/rtv/media/media_files/2026/02/20/cm-revanth-reddy-2026-02-20-19-07-53.jpg)
ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక ప్రసంగం చేశారు. దేశాన్ని ఆర్టిఫీషియల్ రంగంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ రంగంలో జరుగుతున్న మార్పులు క్లోజ్‌గా గమనించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 'ఏఐ వార్ రూమ్' ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. లెటెస్ట్ టెక్నాలజీ అందుబాటులో ఉన్న హైదరాబాద్ ఈ వార్ రూమ్ ఏర్పాటుకు అత్యంత అనువైన ప్రాంతమని ఆయన పేర్కొన్నారు.
In the backdrop of the rapid and transformative advancements in #ArtificialIntelligence, the Hon’ble Chief Minister, @revanth_anumula, urged the Hon’ble Prime Minister to establish an India AI Council as a supreme national body on the lines of the GST Council and NITI Aayog.… pic.twitter.com/N0tduEeZgS
— Telangana CMO (@TelanganaCMO) February 20, 2026
GST కౌన్సిల్ తరహాలోనే, ఏఐ నియంత్రణ, డెవలప్మెంట్ కోసం ఒక నేషనల్ ఏఐ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. గతంలో వచ్చిన పారిశ్రామిక విప్లవాల సమయంలో భారత్ కొన్ని అవకాశాలను కోల్పోయిందని, కానీ ప్రస్తుత ఏఐ శకంలో ఆ తప్పు జరగకూడదని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. భారత్ ఇప్పటివరకు సాఫ్ట్వేర్ సేవలకే పరిమితమైందని, ఇకపై ఏఐ చిప్స్ (GPU), డేటా స్టోరేజ్ ప్లాట్‌ఫామ్స్ వంటి కోర్ టెక్నాలజీ ఉత్పత్తుల్లో గ్లోబల్ లీడర్‌గా ఎదగాలని పిలుపునిచ్చారు.
కృత్రిమ మేధస్సు యావత్ ప్రపంచాన్ని తీవ్ర ప్రభావం చేస్తున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో జీఎస్టీ కౌన్సిల్, నీతి ఆయోగ్ తరహాలో “ఏఐ కౌన్సిల్”ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు ప్రధానమంత్రి గారిని కోరారు.
— CPRO to CM / Telangana (@CPRO_TGCM) February 20, 2026
జాతీయ భద్రత, జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలగకుండా ఉండేందుకు… pic.twitter.com/UQZ6wWlm1e
హైదరాబాద్‌లో ఇప్పటికే అంతర్జాతీయ ప్రమాణాలతో ఏఐ స్కిల్డ్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, ఇది రిసెర్చ్, స్కిల్స్ కలిగిన మానవ వనరుల తయారీకి కేంద్రంగా మారుతుందని చెప్పారు. యువతను ఏఐ రంగంలో పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ప్రత్యేకంగా 'ఏఐ స్టార్టప్ ఫండ్' ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రతి ఆరు నెలలకోసారి సదస్సులు
టెక్నాలజీలో వస్తున్న వేగవంతమైన మార్పులను అందిపుచ్చుకోవాలంటే ఏటా కాకుండా, ప్రతి ఆరు నెలలకోసారి ఏఐ సదస్సులు నిర్వహించాలని సీఎం ప్రతిపాదించారు. హైదరాబాద్ వంటి నగరాలు ఇలాంటి అంతర్జాతీయ స్థాయి సదస్సులకు ఆతిథ్యం ఇచ్చేందుకు పూర్తి సిద్ధంగా ఉన్నాయని భరోసా ఇచ్చారు.
Follow Us