Caste census : కులగణన తప్పుల తడక.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే అంతా తప్పుల తడక అని, పూర్తిగా అశాస్త్రీయంగా ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. కులగణన ద్వారా ఐదున్నర శాతం జనాభాను తగ్గించారని అంటే 22 లక్షల మందిని లేనట్లుగా చిత్రీకరించారన్నారు.

New Update
Mahesh Goud vs KTR

Mahesh Goud vs KTR

Caste census :  రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే అంతా తప్పుల తడక అని, పూర్తిగా అశాస్త్రీయంగా ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. కులగణన ద్వారా రాష్ర్టంలో ఐదున్నర శాతం జనాభాను తగ్గించారని అంటే 22 లక్షల మందిని రాష్ర్టంలో లేనట్లుగా చిత్రీకరించారని కేటీఆర్‌ మండిపడ్డారు. ఉద్ధేశ పూర్వకంగా బీసీలను తక్కువ చేసి చూపించిన రేవంత్‌ రెడ్డి బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన కులగణన చిత్తు కాగితంతో సమానమని వారి కాంగ్రెస్ ఎమ్మెల్సీ తగులబెట్టారని కేటీఆర్ గుర్తుచేశారు. కాగా బీసీ రిజర్వేషన్‌ పై ఈరోజు బీఆర్‌ఎస్‌ అధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Also Read :  గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లు.. త్వరలో వారి ఖాతాల్లోకి రూ.లక్ష!


ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహించిన కులగణనపై వెంటనే రీసర్వే చేసి లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు. రీసర్వే విషయంలో తాము కూడా చొరవ తీసుకుంటామని తెలిపారు. కులగణనలో కేసీఆర్, కేటీఆర్ పాల్గొలేదని ఆరోపిస్తున్నారన్న ఆయన స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారే పాల్గొనాలని తొలుత చెప్పారన్నారు. బీసీలకు అన్యాయం చేసి తప్పించుకునే ప్రయత్నం చేయవద్దని కేటీఆర్ కోరారు.42 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేసేదాకా వదిలిపెట్టమని కేటీఆర్​ అన్నారు. బీసీలకు జరిగిన అన్యాయాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుపోతామన్నారు.

Also Read: ఛత్తీస్‌గఢ్‌లో 31 మంది మావోయిస్టులు మృతి.. అమిత్ షా సంచలన ప్రకటన


 బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వం మోసం చేసింది. దీనిపై అసెంబ్లీలో ప్రశ్నిస్తాము. తప్పుల తడకగా ఉన్న కుల గణనను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాము. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డిలో డిక్లరేషన్ చేశారు. ఈ ప్రభుత్వం 15 లక్షల మంది బీసీలను తక్కువ చేసి చూపించిందని ఆరోపించారు.42శాతమని బీసీ డిక్లరేషన్​లో చెప్పిన విధంగా ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై చట్టబద్ధత కల్పిస్తారని భావించామని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సభలో బిల్లు పెట్టాలని కేటీఆర్ కోరారు. గతంలో బీసీలకు 50 శాతానికి పైగా రిజర్వేషన్లను ఇచ్చామని గుర్తుచేశారు. అసెంబ్లీ, ఎంపీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక సీట్లు కేటాయించామని ఆయన తెలిపారు.  

