/rtv/media/media_files/2025/02/19/8lzeNmfZFew1FVFSn0b7.webp)
KCR
KCR : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కనబడటం లేదని బీజేపీ నాయకులు ఈ రోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ కనిపించడం లేదని ఆరోపించారు. ప్రజలకు ఏదో చేస్తాడని గెలిపిస్తే గెలిచిన నాటినుంచి ముఖం చాటేస్తున్నాడని వారు ఆరోపించారు. గజ్వేల్ ఎమ్మెల్యే కనబడటం లేదని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయన్ని ముట్టడించిన బిజేపీ నాయకులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ గేటుకు టూలెట్, వాంటెడ్ బోర్డులను అతికించి నిరసన వ్యక్తం చేశారు. గజ్వేల్ ప్రజలు గుర్తున్నారా కేసీఆర్ అంటూ గజ్వేల్ బిజెపి శ్రేణులు నిరసన తెలిపారు.
కాగా గతంలో మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ పది నెలలుగా కనిపించడం లేదని, వెతికి పెట్టాలని సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీసులకు స్థానిక కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ఆచూకీని కనిపెట్టి నియోజకవర్గ ప్రజల ముందుకు తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి గజ్వేల్ ఇన్‌స్పెక్టర్ సైదాకు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేసీఆర్ మీరెక్కడా? అని ప్రశ్నించారు. వారం రోజుల్లో కేసీఆర్ జాడ తెలియకపోతే తామే వెతుకుతామని తెలిపారు. ఎన్నికల్లో గెలిచి పది నెలలు కావస్తున్నా నియోజకవర్గంలో ఆయన జాడలేదని పేర్కొన్నారు. ప్రజల కాలిలో ముల్లు దిగితే పంటితో తీస్తానని చెప్పి మరిచిపోయారా? అని గుర్తుచేశారు. కేసీఆర్ యోగక్షేమాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన గజ్వేల్ ప్రజల మీద ఉందన్నారు. పోలీసులు కేసీఆర్ ఆచూకీ చెప్పకపోతే.. తామే కేసీఆర్ ఫామ్‌హౌ్‌సకి స్వయంగా వెళ్లి యోగక్షేమాలు తెలుసుకుంటామని అన్నారు.
Also Read: Ap weather: ఏపీ ప్రజలకు మాడు పగిలే వార్త...ఆ జిల్లాల్లో ఏకంగా 42 డిగ్రీల ఎండ..జాగ్రత్త!
మరోవైపు తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కనబడుట లేదంటూ పోస్టర్లు సిద్దిపేట జిల్లాలో కలకలం రేపాయి. ఈ మేరకు పోస్టర్లలో ఇలా రాసుకొచ్చారు. పూర్తి పేరు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, వయసు 70 ఏళ్లు, వృత్తి.. అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేయడం, అధికారం కోసం ఆరాటం, కుటుంబం కోసం పోరాటం, బాద్యత.. గజ్వేల్ ఎమ్మెల్యే, మాజీ సీఎం అంటూ రాసుకొచ్చారు. అంతేకాదు.. గుర్తులను కూడా పేర్కొన్నారు. తెల్లచొక్కా, తెల్లప్యాంట్ నెత్తిపై టోపీ, భయంకరమైన హిందువు, 80వేల పుస్తకాలు చదివిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఎకరాకు రూ.కోటి సంపాదించే వ్యక్తి.. కేసీఆర్ ఆచూకీ తెలిపిన వారికి మంచి బహుమానం కూడా ఉంటుందని రాసుకొచ్చారు. గజ్వేల్‌లో ఈ పోస్టుర్లు సంచలనంగా మారాయి. ఆయన ఆచూకీ తెలిస్తే గజ్వేల్ క్యాంపు కార్యాలయంలో తెలపాలని చెప్పారు.