/rtv/media/media_files/2026/06/13/high-court-fine-2026-06-13-11-00-10.jpg)
High Court fine
High Court : హైదరాబాద్ వ్యాప్తంగా చెరువుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో నిరంతరం వార్తల్లో నిలుస్తున్న హైడ్రా (HYDRAA) కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కోర్టు ఆదేశాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఒక కేసు విచారణకు సంబంధించి కోర్టు ఆదేశించినప్పటికీ సకాలంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకుండా కాలయాపన చేయడంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు, కమిషనర్ రంగనాథ్‌కు రూ. 50,000 (యాభై వేల రూపాయలు) భారీ జరిమానా విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.
న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ, సమాధానం ఇవ్వడానికి పదే పదే గడువు కోరడం, కాలయాపన చేయడం ఎంతమాత్రం సరికాదని ఈ సందర్భంగా హైకోర్టు ఘాటుగా మండిపడింది. అధికారులు కోర్టుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. రంగనాథ్‌కు విధించిన ఈ యాభై వేల రూపాయల జరిమానా మొత్తాన్ని తక్షణమే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (Chief Justice) రిలీఫ్ ఫండ్‌కి జమ చేయాలని న్యాయమూర్తి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ విభాగాల అలసత్వం, ఆలస్యంపై తెలంగాణ హైకోర్టు తీసుకున్న ఈ కఠిన నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఉన్నతాధికారుల తీరుపై న్యాయస్థానం ఇంత కఠినంగా స్పందించడం ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Follow Us