TG News: ఇందిరమ్మ ఇండ్ల సర్వే మొబైల్ యాప్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఆత్మగౌరవంతో బతకాలనే పేదల కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ కాలం నుంచి కాంగ్రెస్ కృషి చేస్తోందని చెప్పారు. రూ.4వేలతో మొదలైన ఈ పథకం వైఎస్ హయాం వరకు 1లక్షా 21వేలకు చేరుకోగా.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.5లక్షలకు పెంచామన్నారు. లక్ష్యం ఎంత గొప్పదైనా అమలులో లోపాలు ఉండొద్దని సాంకేతికను జోడించామని, అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు చెందాలనే ఉద్దేశంతో యాప్ ను తీసుకొచ్చామని తెలిపారు. విధి విధానాలను కూడా సరళీకృతం చేసి లబ్ధిదారులకు వెసులుబాటు కల్పించామన్నారు. వారి స్థోమతకు అనుగుణంగా ఇల్లు నిర్మించుకునే అవకాశం కల్పించి, పేదలకు న్యాయం జరిగేందుకు తీసుకోవాల్సిన అన్ని నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుందని చెప్పారు. Also Read: బాక్సాఫీస్ ను బద్దలు కొట్టిన ఇండియన్ సినిమాలు.. 'పుష్ప' స్దానం ఎంతంటే? Hon'ble Chief Minister Sri.A.Revanth Reddy participates in Launch of INDIRAMMA ILLU Survey Mobile Application at Secretariat https://t.co/nR5H5dPLXJ — Telangana CMO (@TelanganaCMO) December 5, 2024 నియోజకవర్గానికి 3,500 చొప్పున 4.50 లక్షల ఇంళ్లు.. ఏడాది పాలనలో అందరి సంపూర్ణ సహకారంతో తెలంగాణ రైజింగ్ అనే విధంగా రెండో వసంతంలోకి అడుగుపెడుతున్నాం. మొదటి ఏడాదిలో నియోజకవర్గానికి 3,500 చొప్పున 4.50 లక్షల ఇండ్లకు పరిపాలన అనుమతులు ఇచ్చాం. అత్యంత నిరుపేదలు మా మొదటి ప్రాధాన్యత దళితులు, గిరిజనులు, వ్యవసాయ కూలీలు,పారిశుధ్య కార్మికులు, దివ్యాంగులు, ట్రాన్స్ జెడర్స్ కు ప్రాధాన్యతగా తీసుకుంటాం. ఐటీడీఏ ప్రాంతాలను ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణిస్తుంది. వారికోసం ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తాం. 2004 నుంచి 2014 వరకు 25 లక్షల 4 వేల ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. బీఆరెస్ అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్రూంల కోసం మా ప్రభుత్వం రూ.195 కోట్లు విడుదల చేసామన్నారు. Also Read: మీది ప్రజాపాలన కాదు.. రాక్షసపాలన.. కౌశిక్‌రెడ్డి ఇష్యుపై హరీష్‌రావు ఆగ్రహం రూ.5 లక్షల ఆర్థిక సహాయం.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు డిసెంబర్ 6 నుంచి పథకంలో లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ పథకంలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండేలా, అవినీతికి, రాజకీయ ప్రమేయానికి ఆస్కారం లేకుండా అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు వీలుగా మొబైల్‌యాప్ ను రూపొందించామని పేర్కొన్నారు. అర్హులైన పేదలకే ఇళ్లను అందించేందుకు వీలుగా ప్రతి గ్రామం, వార్డుల వారీగా 'ఇందిరమ్మ ఇళ్ల కమిటీ'లను ఏర్పాటు చేశామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఒక్కో ఇంటికీ రాష్ట్ర ప్రభుత్వం అందించే రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని నాలుగు దశల్లో ఇస్తామని, మహిళ పేరు మీద ఇంటిని మంజూరు చేస్తామని పేర్కొన్నారు. పథకం కింద నిర్మించే ఇళ్లు కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో వంటగది, టాయిలెట్ సౌకర్యం కలిగి ఉంటాయన్నారు. గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండేదని, ఇప్పుడు ఆ వ్యవస్థను రద్దు చేసి లబ్ధిదారులే ఇళ్లను నిర్మించుకునేలా అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. లబ్ధిదారులు తమ సౌలభ్యాన్ని బట్టి 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఎంత విస్తీర్ణంలోనైనా ఇంటిని నిర్మించుకోవచ్చన్నారు. కాగా, మోడల్ హౌస్ కింద నమూనాగా ఒక ఇంటిని ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటుచేస్తామని చెప్పారు. Also Read: జబర్దస్త్ కమెడియన్ రాంప్రసాద్ కి యాక్సిడెంట్! ఈ యాప్‌లో ఇంటి పథకం కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి స్వరూపం, కుటుంబ సభ్యుల వివరాలు, ఇంటి నిర్మాణానికి సంబంధించిన భూమి సహా పలు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. Also Read: మీ బాగోతాలు బయపపెడతే అవి ఏక్కడ మడిచి పెట్టుకుంటారు: కొండా సురేఖ ఫైర్