పారదర్శకంగా కులగణన : టీపీసీసీ అధ్యక్షులు మ‌హేష్ కుమార్ గౌడ్

కాగా కేటీఆర్‌ కామెంట్స్ పై టీపీసీసీ అధ్యక్షులు మ‌హేష్ కుమార్ గౌడ్ కౌంట‌ర్ ఇచ్చారు. తెలంగాణ‌లో  కుల‌గ‌ణ‌న స‌ర్వే పారదర్శకంగా జ‌రిగిందన్నారు. కేటీఆర్ ఎలాంటి ఆధారాలు లేకుండా బీసీ కులగణనను తప్పులు తడక అంటున్నారు. ఎంతో శాస్త్రీయంగా లక్షకు పైన సిబ్బందిని పెట్టి ఇల్లిల్లు పరిశీలన చేసి గణన చేయడం జరిగిందన్నారు.దేశానికే ఆదర్శంగా కులగణన చేశామని మహేష్‌ కుమార్‌ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే భరించలేక కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారు.రాహుల్ గాంధీ ఆదేశాలనుసారం కుల‌గ‌ణ‌న స‌ర్వేను కాంగ్రెస్  ప్రభుత్వం సంక‌ల్పంతో  పూర్తి చేసిందన్నారు.కుల‌గ‌ణ‌న స‌ర్వేపై కేటీఆర్ వ్యాఖ్యలను బీసీ స‌మాజం క్షమించదని తేల్చి చెప్పారు.

Also Read: సూర్యాస్తమయం తర్వాత మహిళలను అరెస్టు చేయొచ్చు.. హైకోర్టు సంచలన తీర్పు

2014 లో సమగ్ర కుటుంబ సర్వే చేసి కనీసం ఆ లెక్కలను కూడా బయటకు చెప్పలేని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడడం అవివేకం అని దుయ్యబట్టారు. బీసీలకు న్యాయం జరుగుతుంటే కేటీఆర్ భరించలేక పోతున్నారు. కుల‌గ‌ణ‌న స‌ర్వేలో పాల్గొన‌ని కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులు రీ - స‌ర్వే గురించి మాట్లాడ‌టం విడ్డూరంగా ఉందన్నారు. బ‌ల‌హీన‌వ‌ర్గాల గురించి కేటీఆర్ మాట్లాడ‌టం హ‌స్యాస్పదం. ప‌దేళ్ల బీఆర్ఎస్ పాల‌న‌లో బీసీల‌కు తీర‌ని అన్యాయం జ‌రిగిందని మహేష్‌ కుమార్‌ తీవ్రంగా మండిపడ్డారు.

Also Read: టాలీవుడ్ To పాలిటిక్స్ ఎవరిని వదలని మస్తాన్ సాయి: టోటల్ లిస్ట్ ఆడియో వైరల్!
 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori: చంచల్‌గూడ జైలుకు అఘోరీ..  ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి!

చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరీని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ప్రత్యేక బ్యారక్ సిద్దం చేసి లోపలికి తీసుకెళ్లారు. మరోవైపు శ్రీ వర్షిణికి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా శంకర్‌పల్లి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

New Update
aghori ccg

Aghori going to Chanchalguda jail

Aghori: చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరిని ఎట్టకేలకు పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించి..  ప్రత్యేక బ్యారక్ సిద్దం చేశారు జైలు అధికారులు. ఇతర ఖైదీలను కలవకుండా ఏర్పాట్లు చేశారు. మరోవైపు శ్రీ వర్షిణిని అదుపులోకి తీసుకున్నారు శంకర్‌పల్లి పోలీసులు. ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా కౌన్సెలింగ్ ఇచ్చారు.  

ఉత్తరప్రదేశ్ సరిహద్దులో అదుపులోకి..

ఇదిలా ఉంటే.. లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పోలీసులకు చిక్కాడు. వర్షిణీని పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయిన అఘోరీని పోలీసులు మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ నుంచి చేవెళ్ల కోర్టుకు తీసుకెళ్లారు. విచారణలో భాగంగా లేడీ అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు.  అదే సమయంలో శ్రీనివాస్ నుంచి వర్షిణీని వేరు చేసిన పోలీసులు భరోసా సెంటర్‌కు పంపించారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

లేడీ అఘోరికి సంగారెడ్డి జైలు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆడా, మగా తేలకుండా ఏ బ్యారక్‌లో ఉంచలేమని సంగారెడ్డి సెంట్రల్ జైలు తేల్చి చెప్పారు. దీంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్షల తర్వాత అఘోరీని చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

Aghori for Varshini | jail | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment