BIG BREAKING: పాత జిల్లాలు రద్దు.. సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ!

తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై గత కొన్ని రోజులుగా సాగుతున్న ప్రచారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెరదించారు. రాష్ట్రంలోని ప్రస్తుత జిల్లాలను రద్దు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, కొత్త జిల్లాలను ఏర్పాటు చేయబోమని ఆయన స్పష్టం చేశారు.

New Update
Revanth Reddy

Revanth Reddy

తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై గత కొన్ని రోజులుగా సాగుతున్న ప్రచారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెరదించారు. రాష్ట్రంలోని ప్రస్తుత జిల్లాలను రద్దు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, కొత్త జిల్లాలను ఏర్పాటు చేయబోమని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల సచివాలయంలో TGO డైరీ ఆవిష్కరణ సందర్భంగా, భూపాలపల్లి బహిరంగ సభలో సీఎం ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు.

గత ప్రభుత్వం ఎలాంటి శాస్త్రీయత లేకుండా, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే జిల్లాలను, మండలాలను విభజించిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఒక జిల్లాలో కేవలం ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉంటే, మరో జిల్లాలో 14 ఉండటం.. అలాగే జనాభా ప్రాతిపదికన తీవ్ర వ్యత్యాసాలు ఉండటం పరిపాలనకు ఆటంకంగా మారిందని ఆయన పేర్కొన్నారు. జిల్లాల ఉనికిని దెబ్బతీయకుండా, కేవలం ప్రజల సౌకర్యం కోసం సరిహద్దులను సవరించే ప్రక్రియ మాత్రమే చేపడతామని భరోసా ఇచ్చారు. ఏవైనా గ్రామాలు లేదా మండలాలు తమకు జిల్లా కేంద్రం దూరం అవుతోందని భావిస్తే, వారి విజ్ఞప్తి మేరకు మార్పులు చేస్తామన్నారు.

జుడీషియల్ కమిషన్ ఏర్పాటు

ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిషన్‌ను నియమించనుంది. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఈ కమిషన్ పని చేస్తుంది. ఇది ఆరు నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధుల నుండి సలహాలు, సూచనలు స్వీకరిస్తుంది. కమిషన్ ఇచ్చే నివేదికపై శాసనసభలో కూలంకషంగా చర్చించిన తర్వాతే తుది విధివిధానాలను ఖరారు చేస్తామని సీఎం వెల్లడించారు.

తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు

భూపాలపల్లి వంటి జిల్లాలను రద్దు చేసి పాత జిల్లాల్లో కలుపుతారని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను సీఎం తిప్పికొట్టారు. పరిపాలనను ప్రజలకు మరింత దగ్గర చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో ఎటువంటి రాజకీయ స్వార్థం లేదని ఆయన స్పష్టం చేశారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై పూర్తి స్థాయి స్పష్టత రానుంది.

Advertisment
తాజా కథనాలు