Telangana Chicken Shops Strike : చికెన్ ప్రియులకు బిగ్ షాక్.. ఏప్రిల్ 1 నుంచి షాపులు క్లోజ్‌

తెలంగాణ రాష్ట్రంలో మాంసం ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌..తమకు ఇచ్చే కమీషన్, మార్చిన్ ను భారీగా తగ్గించడాన్నినిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఏప్రిల్1నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులను మూసివేయాలని నిర్ణయించారు.

New Update
chicken shopes

chicken shops closed

Telangana Chicken Shops Strike : తెలంగాణ రాష్ట్రంలో మాంసం ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌.. ఆదివారం వస్తే మంచిగా నాన్‌ వెజ్‌ తెచ్చుకుని కమ్మగా వండుకుని తిందాం అనుకుంటున్నారా? అయితే ఏప్రిల్‌ రెండు నుంచి ఇక మీ చికెన్‌ ఉడకదు. తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయంతో చికెన్‌ ప్రియులకు బిగ్‌ షాక్‌ తగలనుంది.  

గత కొంత కాలంగా ఫౌల్ట్రీ కంపెనీలు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల మూలంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని చికెన్‌ వర్తకులు వాపోతున్నారు. తమకు ఇచ్చే కమీషన్, మార్చిన్ ను భారీగా తగ్గించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏప్రిల్1నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులను మూసివేయాలని నిర్ణయించారు.  ఇప్పటికే నిర్ణయం తీసుకున్న వర్తకులు నగర వ్యాప్తంగా దీనికి సంబంధించిన పోస్టర్లు అంటించారు. తగ్గించిన మార్జిన్‌ను తిరిగి సవరించి, తమకు న్యాయం చేసే వరకు షాపులు తెరిచేది లేదని స్పష్టం చేశారు.

కాగా ఈ విషయంలో  ఫౌల్ట్రీ కంపెనీలకు, చికెన్‌ షాపుల వర్తకులకు మధ్య చర్చలు ఫలించకపోవడంతో వారు ఆందోళనను ఉదృతం చేయాలని నిర్ణయించారు. దీంతో చికెన్‌ ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ప్రత్యామ్నయం ఏర్పాట్లు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ముందుగానే చికెన్ కొని నిలువ చేసుకునే పనిలో పడ్డారు. మరికొంతమంది చికెన్‌ ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా పచ్చళ్లు పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇంకా కొందరైతే నగరంలో  చికెన్ షాపులు ఎక్కువ రోజులు మూసివేస్తే గ్రామీణ ప్రాంతాల నుంచి నాటు కోళ్లు తెప్పించుకోవచ్చని ఊవ్విళ్లూరుతున్నారు. చికెన్‌ షాపులు లేకుంటే  కోడిగుడ్లు, మాంసం, చేపలకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే చికెన్‌ షాపులు మూసివేయడం మూలంగా అనేక రంగాలపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో త్వరలోనే అధికారులు జోక్యం చేసుకుని ఇరువర్గాల మధ్య రాజీ కుదర్చాలని కోరుతున్నారు.

Advertisment
తాజా కథనాలు