/rtv/media/media_files/2025/03/28/sshA0l7NCucO7Hec1P5s.jpg)
cm revanth reddy
CM Revanth Reddy :1980 లో బిజేపీపార్టీ ఏర్పడిందని ఇప్పటి వరకు 15 మంది బీజేపీ అధ్యక్షుల నియామకం జరిగింది.. కానీ ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలి గా ఒక్క మహిళ నియామకం జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీన్ని బట్టే బీజేపీకి మహిళ పట్ల గౌరవం, చిత్తశుద్ది ఎంత ఉందో అర్థమౌతుందని ఎద్దేవా చేశారు. ఇందిరాగాంధీ, సోనియా గాంధీ నాయకత్వంలో అతి ఎక్కువ కాలం పనిచేసిన పార్టీ కాంగ్రెస్ మహిళలకు అన్యాయం చేస్తుందా..? అన్నారు.బీజేపీకి మహిళను అధ్యక్షురాలిగా నియమించుకున్న తర్వాత బండి సంజయ్ మాట్లాడాలన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలు దక్షణాది రాష్ట్రాల్లోని ఎస్సీ,ఎస్టీ, మహిళలకు వ్యతిరేకం అన్నారు.
మా ఎంపీలు తెలంగాణ ను సాధించారు.. ఇప్పుడు పునర్విభజన పైన కూడా పోరాడుతారన్నారు. దక్షణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలను కూడా ఐక్యం చేస్తాం.. పార్లమెంట్ లో బిల్లు ను ఎలా ఆమోదిస్తారో చూస్తాం.. 60 యేళ్లలో మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ చాలా చేసింది.. 46 యేళ్లలో ఒక్క మహిళ ను పార్టీ అధ్యక్షురాలి ని బీజేపీ చేయలేదు.. జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ పదవి కూడా ఇవ్వలేదని రేవంత్ రెడ్డి అన్నారు.మహిళలను చిన్న చూపు చూడటమే బీజేపీ లక్షణం.. ద్వితీయ శ్రేణి పౌరులుగా మహిళలను చూస్తున్నారన్నారు.స్వాతంత్ర్యం తెచ్చింది, రాజ్యాంగాన్ని తెచ్చింది, రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు దేశాన్ని కాపాడుకునే బాధ్యత కూడా కాంగ్రెస్ దే అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
పునర్విభజన గురించి మాట్లాడుతూ యాభై శాతంతో సీట్ల పునర్విభజన జరిగితే కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు మోదీ ఇంటి ముందు బంట్రోతు లుగా నిలబడాల్సి వస్తుందన్నారు.. వాళ్ల అవసరం ఇక ముందు ఉండదన్నారు.అన్ని దక్షణాది రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, పంజాబ్ లాంటి చిన్న రాష్ట్రాలకు దీనిపైన లేఖ రాస్తాను అన్నారు.సీట్ల పునర్విభజనలో పర్సంటేజీలు కాదు నెంబర్ ముఖ్యం.. రాజకీయాల్లో నెంబర్ ముఖ్యం.. వాజపేయి ప్రభుత్వం ఒక్క ఓటుతో పడిపోయింది..నెంబర్ లేకుండా రాజకీయాల్లో ఎవరూ ఎవరితోనూ చర్చలు చేయరు.. బాగా పనిచేస్తున్న రాష్ట్రాలను శిక్షించవద్దు.. అని రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు.
Follow Us