ఢిల్లీకి సీఎం రేవంత్.. అమిత్ షాతో భేటీ!

సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఆయన వరద నష్టంపై కేంద్రం ప్రకటించిన అతి తక్కువ వరద సహాయంపై పునరాలోచన చేయాలని హోంశాఖ మంత్రి అమిత్ షా తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం.

New Update
CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. రాహుల్‌తో భేటీ

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈరోజు ఆయన వరద నష్టంపై కేంద్రం ప్రకటించిన అతి తక్కువ వరద సహాయంపై పునరాలోచన చేయాలని హోంశాఖ  మంత్రి అమిత్ షా తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం. కాగా ఇటీవల భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అల్లకల్లోలమైన తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. 

అడిగింది వెయ్యి కోట్లు.. ఇచ్చింది?

మొత్తం 14 రాష్ట్రాలకు రూ.5,858 కోట్ల నిధులు కేటాయించింది. తెలంగాణకు రూ. 416.80 కోట్లు, ఏపీకి రూ.1,036 కోట్లు NDRF నిధులు రిలీజ్ చేసింది. మహారాష్ట్రకు అత్యధికంగా రూ.1,432 కోట్లు విడుదల చేసింది. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌తో పాటు, కేంద్ర బృందం తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించిన విషయం తెలిసిందే. 

వర్షాల సమయంలో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ చౌహాన్ విజయవాడ వచ్చి వెళ్లిన 24 గంటల్లోనే కేంద్ర సాయం ప్రకటించడంపై మంత్రి లోకేశ్​ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, వ్యవసాయ మంత్రి చౌహాన్​లకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా తాము కేంద్ర ప్రభుత్వాన్ని వరద సాయం కింద రూ.1000 కోట్లు అడిగితే రూ.416.80 కోట్లు కేటాయించిందని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. కాగా ఇదే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి వరద సాయం కోసం మరిన్ని నిధులు కేటాయించాలని పలువురు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం.

Also Read: ఇరాన్‌ను భారీ దెబ్బ తీసిన ఇజ్రాయెల్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఇంకొద్ది రోజులకైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరో సంచలనం!

మంత్రి పొంగులేటి తనని..  కేసీఆర్ ఆత్మ అని అంటున్నారు..కేసీఆర్ లేకుంటే పొంగులేటి ఎక్కడ ఉండేవాడని ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు కాకపోయిన ఇంకొద్దిరోజులు కైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని... వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పారు.

author-image
By Krishna
New Update

తాను కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు. తాను అన్నవి తన సొంత మాటలు కావని..  రాష్ట్రంలో ఉన్న చాలామంది ప్రజలు తమ వద్దకు వచ్చి అంటున్న మాటలని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం మారాలి అని రైతులు..రియల్టర్లు, పారిశ్రామిక వేత్తలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు.  మంత్రి పొంగులేటి తనని..  కేసీఆర్ ఆత్మ అని అంటున్నారు..కేసీఆర్ లేకుంటే పొంగులేటి ఎక్కడ ఉండేవాడని ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు.  ఇప్పుడు పొంగులేటి మంత్రి పదవిలో ఉన్నాడు అంటే..అది కేసీఆర్ వల్లేనని తెలిపారు.  కాంగ్రెస్ నాయకులకు వాళ్ల ప్రభుత్వం పై నమ్మకం లేకనే తమ పార్టీ నుండి పదిమంది ఎమ్మెల్యే లను తీసుకెళ్లారని విమర్శించారు.  ఇప్పుడు కాకపోయిన ఇంకొద్దిరోజులు కైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని... వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం పక్క అని ధీమా వ్యక్తం చేశారు.  ఇప్పటికే తనపై అక్రమ కేసులు పెడుతున్నారని...తనను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు కొత్త ప్రభాకర్ రెడ్డి.. తాను కేసులకు భయపడేవాన్ని కాదని తేల్చి చెప్పారు.  కచ్చితంగా తాను పారిశ్రామికవేత్తనని.. కానీ డబ్బులు సంపాదించడానికి రాజకీయాల్లోకి  రాలేదన్నారు.  సేవ చేయడానికి మాత్రమే వచ్చానని ఆర్టీవీకీ ఆయన తెలిపారు. 

ఎర్రబెల్లి బస్తిమే సవాల్

రేవంత్ సర్కార్‌ పై మాజీ మంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన కామెంట్స్ చేశారు. మంత్రి వర్గ విస్తరణ పూర్తి కాగానే ప్రభుత్వం కుప్పకూలిపోతుందని అన్నారు. మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొర్రూరులో బీఆర్ఎస్ పార్టీ సన్నాహాక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్ రావు చీఫ్ గెస్టుగా పాల్గొని మాట్లాడారు.  స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేందుకు ప్రభుత్వం భయపడుతుందని అన్నారు.  రాసిపెట్టుకోండి.. స్థానిక సంస్థల్లో వార్ వన్ సైడ్.. ఎప్పుడు ఎన్నికలు పెట్టిన సరే..  బీఆర్ఎస్ సత్తా చాటడం ఖాయమని ఎర్రబెల్లి అన్నారు. సర్వేలన్ని కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్నాయన్న  ఎర్రబెల్లి..  ఎన్నికలు పెట్టి చూడండి .. తమ సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు.  తాను చెప్పింది నిజం కాకపోతే  రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎర్రబెల్లి సవాల్ విసిరారు.  మొత్తం రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలు ఉంటే.. అందులో కేవలం 10 నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఫేవర్‌గా ఉందని..  మిగతా చోట్ల బీఆర్ఎస్ పార్టీ గెలుస్తోందని జోస్యం చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం బయటపడుతోందని ఎర్రబెల్లి  స్పష్టం చేశారు.

 

Advertisment
Advertisment
Advertisment