పహల్గాంలో టెర్రరిస్టులు సృష్టించిన విధ్వంసలో 26మంది టూరిస్టులు చనిపోయిన నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని సోషల్ మీడియా ద్వారా కోరారు. ఉగ్రదాడికి నిరసనగా దీన్ని పాటించాలని చెప్పారు.
అన్యాయానికి వ్యతిరేకంగా
" కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాదులు మన దేశ ప్రజలను ఎలా చంపారో మీ అందరికీ తెలుసు. చాలా మంది గాయపడి ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఈ ఉగ్రవాద చర్యకు, అన్యాయానికి వ్యతిరేకంగా, రేపు (శుక్రవారం) మీరు నమాజ్ కోసం మసీదులకు వెళ్ళేటప్పుడు నల్లటి బ్యాండ్ ధరించి వెళ్లాలని నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను " అని ఒవైసీ అన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఒవైసీ ఈ విజ్ఞప్తి చేయడం గమనార్హం. కాగా ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం తదుపరి కార్యాచరణపై కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించగా అందులో ఒవైసీ పాల్గొన్నారు.
Also Read : ఆయుధాలతో శ్రీనగర్‌లోకి భారీగా విదేశీయులు.. ఎవిడెన్స్ ఉన్నాయంటున్న పాక్
Also read : Mukesh Ambani : ఎంత ఖర్చైనా భరిస్తా.. వారికి ఫ్రీ ట్రీట్మెంట్.. ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన!