15 నెలలు.. 4 ప్రాజెక్టులు.. కాంగ్రెస్ అవినీతి చరిత్ర ఇదే: హరీష్ సంచలన ఆరోపణలు!

కాంగ్రెస్ సర్కార్ అవినీతి, నిర్లక్ష్యంతో 15 నెలల్లోనే 4 ప్రాజెక్టులు కూలిపోయాయని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ రోజు ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద జరుగుతున్న రిస్క్యూ ఆపరేషన్ ను ఆయన పరిశీలించారు.

New Update
BRS Leader Harish Rao

BRS Leader Harish Rao

కాంగ్రెస్ సర్కార్ అవినీతి, నిర్లక్ష్యంతో 15 నెలల్లోనే 4 ప్రాజెక్టులు కూలిపోయాయని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లాలో పెద్దవాగు కొట్టుకుపోయిందన్నారు. సుంకిశాల ప్రాజెక్ట్ కుప్పకూలిందన్నారు. వట్టెం పంపు హౌజ్ జలమయం అయ్యిందన్నారు.  SLBC టన్నెల్ కూలిపోయిందన్నారు. ఎన్నికల ప్రచారం ముఖ్యమా? ఎనిమిది మంది ప్రాణాలు కాపాడటం ముఖ్యమా? అని సీఎం రేవంత్ ను ప్రశ్నించారు. ఎస్ఎల్‌బీసీ ప్రమాద ఘటన జరిగి ఆరు రోజులైనా ఇప్పటికీ రేవంత్ రెడ్డి రాలేదని ఫైర్ అయ్యారు. ఎందుకిత బాధ్యతా రాహిత్యం? అని ధ్వజమెత్తారు.

ఎస్ఎల్‌బీసీ ప్రమాద ఘటనలో చిక్కుకున్న 8 మంది కార్మికుల ప్రాణాలు కాపాడే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఆరు రోజులైనా ఇప్పటి వరకు సరైన డైరెక్షన్ ఇవ్వకుండా రేవంత్ సర్కార్ మొద్దు నిద్రలో ఉందన్నారు. ఏ రకంగా ముందుకు పోవాలని నిర్ణయం తీసుకోవడానికి ఆరు రోజులు పడుతుందా? అని ఫైర్ అయ్యారు. మంత్రులు పొద్దున వస్తున్నారు.. సాయంత్రం పోతున్నారని.. ఇదేమైనా టూరిస్ట్ ప్లేసా? అని ధ్వజమెత్తారు.

ఇంతకంటే ముఖ్యమైన పని రాష్ట్రంలో ఏముంటది? అని అన్నారు. సహాయక చర్యలు జరుగుతున్నాయనీ, కొద్ది రోజులు ఆగి వెళ్లాలని కేసీఆర్ తమకు సూచించారన్నారు. అందుకే ఇప్పటి దాకా సంయమనం పాటించామన్నారు. ఆరు రోజుల్లో తట్టెడు మట్టి కూడా తీయలేదన్నారు. ఆరు రోజుల్లో 8 మంది ప్రాణాలు కాపాటంలో రాష్ట్ర ప్రభుత్వం చేసింది సున్నా పని అంటూ ఫైర్ అయ్యారు. అందుకే తాము ఈరోజు ఇక్కడ ఏం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకునేందుకు వచ్చామన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BREAKING: HCU వివాదం.. రేవంత్ సర్కార్ పై సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్స్

కంచగచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వివాదంపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

New Update
Supreme Court Key Comments on HCU Lands

Supreme Court Key Comments on HCU Lands

కంచగచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వివాదంపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. జంతువులు షెల్టర్‌ అక్కడ తిరగడం షాకింగ్‌గా ఉందని ఉందని తెలిపింది. వారాంతపు సెలవుల్లో 3 రోజుల్లో చెట్లు కొట్టాల్సిన తొందర ఎందకు వచ్చిందని నిలదీసింది. మీరు చెట్లు నరికివేయడం వల్ల అక్కడి జంతువుల మీద కుక్కలు దాడి చేస్తున్నాయని ఈ వీడియోలు కూడా మేము చూశామని తెలిపింది. 

చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దని చెప్పింది. చెట్లు నరికేందుకు పర్మిషన్ తీసుకోకపోతే అధికారులను జైలుకు పంపుతామని హెచ్చరించింది. అలాగే చీఫ్ సెక్రటరీ శాంతి కుమారిని కాపాడాలనుకుంటే నరికివేసిన ఆ 100 ఎకరాల్లో చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో ఓ ప్రణాళికతో రావాలని ఆదేశించింది. చివరికి మే 15కు విచారణను వాయిదా వేసింది.   

Advertisment
Advertisment
Advertisment