/rtv/media/media_files/2025/03/25/8dlVC1oLQURbYTYLBWe9.jpg)
Telangana Cabinet Expansion
Cabinet expansion : తెలంగాణలో అధికారం చేపట్టిన నాటినుంచి మంత్రి వర్గ విస్తరణపై రకరకాల ప్రచారం సాగుతూనే ఉంది. ఇపుడు అపుడు అంటూ అనేక సార్లు విస్తరణ వాయిదా పడింది.తాజాగా ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ కు దాదాపు ముహూర్తం ఖరారైనట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పలువురు ఆశావాహుల పేర్లు కూడా మంత్రివర్గంలో ఉండవచ్చన్న ప్రచారం సాగుతోంది. ఇన్నాళ్లు వినిపించిన పేర్లు కాకుండా కొత్త పేర్లు తెరమీదకు వస్తున్నాయి. కొత్త మంత్రుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. సామాజిక వర్గం,- జిల్లా సమీకరణాల ఆధారంగా మంత్రుల లిస్టు ఫైనల్ చేయనున్నారు. కాగా, తుది ఎంపికలో వస్తున్న తాజా సమస్యలతో పార్టీ నాయకత్వం వ్యూహం మార్చింది. కొత్త ఫార్ములా అమలు చేస్తోంది. దీంతో, తుది జాబితాలో పేర్లు మారే అవకాశం కనిపిస్తోంది.
Also Read: బెట్టింగ్ వలలో చిక్కడానికి మూలం అతడే.. నటి మాధవిలత సంచలన ఆరోపణ
తెలంగాణ మంత్రివర్గ కూర్పులో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో జాబితా ఖరారు అయినట్లు ప్రచారం సాగుతోంది. అయితే, జాబితాలో ఇంకా మార్పులు చేర్పులు కొనసాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీలో మంత్రి పదవి ఆశిస్తున్న వారు ఢిల్లీలోని పార్టీ ముఖ్య నేతలను కలుస్తున్నారు. అవకాశం కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి వర్గ విస్తరణతో పాటుగా పీసీసీ కార్యవర్గం, నామినేటెడ్ పోస్టుల విషయంలోనూ హైకమాండ్ తుది కసరత్తు చేస్తోంది. కాగా.. తమకు మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం వివరిస్తూ కొందరు నేతలు ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో, హైకమాండ్ ఆలోచనలో మార్పు కనిపిస్తోంది.
Also Read: షేక్ హసీనాకు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన సీఐడీ
ప్రస్తుతం రేవంత్ మంత్రివర్గంలో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అన్ని భర్తీ చేయకూడదని పార్టీ నిర్ణయించింది. మంత్రుల పేర్లు ఖరారు తరువాత అవకాశం రాని వారు తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో అంచనా వేస్తోంది. అందులో భాగంగానే ఒకటి, రెండు స్థానాలు ఖాళీగా ఉండే లా ఆలోచన చేస్తోంది. నాలుగు స్థానాలు మాత్రమే భర్తీ చేయాలని భావిస్తోంది. మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న ఆరు స్థానాలకు 30 మంది పోటీపడుతున్నారు. పార్టీ ముఖ్య నేతల నుంచి మంత్రి వర్గంలో అవకాశం కల్పించటం పైన పార్టీ నాయకత్వం పేర్లు సేకరించింది. అందులో భాగంగా సీఎం ఇచ్చిన జాబితాలో సుదర్శన్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గడ్డం వివేక్ పేర్లు ఉన్నట్టు పార్టీలో ప్రచారం సాగుతోంది. ఉత్తమ్ జాబితాలో ఆయ న భార్య పద్మావతి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, దొంతి మాధవరెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, గడ్డం వినోద్ పేర్లు ఉన్నట్టు సమాచారం.
Also Read: కోలకత్తా జూ.డాక్టర్ పై సామూహిక అత్యాచారం జరగలేదు..సీబీఐ
ఇక భట్టి విక్రమార్క జాబితాలో వాకిటి శ్రీహరి, ప్రేమ్‌సాగర్‌రావు, మల్‌రెడ్డి రంగారెడ్డి, బాలునాయక్, దొంతి మాధవరెడ్డి పేర్లు ఉన్నట్టు చెబుతున్నారు. వాకిటి శ్రీహరికి అవకాశం ఇవ్వాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సూచించినట్లు సమాచారం. సీతక్కకు హోంమంత్రిగా పదోన్నతి కల్పిస్తారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇక ఇటీవల ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన విజయశాంతికి ఈసారి మంత్రివర్గంలో అవకాశం ఉండకపోవచ్చన్న ప్రచారం సాగుతోంది. ఆమె ఎన్నికల ముందే పార్టీలో చేరడంతో ఆమెకు మంత్రి పదవి ఇస్తే సీనియర్ల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండడంతో ఆమెకు ప్రస్తుతం అవకాశం లేనట్లు తెలుస్తోంది. సీనియర్ కాంగ్రెస్ నేత దొంతి మాధవరెడ్డి ఢిల్లీ వెళ్లారు. తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఖర్గే, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ను కలిశారు. చివరి నిమిషం వరకు ఆశావాహులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కాగా, సామాజిక సమీకరణాల తో పాటుగా జిల్లాల వారీ ఎంపిక సమస్యగా మారుతోంది. దీంతో.. తుది జాబితా పైన పార్టీలో ఉత్కంఠ పెరుగుతోంది.
Also Read: ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. భీకర కాల్పుల్లో 15 మంది మావోయిస్టులు మృతి