Union Budget 2024: ఇది బీహార్ బడ్జెట్.. రేవంత్ రెడ్డి ఓ కోతల రెడ్డి.. మాజీ మంత్రి పంచ్ లు!

ఈ రోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు గుండు సున్నా ఇచ్చిందని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇది బీహార్ బడ్జెట్ లాగా ఉందని అభివర్ణించారు. రేవంత్ రెడ్డి కోతల రెడ్డి లాగా మారారని ఫైర్ అయ్యారు.

New Update
Vemula Prashanth Reddy Nirmala Seetharaman Revanth Reddy

Vemula Prashanth Reddy Nirmala Seetharaman Revanth Reddy

తెలంగాణ (Telangana) కు కేంద్ర బడ్జెట్ (Union Budget 2025) లో అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేంద్ర బడ్జెట్ బీహార్ బడ్జెట్ గా మారిందని విమర్శించారు. నవోదయా స్కూళ్ల ప్రకటన గానీ, తెలంగాణకు ఉపయోగపడే మరే అంశంగానీ బడ్జెట్ లో లేదన్నారు. బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు తెలంగాణలో ఉన్నా సాధించింది సున్నా అని అన్నారు. ప్రాంతీయ పార్టీలకు ఎంపీలుంటేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ రోజు తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.. టిక్ టాక్ కు, ట్విట్టర్ కు కూడా తేడా తెలియని వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నాడని ఎద్దేవా చేశారు. అచ్చోసిన ఆంబోతు తెలంగాణకు సీఎం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Also Read :  ఘోర రోడ్డు ప్రమాదం.. ఐర్లాండ్‌లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి

రేవంత్ మైండ్ బ్లాక్..

కాంగ్రెస్ పార్టీ అఫిషియల్ ట్విటర్ హ్యాండిల్ లో వచ్చిన పోల్ ఫలితం తో రేవంత్ రెడ్డి మైండ్ బ్లాంక్ అయ్యి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారన్నారు. సీఎం ది సంస్కారహీనమైన భాష అని అన్నారు. మాట ఇస్తే తప్పనని రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారన్నారు. రుణ మాఫీపై రకరకాల డెడ్ లైన్లు పెట్టి మాట తప్పింది రేవంత్ రెడ్డి కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇంకా 30 లక్షల మందికి రుణ మాఫీ కాలేదన్నారు. రేవంత్ రెడ్డి కోతల రెడ్డి లాగా మారారన్నారు.

Also Read :  భూమి తిరగడాన్ని ఎప్పుడైన చూశారా.. ఇదిగో వీడియో

Also Read :  ‘బుల్లెట్ గాయాలకు బ్యాండేజ్‌లా’ 2025 బడ్జెట్‌పై రాహుల్ గాంధీ విమర్శలు

ఎన్నికల సమయంలో ఈసీకి ఫిర్యాదు చేసి రైతుబంధును ఆపింది రేవంత్ రెడ్డి కాదా? అని ప్రశ్నించారు. వానా కాలం రైతు బంధు ఎగ్గొట్టింది రేవంత్ రెడ్డి కాదా? అని అన్నారు. రైతులు రేవంత్ ను ఎనుముల రేవంత్ రెడ్డి అనడం లేదని.. ఎగవేతల రేవంత్ రెడ్డి అంటున్నారన్నారు. రైతు భరోసా రూ.15 వేలు ఇస్తానని చెప్పి.. 12 వేలకు పరిమితం చేయడం మాట తప్పడం కాదా? అని ఫైర్ అయ్యారు.  

Also Read :  ఇది బీహార్ బడ్జెట్.. రేవంత్ రెడ్డి ఓ కోతల రెడ్డి.. మాజీ మంత్రి పంచ్ లు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు