CM Revanth Reddy: బీజేపీ ఎంపీకి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్.. పోలీసులకు ఏం చెప్పారంటే

తెలంగాణ రాజకీయాల్లో కీలక నేతల భద్రత ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఇంట్లో నిన్న అగంతకుడు ప్రవేశించిన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విషయం తెలిసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.

New Update
DK-Aruna-vs-Revanth-reddy

DK-Aruna-vs-Revanth-reddy

CM Revanth Reddy: తెలంగాణ(Telangana) రాజకీయాల్లో కీలక నేతల భద్రత ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. మహబూబ్‌నగర్(Mahabubnagar) ఎంపీ డీకే అరుణ(MP DK Aruna) ఇంట్లో నిన్న అగంతకుడు ప్రవేశించిన విషయం రాష్ర్ట వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మరోవైపు విషయం తెలిసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ క్రమంలో ఘటన గురించి ఎంపీకి ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీకి భద్రతను మరింత పెంచాలని పోలీసులను ఆదేశించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి డీకే అరుణను ఫోన్‌ ద్వారా సంప్రదించారు. ఈ ఘటన ఎలా జరిగింది? ఆగంతకుడు ఎవరు? ఆయన ఉద్దేశం ఏంటి? అన్న విషయాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. భద్రతా పరంగా లోపాలేమైనా ఉన్నాయా? పోలీసుల నుంచి తగిన సహాయసహకారాలు అందుతున్నాయా? అనే విషయాలపై కూడా చర్చించారు.

ఇది కూడా చూడండి: Lovers suicide : ప్రేమను పెద్దలు అంగీకరించరేమోనని..వారిద్దరూ ఏం చేశారంటే?

పోలీసులు అప్రమత్తంగా ఉండాలి.. 

ఈ ఘటనలో తన అనుమానాలను డీకే అరుణ సీఎంతో ప్రస్తావించారు. అకారణంగా తన నివాసంలోకి గుర్తుతెలియని వ్యక్తి ప్రవేశించడం శోచనీయమని, ఇది భద్రతా వ్యవస్థలో ఉన్న లోపాలను బయటపెడుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి, డీకే అరుణ భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని పోలీసు శాఖకు ఆదేశాలు ఇచ్చారు. ఆమెకు అదనపు భద్రత కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముఖ్యంగా రాజకీయ నేతల భద్రత విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదని, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.

ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి నిజమైన కారణాలను వెలికితీయాలని సీఎం పోలీసులను ఆదేశించారు. ఈ కేసును వేగంగా పరిశీలించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఘటనకు గల కారణాలు, ఇందులో ఎవరైనా కుట్ర పన్నారా? కావాలనే భద్రతా లోపాన్ని ఉపయోగించుకుని ఈ చర్య జరిగిందా? అన్న కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టాలని సూచించారు.

ఇది కూడా చూడండి: Kalyan Ram: విజయశాంతిని అలాగే పిలుస్తా.. అంతగా దగ్గరయ్యాం: కల్యాణ్‌రామ్‌ సంచలనం!

ఇది కూడా చూడండి: విదేశీ పాడ్‌కాస్ట్‌లో మోదీ.. కాంగ్రెస్‌ తీవ్ర విమర్శలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG News: సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్!

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో పర్యటించారు. ఈ మేరకు లబ్ధిదారుడు శ్రీనివాస్ కుటుంబ కష్టసుఖాల గురించి అడిగి తెలుసుకున్నారు.

New Update
cm revanth tg

Telangana CM Revanth Reddy lunch in fine rice beneficiary home

TG News: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో పర్యటించారు. ఈ మేరకు లబ్ధిదారుడు శ్రీనివాస్ కుటుంబ కష్టసుఖాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక ఉదయం భద్రాచలంలో నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రి.. స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. 

10 లక్షల కొత్త రేషన్‌కార్డులు..

ఇక రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మార్చి 30న ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో వీరు పాల్గొన్నారు. అయితే రాష్ట్రంలో ఏప్రిల్‌ నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభవుతుందని సీఎస్‌ శాంతి కుమారి తెలిపారు. అలాగే దాదాపు10 లక్షల కొత్త రేషన్‌కార్డులు జారీ కానున్నాయని పేర్కొన్నారు. సన్నబియ్యం పంపిణీ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని తెలిపారు. ధనవంతుల లాగే పేదవారు సన్నబియ్యం తినాలని కోరుతున్నారన్నారు. 

ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

2024లో 1.56 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తిని సాధించినట్లు తెలిపారు. దేశంలో ఎక్కువగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ ఉందని.. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత భారీగా వరి ఉత్పత్తి జరగలేదని తెలిపారు. సన్న బియ్యం పండిస్తే బోనస్ కూడా అందిస్తున్నామని స్పష్టం చేశారు.

ఇది కూడా చూడండి: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

 ration rice | cm revanth | khammam | telugu-news | today telugu today telugu news

 

 

Advertisment
Advertisment
Advertisment