KTR : మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో పర్యటించిన ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చాక నష్టపోయామన్న కేటీఆర్ మళ్లీ టీఆర్‌ఎస్‌గానే ఉండాలనుకుంటున్నామన్నారు. ప్రజా సమస్య లపై త్వరలోనే పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్ 2027లో యాత్ర చేసే అవకాశం ఉందని వెల్లడించారు. డీ లిమిటేషన్ మూలంగా రాష్ర్టంలో అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏ నియోజక వర్గం నుంచైనా పోటీకి సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు.
ఎన్నికల్లో పొత్తుల గురించి మాట్లాడుతూ పొత్తులు మాకు కలిసిరావని తేల్చి చెప్పారు. బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోమని తేల్చి చెప్పారు. పదేళ్ల పాలనలో మాకు, ప్రజల మధ్య దూరం పెరిగిందని కేటీఆర్ అంగీకరించారు.ఈ గ్యాప్ నివారించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. టీడీపీ గురించి ప్రస్తావిస్తూ ఆ పార్టీలో మంచి లక్షణాలు ఉన్నాయన్నారు. ఆ పార్టీ నాయకుడు నేరుగా కార్యకర్తలతో మమేకమవుతారని మా పార్టీలో అది లోపించింది కాబట్టే ఓడిపోయామని చెప్పుకొచ్చారు. ఇక జైలుకు వెళ్తేనే సీఎం అవుతారనేది భ్రమ మాత్రమే అన్న కేటీఆర్ హత్యలు చేసి జైలుకు వెళ్లేంత దుర్మార్గులం కాదని స్పష్టం చేశారు.
KTR : మళ్లీ టీఆర్‌ఎస్‌గా మారనున్న బీఆర్‌ఎస్...మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చాక నష్టపోయామన్నకేటీఆర్ మళ్లీ టీఆర్‌ఎస్‌గానే ఉండాలనుకుంటున్నా మన్నారు.
KTR