కాంగ్రెస్ సర్కార్ చెబుతున్న రుణమాఫీ, రైతుభరోసా, బోనస్ అన్నీ బోగస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఈ రోజు నల్లగొండలో నిర్వహించిన రైతు ధర్నాలో ఆయన పాల్గొన్నారు. నల్లగొండ పోరాటాల గడ్డ అని అన్నారు. పోరాటానికి స్పూర్తిని ఇచ్చిన ఈ ప్రాంతానికి వందనమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కష్టాలు మొదలయ్యాయ్నారు. పోరాటాల పురిటి గడ్డ నల్లగొండ మళ్లీ రాష్ట్రంలో రైతుల తిరుగుబాటుకు వేదిక కావాలన్నారు. కేసీఆర్ పాలనలో టింగ్ టింగ్ మని డబ్బులు ఖాతాలో పడేవని గుర్తు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రైతులను నిలువునా మోసం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. కేసీఆర్ 2 పంటలకే ఇస్తుండు.. కానీ రేవంత్‌రెడ్డి మూడో పంటకు ఇస్తా అని మోసం చేశాడన్నారు. జనవరి 26న రా.12 గంటలకు డబ్బులు వేస్తామని రేవంత్ అన్నారు కానీ ఇప్పటివరకు రూపాయి పడలేదన్నారు. నల్లగొండ బిడ్డలు జీవచ్ఛవాలుగా మారడానికి కాంగ్రెస్సే కారణమన్నారు.
ఎకరానికి రూ.17,500 బాకీ..
కాంగ్రెస్ ప్రభుత్వం 2023 యాసంగి పంటకు 2,500 బాకీ పెట్టిందని, వానాకాలం ఒక్కో ఎకరానికి 7,500 బాకీ ఉందన్నారు. ఒక్కో రైతుకు ఎకరాకు రూ.17,500 చొప్పున కాంగ్రెస్ బాకీ ఉందన్నార. కాంగ్రెస్ రైతులను నిలువునా మోసం చేసిందని ఆరోపించారు. రైతుబంధు డబ్బులు ఆపడానికి రేవంత్ రెడ్డి కుట్రలు పన్నుతున్నాడని ఫైర్ అయ్యారు కేటీఆర్. మార్చి 31 వరకూ రుణమాఫీ కొనసాగుతుందని చెబుతున్నారు కానీ ఏ సంవత్సరమో చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. నల్లగొండ నుంచి కాంగ్రెస్ వ్యతిరేక పోరాటం ప్రారంభమన్నారు. కాంగ్రెసోళ్లు మళ్లీ ఓట్ల కోసం వస్తారని.. అప్పుడు వారిని నిలదీయాని ప్రజలకు పిలుపునిచ్చారు.
నాడు కేసీఆర్ నాట్లప్పుడు రైతుబంధు వేస్తే.. రేవంత్ మాత్రం పార్లమెంట్ ఎన్నికల కోసం ఓట్లప్పుడు, స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఓట్లప్పుడు మాత్రమే వేస్తున్నాడు.
— BRS Party (@BRSparty) January 28, 2025
- నల్గొండ రైతు మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS pic.twitter.com/i3P1p577Ow
నల్లగొండ నుండే కాంగ్రెస్‌ను చీల్చి చెండాడాలన్నారు. పాలిచ్చే ఆవును కాదనుకొని.. ఎగిరెగిరి తంతున్న దున్నపోతును తెచ్చుకొని కష్టాలు పడుతున్నారని రైతులు అంటున్నారన్నారు. ఆరేళ్ల పాటు యాసంగికి, వానా కాలానికి లెక్కపెట్టుకుంటా పన్నెండు సార్లు రైతుబంధు వేసిండు కేసీఆర్, కానీ ఏనాడూ ఇలా కాంగ్రెస్ వాళ్ళు చేసుకుంటున్నట్లు ప్రచారాలు చేసుకోలేదన్నారు.
మీటింగ్ పెట్టుకుంటే అడ్డుకునే సన్నాసి మంత్రి...😂
— ChAnduBRS✊🏻 (@IamPRVChAnduBRS) January 28, 2025
సిగ్గుందా మంత్రి.. @KomatireddyKVR
నీకు దైర్యం, దమ్ము ఉంటే గడియారం సెంటర్ కి రా..వచ్చి మీటింగ్ పెట్టి చెప్పు ఈ సంవత్సరా కాలంలో రైతులకి మీ ప్రభుత్వం ఏం పీకిందో....🔥🔥🔥🔥
@KTRBRS 💥😎🔥 pic.twitter.com/BZiLtKqiLH
ఐటీ టవర్ కళ తప్పింది..
నల్గొండ ఐటీ టవర్ కళ తప్పిందన్నారు. కోమటిరెడ్డి వచ్చాక ఐటీ టవర్ తాగుబోతులకు అడ్డాగా మారిందేమో? అన్న అనుమానం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తాము మీటింగ్ పెట్టుకుంటే భయం ఎందుకని ప్రశ్నించారు. దమ్ము, ధైర్యం ఉంటే క్లాక్ టవర్ కి వచ్చి, మా లెక్క మీటింగ్ పెట్టి మీ ప్రభుత్వం సంవత్సరకాలంలో ఏం చేసిందో చెప్పాలన్నారు.