Konda Surekha: మంత్రి కొండా సురేఖకు షాక్!

TG: మంత్రి కొండా సురేఖపై కోర్టు సీరియస్‌ అయింది. ఇంకెప్పుడూ కేటీఆర్‌పై అడ్గగోలు వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. కేటీఆర్‌ దాఖలు చేసిన 100 కోట్ల పరువు నష్టం కేసులో కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని మండిపడింది.

New Update
Konda Surekha,

Konda Surekha: కొండా సురేఖ తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రి  కేటీఆర్ దాఖలు చేసిన 100 కోట్ల పరువు నష్టం కేసులో కోర్టు మంత్రి కొండా సురేఖకు ఊహించని షాక్ తగిలింది. ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయంటూ కోర్టు మంత్రిపై  మండిపడింది. ఓ బాధ్యత గల మహిళ మంత్రి ఇలాంటి కామెంట్స్ చేయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పింది. కేటీఆర్ పై కొండా సురేఖ వ్యాఖ్యలను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సీరియస్ అయింది. 

ఇది కూడా చదవండి: ఇవి ఉంటేనే ఉచిత గ్యాస్ సిలిండర్లు.. మంత్రి సంచలన ప్రకటన!

వీడియోలు డిలీట్ చేయండి...

ఇది కూడా చదవండి: కాటేసిన కాళేశ్వరం.. కేసీఆర్‌కు బిగ్ షాక్!

భవిష్యత్ లో ఇంకెప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలను కేటీఆర్ తో సహా ఏ ఇతర నేతలపై చేయవద్దని కొండాను సురేఖను ఆదేశించింది. కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలను వెంటనే మీడియా, సోషల్ మీడియా, వెబ్ సైట్లు, అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ నుంచి తొలగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. యూట్యూబ్, ఫేస్ బుక్, గూగుల్ సంస్థలకు కూడా ఈ వ్యాఖ్యలు  ఉన్న వీడియోలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇది కూడా చదవండి: రూ.500 బోనస్ ఇచ్చే సన్న రకాలు ఇవే!

కొండా సురేఖ వ్యాఖ్యలను ప్రసారం చేసిన, కథనాలు ప్రచురించిన మీడియా సంస్థలకు కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కామెంట్లకు సంబంధించిన అన్ని కథనాలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆయా సంస్థలను కోరింది. కొండా సురేఖ వ్యాఖ్యలు సమాజంలో చెడు ప్రభావాన్ని చూపుతాయని ఆమె వ్యాఖ్యలకు సంబంధించిన అన్ని కథనాలు, వీడియోలు పబ్లిక్ డొమైన్ లో ఉండవద్దని కోర్టు స్పష్టం చేసింది. కాగా గతంలో కూడా  కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఇలాంటి వ్యాఖ్యలు తగదు అని హెచ్చరించింది .

ఇది కూడా చదవండి: సంచలన విషయాలు బయటపెట్టిన వైసీపీ

Advertisment
Advertisment
తాజా కథనాలు