అట్టుడుకుతున్న మణిపుర్.. అధికార ప్రభుత్వానికి బిగ్ షాక్ మణిపుర్‌లో సీఎం బీరెన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) మద్దతును ఉపసంహరించింది. రాష్ట్రంలో జాతి హింసను కంట్రోల్ చేసి సాధారణ పరిస్థితులకు తీసుకురావడంలో అధికార ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. By B Aravind 17 Nov 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి మణిపుర్‌లో బీజేపీ మిత్రపక్షమైన నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం బీరెన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించింది. రాష్ట్రంలో జాతి హింసను కంట్రోల్ చేసి సాధారణ పరిస్థితులకు తీసుకురావడంలో అధికార ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపణలు చేసింది. కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్‌పీపీ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఆదివారం లేఖ రాసింది. బీరెన్ సింగ్ నేతృత్వంలోని అధికార ప్రభుత్వం రాష్ట్ర సంక్షోభాన్ని పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని మేము భావిస్తున్నామని పేర్కొంది. Also Read: రహస్యంగా వారసుడుని ఎన్నుకున్న ఖమేనీ.. కారణమేంటి? ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని.. రాష్ట్రంలో బీరెన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి వెంటనే అమల్లోకి వచ్చేలా మద్దతును ఉపసంరించుకోవాలని ఎన్‌పీపీ నిర్ణయించిందంటూ రాసుకొచ్చింది. ఇదిలాఉండగా.. మణిపుర్‌లో ఏడాదిపైగా కుకీ, మైతీ జాతుల మధ్య ఘర్షణలు జరగుతూనే ఉన్నాయి. వందల సంఖ్యలో అక్కడి ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. ఇటీవల మైతీ వర్గానికి ముగ్గురు మహిళలు, ముగ్గురు పిల్లలను కుకీ మిలిటెంట్లు కిడ్నాప్ చేసి హత్య చేసిన సంగతి తెలిసిందే. Also Read: అమ్మో దెయ్యం.. 50మంది మృతి, వణికిపోతున్న తెలంగాణ వాసులు! ఈ నేపథ్యంలోనే మైతీ వర్గం ప్రజలు అక్కడ నిరసనలు చేపట్టారు. సీఎం బీరెన్ సింగ్ ఇంటితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై కూడా నిరసనాకారులు దాడులకు పాల్పడ్డారు. మరోవైపు మణిపుర్‌లో కూడా రోజురోజుకు ఉద్రిక్త పరిస్థితులు ముదురుతున్నాయి. చివరికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. ఆదివారం ఆయన ఢిల్లీలో సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. మణిపుర్‌లో శాంతి భద్రతలను సమీక్షించాలన్నారు. సోమవారం కూడా హోం మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులతో అమిత్ షా మరోసారి సమావేశం కానున్నారు. Also Read: అమ్మో దెయ్యం.. 50మంది మృతి, వణికిపోతున్న తెలంగాణ వాసులు! #telugu-news #national-news #manipur మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి