కృష్ణా జలాల కేటాయింపు విషయంలో 1956 అంత రాష్ట్ర జలవివాదాల చట్టం సెక్షన్ 3 ప్రకారం వాదనలు వింటామని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర ఆదేశాలపై మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేసారు. పదేళ్ల పాటు నిర్విరామంగా కేసీఆర్ గారు చేసిన పోరాటానికి వచ్చిన ఫలితమే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తాజా ఉత్తర్వులని పేర్కొన్నారు. ఇది కేసీఆర్ ప్రభుత్వం పట్టుబట్టి సాధించిన విజయంగా అభివర్ణించారు. కృష్ణా జలాల కేటాయింపులు రాష్ట్రాల వారీగా ఉండాలి తప్ప ప్రాజెక్టుల వారీగా ఉండకూడదని మొదటి నుంచి కేసీఆర్ చేసిన వాదనతో ఎట్టకేలకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏకీభవించిందన్నారు.
ఇది కూడా చదవండి: తాత KCRతో కలిసి హిమాన్షు పొలం పనులు.. పార పట్టుకుని.. వీడియో వైరల్!
బ్రిజేష్ ఆదేశాలు.. ముమ్మాటికి కేసీఆర్ ప్రభుత్వ విజయమే
— Office of Harish Rao (@HarishRaoOffice) January 17, 2025
✳️ మొదటి నుంచి సెక్షన్ 3 ప్రకారం నీళ్లు కేటాయించాలని పట్టు బట్టిన కేసీఆర్ గారు
✳️తాజాగా ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను స్వాగతిస్తున్నాం
✳️దీన్ని కూడా కాంగ్రెస్ తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గు చేటు
✳️అసలు ఏపీ… pic.twitter.com/yarfq9aIpW
నదీ జలాల కేటాయింపుల్లో తెలంగాణకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ కొట్లాడి సాధించిన విజయాన్ని సైతం తమ ఘనతగా చెప్పుకోవడం కాంగ్రెస్ పార్టీ భావదారిద్ర్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ మేరకు హరీష్ రావు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు BRS బిగ్ షాక్!
బీడుబడ్డ తెలంగాణ భూములకు కృష్ణా జలాలను మళ్లించాలని ఉద్యమ నేత కేసీఆర్ గారు చేసిన కృషి ఫలించింది. కృష్ణా నీళ్లలో మా వాటా మాకే అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు చేసిన పోరాట ఫలాలు అందుకోవడం ఎంతో దూరంలో లేదు.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) January 17, 2025
రాష్ట్రాల వారీగా నీటి కేటాయింపులపై విచారణ జరపాలని గత పదేళ్లుగా కేసీఆర్ గారు… pic.twitter.com/gF98K41AWR
కేసీఆర్ కృషి ఫలించింది..
ఈ అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సైతం స్పందించారు. బీడుబడ్డ తెలంగాణ భూములకు కృష్ణా జలాలను మళ్లించాలని ఉద్యమ నేత కేసీఆర్ గారు చేసిన కృషి ఫలించిందన్నారు. కృష్ణా నీళ్లలో మా వాటా మాకే అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన పోరాట ఫలాలు అందుకోవడం ఎంతో దూరంలో లేదన్నారు. రాష్ట్రాల వారీగా నీటి కేటాయింపులపై విచారణ జరపాలని గత పదేళ్లుగా కేసీఆర్ చేసిన వాదనకే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మొగ్గు చూపడం సంతోషకరమన్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రజల విజయమన్నారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు కవిత.