VIJAYA REDDY:  విజయారెడ్డి ఆత్మహత్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌...ప్రాణహాని ఉందంటూ భర్త ఫిర్యాదు

ఇటీవల ఇద్దరు పిల్లలతో కలిసి చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి కేసు కీలక మలుపు తిరిగింది. తనకు ప్రాణ హాని ఉందంటూ విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి పోలీసులను ఆశ్రయించడం సంచలనంగా మారింది.

New Update
FotoJet (55)

Vijaya Reddy husband complains of danger to life

VIJAYA REDDY :  ఇటీవల ఇద్దరు పిల్లలతో కలిసి చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి కేసు కీలక మలుపు తిరిగింది. తనకు ప్రాణ హాని ఉందంటూ విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి పోలీసులను ఆశ్రయించడం సంచలనంగా మారింది. విజయా రెడ్డి చనిపోయాక ఆస్తి వివాదాలు తలెత్తినట్లు అతను ఆరోపిస్తున్నారు. ఆస్తికోసం పుట్టింటివారే విజయారెడ్డిపై ఒత్తిడి తీసుకువచ్చారని ఆయన ఆరోపించారు. ఆమె సోదరుడు చిరంజీవి విజయారెడ్డి ఆస్తులపై కన్నేసాడని, భారీమొత్తంలో నగదు ఇవ్వాలని వేధించాడని సురేందర్‌ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

విజయారెడ్డి పుట్టింటివారే నా కుటుంబాన్ని నాశనం చేశారని.. విజయా రెడ్డి తల్లి పుష్పలత, అన్న చిరంజీవి, అతని భార్య వేధింపులు, ఆస్తి కోసం వాళ్లు ఒత్తిడి చేయటం వల్లే విజయారెడ్డి పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తులను తమ పేరిట రాయాలని చిరంజీవి బెదిరింపులకు దిగాడని పేర్కొన్నారు. నా అత్త, బామ్మర్ధి, అతని భార్య ఆస్తి కోసం నా కుటుంబాన్ని నాకు కాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.. నా భార్య, పిల్లలు చనిపోయిన బాధలో నేనుంటే.. 25 రోజులకే నన్ను బెదిరించారని.. ఆస్తి కోసం వాళ్లు ఎంతకు అయినా తెగిస్తారంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సురేందర్ రెడ్డి పేర్కొన్నారు.

Also Read: ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా..? 90's కుర్రాళ్ల కలలరాణి.. ఇప్పుడు ఎలా ఉందో చూడండి

విజయారెడ్డి తల్లి పుష్పలత ఇంట్లో గోల్డ్‌పై కన్నేసిందని, అలాగే  కొత్త ఇళ్లు నిర్మాణం విషయంలోనూ వివాదం నెలకొంది అని వివరించారు. స్థిరాస్తులు పత్రాలు ఇవ్వాలని చిరంజీవి ఒత్తిడి చేశారన్నారు. ఆస్తికోసం విజయారెడ్డికి మానసికంగా వేధించడం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు. నేను చనిపోతే ఆస్తి మొత్తం వాళ్లకు చెందుతుందన్న ఆశలో వారున్నారని, అందుకే నన్ను కూడా అడ్డు తొలగించుకోవడానికి చూస్తున్నారన్నారు. నేను చనిపోతే నా ఆస్తులు నా తల్లిదండ్రులకు లేదా ట్రస్టుకు రాస్తానని స్పష్టం చేశారు. నా భార్య, పిల్లలు ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాళ్లు కాదని.. ఆస్తి కోసం వాళ్ల కుటుంబం మొత్తం వేధింపులకు గురి చేయడం వల్లే వారు ఆ నిర్ణయం తీసుకున్నారన్నారు.  విజయారెడ్డి తల్లి పుష్పలత,  అన్న చిరంజీవి నుంచి నాకు ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించాలంటూ మేడిపల్లి పోలీసులకు సురేందర్‌ రెడ్డి కంప్లయింట్ చేశారు. 

Also Read: రక్తంతో తడిసి ముద్దైన రోడ్లు.. యాక్సిడెంట్‌లో 18 మంది మృతి

అసలేం జరిగిందంటే ..

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయిన పిన్నింటి విజయ అలియాస్ విజయారెడ్డి (38) బోడుప్పల్‌‌‌‌‌లోని చెంగిచర్ల హరితవనం కాలనీలో నివాసం ఉంటున్నారు. జనవరి 31న రాత్రి ఆమె  కూతురు చైతన్య రెడ్డి (18), కొడుకు విశాల్ రెడ్డి (17) లను తీసుకుని వారి స్వంత కారులో చర్లపల్లి రైల్వే స్టేషన్‌‌‌‌‌కు వెళ్లారు. అనంతరం సనత్‌‌‌నగర్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.  వీరిని గుర్తించిన లోకో పైలట్ ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది  వారి డెడ్‌‌‌‌‌‌‌‌‌బాడీలను స్వాధీనం చేసుకొని, పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.  

విజయా రెడ్డి  హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్‌‌‌‌‌వేర్ కంపెనీలో టీమ్ లీడర్‌‌గా పనిచేస్తుండగా,  ఆమె భర్త సురేందర్ రెడ్డి దుబాయ్‌లో ఉద్యోగం చేశారు. వారి ఇద్దరు పిల్లలు పటాన్‌చెరులోని ఓ కాలేజీ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. వారిని ముందురోజే ఇంటికి తీసుకువెళ్లిన విజయారెడ్డి మరునాడు ముగ్గురు కలిసి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. తాజాగా ఆస్తికోసమే తన భార్యపిల్లలను ఆమె కుటుంబ సభ్యులు ప్రేరేపించారని ఆమె భర్త సురేందర్‌ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. అలాగే వారినుంచి తనకు కూడా ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. 

Advertisment
తాజా కథనాలు