BIG BREAKING: కేటీఆర్ అరెస్టుకు డేట్‌ ఫిక్స్!

బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టుకు డేట్‌ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్ అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై అమిత్ షాతో చర్చించేందుకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఢిల్లీకి వెళ్లరనే ప్రచారంతో ఉత్కంఠ నెలకొంది

author-image
By srinivas
New Update

KTR Arrest: బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టుకు డేట్‌ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్ అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కేటీఆర్‌ అరెస్టుపై అమిత్ షాతో చర్చించేందుకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఇవాళ ఢిల్లీకి వెళ్లరనే ప్రచారంతో ఉత్కంఠ నెలకొంది. పీసీ యాక్ట్ 17ఏ కింద కేటీఆర్ ను విచారించేందుకు అనుమతించాలంటూ ఇప్పటికే ప్రభుత్వం గవర్నర్‌ ను కోరగా.. దీనిపై అటార్నీ జనరల్ అభిప్రాయం కోరారు గవర్నర్ జిష్ను దేవ్. ఈ నేపథ్యంలోనే మరో రెండు వారాల్లో కేటీఆర్ అరెస్ట్ అయ్యే ఛాన్స్‌ ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.  

ఢిల్లీ టూర్లతో వేగంగా మారుతున్న పరిణామాలు.. 

ఈ మేరకు వరుసగా కేటీఆర్, సీఎం రేవంత్, గవర్నర్‌ల ఢిల్లీ టూర్‌ నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ నెల 11న కేటీఆర్ ఢిల్లీకి వెళ్లగా.. తర్వాతి రోజే సీఎం రేవంత్ హస్తినలో దర్శనమివ్వడం హాట్ టాపిక్ గా మారింది. అయితే కేటీఆర్ అరెస్ట్ పై గవర్నర్ అనుమతివ్వకపోతే బీజేపీ-బీఆర్‌ఎస్‌ చీకటి బంధం బయట పడుతోందని రేవంత్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు ఓటేయద్దంటే బీజేపీకి సహకరించినట్లు కాదా అంటూ రేవంత్ ప్రశ్నించారు. దీంతో కేటీఆర్ విచారణ విషయంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? రేవంత్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనేది రాజకీయాలను హీటెక్కిస్తోంది.

ఇది కూడా చదవండి: Lagacharla: లగచర్లలో మళ్లీ హై టెన్షన్..!

ఫార్ములా ఈ రేసు అంశాన్ని తిరగదోడుతున్న అధికారులు..

ఇక ఈ-రేస్‌ స్కామ్​లో కేటీఆర్ అరెస్ట్ తప్పదని పెద్ద ఎత్తున్న రాష్ట్రంలో ప్రచారం సాగుతోంది. కేటీఆర్ విచారణకు అనుమతి కోరుతూ ఏసీబీ రాష్ట్ర గవర్నర్ అనుమతి కోరగా.. సీఎం రేవంత్ గవర్నర్ ను కలిసి ఈ కేసులో పూర్వా పరాలు వివరించినట్లు సమాచారం. అలాగే ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఏసీబీ విచారణ చేయాలంటూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్‌ లేఖ రాయడంతో ప్రభుత్వం అనుమతిచ్చింది. ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారి నేతృత్వంలోని అధికారులు ఫార్ములా ఈ రేసు అంశాన్ని తిరగదోడుతున్నారు. అందులో భాగంగానే అర్వింద్‌ కుమార్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ విచారణలో ఆయన వెల్లడించే అంశాలే కీలకంగా మారనున్నాయి. 

ఇది కూడా చదవండి: HYDRA: హైడ్రాకు షాక్.. కూల్చివేతలపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు!

మరోవైపు ఫార్ములా ఈ రేసు అంశంలో విదేశీ సంస్థకు నిధులు బదిలీ అయిన నేపథ్యంలో ఈడీకి కూడా ప్రభుత్వం సమాచారం ఇచ్చినట్లు సమాచారం. ఏసీబీ కేసు రిజిస్టర్‌ చేయగా.. ఈడీ కూడా విచారణ చేపట్టవచ్చని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తనను అరెస్ట్ చేయాలనకుంటే సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ చెబుతున్నారు. భయపడేది లేదని, జైలు నుంచి బయటకు వచ్చి పాదయాత్ర చేస్తానని చెబుతుండటం విశేషం. 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Telangana: ఇంట‌ర్ ప‌రీక్ష‌ల్లో ఫెయిల్.. ఆరుగురు విద్యార్థులు సూసైడ్

తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. పరీక్షల్లో ఫెయిలవ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.

New Update
Death

Death

తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. పరీక్షల్లో ఫెయిలవ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని అశ్విని కి తక్కువ మార్కులు వచ్చాయని మనస్తాపంతో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది.

Also Read: పహల్‌గామ్ ఉగ్రదాడికి సూత్రధారి వీడే .. లష్కరే తోయిబా టాప్ కమాండర్!

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురం గ్రామానికి  చెందిన ఓ విద్యార్థి స్థానిక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదివాడు. రిజల్ట్స్ చూసుకోగా ఫెయిలయ్యాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని మోతీనగర్‌కు సమీపంలో అవంతినగర్‌కు చెందిన ఓ విద్యార్థి బల్కంపేటలోని ఇంటర్ ఫస్టియర్ చదివాడు. 

Also Read: శ్రీనగర్‌లో చిక్కుకుపోయిన 80 మంది తెలంగాణ పర్యటకులు

పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఆవేదనకు గురయ్యాడు. సాయంత్రం ఎవరూ లేని సమయాన్ని చూసి ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక నాగోలు తట్టిఅన్నారం వైఎస్‌ కాలనీకి చెందిన ఓ విద్యార్థిని ఇంటర్‌ బైపీసీ మొదటి సంవత్సరం పరీక్షలు రాసింది. ఒక సబ్జెక్టులో ఫెయిలయ్యింది. ఉత్తీర్ణత సాధించకపోవడంతో ఉరేసుకొని సూసైట్ చేసుకుంది. 

Also Read: విదేశీ అతిథుల సమయంలోనే ఉగ్రదాడులు.. నాడు క్లింటన్‌.. నేడు జేడీ వాన్స్‌!

బంజారాహిల్స్‌లోని ఇందిరానగర్‌లో ఉంటున్న సుమతి, రామకృష్ణ కూతురు నిష్ఠ.. ఇంటర్‌ ఫస్టియర్ చదవింది. అయితే కెమిస్ట్రీలో ఫెయిల్‌ కావడంతో బలవన్మరణానికి పాల్పడింది. మేడ్చల్‌ మండలం గుండ్లపోచంపల్లికి చెందిన విద్యార్థిని  కార్పొరేట్ కాలేజ్‌లో ఇంటర్ చదివింది. సెకండియర్‌లో అనుకున్న మార్కులు రాలేదని సూసైడ్ చేసుకుంది. 

Also Read: సరిహద్దుల్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఇండియాలోకి అక్రమంగా చొరబడేందుకు!

telugu-news | rtv-news | national-news | inter-results | suicide 

Advertisment
Advertisment
Advertisment