Revanth Reddy : హైదరాబాద్‌ లో కొత్త రైల్వే స్టేషన్‌!

నగర శివార్లలోని చర్లపల్లి వద్ద రూ.415 కోట్ల పెట్టుబడితో కేంద్రం కొత్త రైల్వే టెర్మినల్ ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్యాసింజర్, గూడ్స్ ట్రైన్ల సేవలందించేకు గాను అత్యాధునిక సౌకర్యాలతో ఈ టెర్మినల్ నిర్మిస్తుండగా.. పనులు ముగింపు దశకు చేరినట్లు సమాచారం.

New Update
Charlapalli Railway Station

Telangana :

నగరంలో ప్రస్తుతం నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూడు స్టేషన్ల నుంచి వివిధ రాష్ట్రాలకు ప్రధాన ట్రైన్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇక నగర శివార్లలోని చర్లపల్లి వద్ద రూ.415 కోట్ల పెట్టుబడితో కేంద్రం కొత్త రైల్వే టెర్మినల్ ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్యాసింజర్, గూడ్స్ ట్రైన్ల సేవలందించేకు గాను అత్యాధునిక సౌకర్యాలతో ఈ టెర్మినల్ నిర్మిస్తుండగా.. పనులు ముగింపు దశకు చేరినట్లు తెలుస్తుంది. 

త్వరలోనే స్టేషన్ ప్రారంభం కానుండగా.. తాజాగా సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నాలుగు రోజుల క్రితం కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈ టర్మినల్ విషయం గురించి రేవంత్‌ కి లేఖ రాయగా..అందులో చర్లపల్లి టెర్మినల్‌ కోసం రోడ్ల విస్తరణలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. ఈ మేరకు రేవంత్ అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరిస్తున్నందున.. స్టేషన్ ముందు పార్కింగ్, పరిసర ప్రాంతాల నుంచి స్టేషన్‌కు చేరుకునే అప్రోచ్ రోడ్లను అభివృద్ధి చేయాలన్నారు.

పరిసరాల్లో ఉన్న అటవీ శాఖ భూమిని, పరిశ్రమల విభాగం భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని రేవంత్‌ అన్నారు. అక్కడున్న పరిశ్రమలను మరో చోటికి తరలించాలని సూచించారు.హైదరాబాద్ అభివృద్ధితో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు, ఫుట్‌పాత్‌ల అభివృద్ధి, క్లీనింగ్, ఇతర పనుల్లో పురోగతిపై శుక్రవారం సీఎం సమీక్ష నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ మహానగరాన్ని ఇండోర్ తరహాలో అద్భుతమైన క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు