Harish Rao: వేలాదిగా తరలిరండి.. బీఆర్ఎస్ శ్రేణులకు హరీశ్ రావు పిలుపు

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీ, అనుచరులను అరెస్టుల చేయాలని డిమాండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టిన హరీశ్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కందుర్గ్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

New Update
Harish Rao

న్యాయం కోసం వేలాదిగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి తరలి రావాలని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. సీపీ కార్యాలయంలో మూడు గంటలకు పైగా హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతల నిరసన నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీ, అనుచరులను అరెస్టులు చేయాలని.. దాడికి ప్రోత్సహించిన సీఐ, ఏసీపీని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. ఎంతకూ వారు శాంతించకపోవడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. శంషాబాద్ పీఎస్ కు వారిని తరలిస్తున్నట్లు తెలుస్తోంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు