Harish Rao : ఎస్ఎల్ బీసీ సందర్శనకు బీఆర్ఎస్ బృందం.. అరెస్ట్ చేయకుండా చూసుకోవలసింది వారే....హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

ఎస్ఎల్ బీసీ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో 8మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వారిని కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్లుండి ఎస్ఎల్ బీసీ టన్నెల్ ను సందర్శిస్తామన్నారు.

New Update
 BRS Harish Rao

BRS Harish Rao

.Harish Rao :  ఎస్ఎల్ బీసీ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో 8మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వారిని కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేత మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన మాట్టాడుతూ ఎల్లుండి ఉదయం ఎస్ ఎల్ బీసీ టన్నెల్ ను సందర్శిస్తామన్నారు. సహాయక చర్యలకు ఎటువంటి ఆటంకం కలగకూడదని మేము వెళ్ళడం లేదని తెలిపారు. మేము వెళ్తుంటే అరెస్ట్ చేయకుండా మంత్రులే చూసుకోవాలన్నారు.

Also Read: మహా కుంభమేళా పై రాంగ్ న్యూస్‌... 140 సోషల్‌ మీడియా అకౌంట్ల పై కేసు నమోదు!

ఇక కృష్ణ జలాల గురించి మాట్లాడుతూ  కృష్ణా జలాల విషయంలో ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందని విమర్శించారు. KRMB మొదటి మీటింగ్ లోనే మన ప్రాజెక్ట్ లను KRMB కు అప్పజెప్పి వచ్చారని ఆరోపించారు. కృష్ణా జలాల విషయంలో అన్యాయం జరుగుతుందని మొద్దు నిద్ర పోతున్న ప్రభుత్వాన్ని తట్టి లేపిందాక సోయి లేదని ఎద్దేవా చేశారు.

ఇది కూడా చదవండి: BIG BREAKING: శివాలయానికి వెళ్తుండగా ఏనుగుల గుంపు దాడి.. నలుగురు మృతి

ఇది కూడా చదవండి: SLBC UPDATES: పెరుగుతున్న బురద నీరు.. ఏ క్షణమైనా కన్వేయర్ బెల్టు తెగే ప్రమాదం!

Also Read :  తెలంగాణవాసులకు చల్లటి కబురు.. వాతావరణ శాఖ ఏం చెప్పిందో తెలుసా!


 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు