇక కిషన్‌రెడ్డిపైనా రేవంత్‌రెడ్డి విమర్శలు చేశారు. కిషన్‌రెడ్డి నేనే మెట్రో తెచ్చానంటున్నారు.. కిషన్‌రెడ్డి తెచ్చిన మెట్రో ఎక్కడుంది? జైపాల్ రెడ్డి తెచ్చిన మెట్రో కనిపిస్తోందని.. కిషన్ రెడ్డి తెచ్చిన మెట్రో ఎక్కడుందని సీఎం రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణకు కిషన్‌రెడ్డి నిధులుతెస్తే సన్మానం చేస్తానని చెప్పారు. కనీసం అఖిలపక్ష భేటీకి కిషన్‌రెడ్డి రాలేదని రేవంత్ విమర్శించారు. అఖిల పక్ష సమావేశానికి పిలిస్తే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్‌లో ఉండి కూడా రాలేదని.. కేసీఆర్ బాధపడుతారని కేంద్రమంత్రి సహకరించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కిషన్‌రెడ్డి కేంద్రం నుంచి నిధులు తెస్తే వద్దంటామా..? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. రింగ్ రోడ్డు అంటే రింగ్ ఉండాలి కదా.. మరి సగం ఇచ్చి రింగ్ అని ఎలా అంటారని ఆయన ఎద్దేవా చేశారు. భూసేకరణ అడ్డుకుంటుంది ఈటల, లక్ష్మణ్ అని ఆరోపించారు. ప్రాజెక్టులు ముందుకు వెళ్ళకుండా అడ్డుకుంటుంది రాష్ట్ర బీజేపీ నేతలే అని మండిపడ్డారు. మూసీకి నిధులు తెస్తే కిషన్ రెడ్డికి సన్మానం చేసి గండపిండేరం తొడుగుతానన్నారు. సబర్మతి, యమునా, గంగా ప్రక్షాళనకు నిధులు ఇస్తున్న కేంద్రం మూసీకి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
Also Read : కారును ఢీకొట్టిన ట్రక్కు.. ఎనిమిది మంది మృతి
39 సార్లు కాదు 99 సార్లు ఢిల్లీకి వెళ్తా...
అన్ని రాష్ట్రాలను బీజేపీ సమానంగా చూడటం లేదని సీఎం రేవంత్ ఆరోపించారు. బుల్లెట్ ట్రైన్ గుజరాత్ ఇచ్చారు.. తెలంగాణ ఎందుకు ఇవ్వడం లేదని రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణ కడుతున్న పన్నులు ఎంత .. తిరిగి కేంద్రం కేటాయించిన నిధులు ఎంత..? చర్చకు వస్తానంటే సీఎంగా తాను, భట్టి చర్చకు రావడానికి సిద్ధమని కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం 39 సార్లు కాదు 99 సార్లు ఢిల్లీకి వెళ్తానని సీఎం తెలిపారు. ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి రాష్ట్రానికి కావల్సినవి తెచ్చుకుంటానన్నారు.రాష్ట్రానికి కావాల్సిన అనేక అంశాలను క్లియర్ చేసుకొని వచ్చినట్లు తెలిపారు. కుల గణన ప్రభావమే అన్ని పార్టీలు బీసీలకు టికెట్లు ఇచ్చాయన్నారు. హరీష్ రావు మోసం వల్లే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓడిపోయామని విమర్శించారు.
Also read: MLC candidate: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు
Rain Alert : తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక
రానున్న మూడురోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. Short News | Latest News In Telugu | వాతావరణం
TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!
భద్రాధ్రికొత్తగూడెం జిల్లా జడ్ వీరభధ్రాపురంలో చేతబడి నెపంతో సొంత బాబాయినే కిరాతకంగా హత్య చేశాడు ఓ యువకుడు. క్రైం | Short News | Latest News In Telugu | ఖమ్మం | తెలంగాణ
Gym Trainer Kills : జిమ్ నిర్వాహకుడిని చంపిన యువకుడు.. డంబెల్స్‌తో కొట్టి కొట్టి....
జిమ్ ట్రైనర్ పై డంబెల్ తో దాడి చేసిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Allu Arjun : అల్లు అర్జున్ నివాసం వద్ద ఉద్రిక్తత...భారీకేడ్లు తోచుకుని.
టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అభిమానులు భారీగా చేరుకొని సందడి చేశారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Accident: హైదరాబాద్‌లో లారీ బీభత్సం..ట్రాఫిక్ పోలీసు దుర్మరణం!
హైదరాబాద్‌లో లారీ బీభత్సం సృష్టించింది. మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద విధుల్లోవున్న. : క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Newly bride suicide : పెళ్లయిన 22 రోజులకే నవ వధవు సూసైడ్..ఎందుకంటే....
పెళ్లయిన 22 రోజులకే నవవధువు ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. క్రైం | Short News | Latest News In Telugu | ఆదిలాబాద్ | తెలంగాణ
USA-China: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..
PBKS VS CSK: పంజాబ్ విజయం..ఇక చెన్నై ఇంటికే..
Renu Desai: నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది..రేణూ దేశాయ్
WHO: మరో మహమ్మారి తప్పదు-WHO చీఫ్
Instagram: ఇన్స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాక్.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు చూడలేరు