/rtv/media/media_files/2025/04/13/DmGEsf5H5b9kwh6lokNi.jpg)
Bhubharathi Portal
Bhubharathi Portal : రేపటి నుంచి భూభారతి పోర్టల్ అందుబాటులోకి రానుంది.రాష్ట్రంలో భూభారతి పోర్టల్‌ను తొలుత ఎంపిక చేసిన మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.భూభారతి అమలుపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూభారతి పోర్టల్‌ను రేపు జాతికి అంకితం చేయబోతున్నట్లు తెలిపారు. సామాన్య రైతుకు కూడా అర్ధమయ్యేలా భూభారతిని రూపొందించాలని అధికారులకు సూచించారు. భూభారతి తాత్కాలికం కాదని.. కనీసం వంద సంవత్సరాల పాటు ఉంటుందని అన్నారు. భూభారతి వెబ్‌సైట్ సైతం అత్యాధునికంగా ఉండాలని తెలిపారు. భద్రతాపరమైన సమస్యలు రాకుండా పకడ్బందీగా ఉండాలని అధికారులకు సూచించారు. భూభారతి నిర్వహణ విశ్వసనీయత సంస్థకు అప్పగించాలని చెప్పారు.కాగా పోర్టల్‌పై రైతులకు అవగాహన కల్పించేందుకు అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించనున్నారు.
భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు చెందిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా అందబాటులో ఉండేలా భూ భారతి పోర్టల్ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. భూభారతికి చెందిన పలు అంశాలను అధికారులకు ఆయన సూచించారు. ఈ పోర్టల్ ను పూర్తిస్థాయిలో అమలులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్రంలో మూడు మండలాల్లో పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసుకొని అక్కడ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలకు, రైతులకు భూభారతిపై అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ఆయా సదస్సుల్లో ప్రజల నుంచి వచ్చే సందేహాలను నివృత్తి చేయాలో అధికారులకు సూచించారు. అదేవిధంగా ఈ భూ భారతిపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోని ప్రతి మండలంలోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించాలని సీఎం ఆదేశించారు.
Also Read: Earthquake: భారీ భూకంపం.. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రజలు పరుగే పరుగు- ఎక్కడంటే?
ప్రజలు, రైతులకు అర్ధమయ్యేలా, సులభమైన భాషలో పోర్టల్ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పోర్టల్ బలోపేతానికి ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని సీఎం అధికారులకు సూచించారు. వెబ్ సైట్‌తో పాటు యాప్‌ను పటిష్టంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శులు వి.శేషాద్రి, చంద్రశేఖర్‌రెడ్డి, సీఎం జాయింట్ సెక్రటరీ సంగీత సత్యనారాయణ, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, రెవెన్యూ కార్యదర్శి జ్యోతి బుద్ద ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Sridhar Babu : హెచ్ సీయూ భూములు ప్రభుత్వానివే...మంత్రి శ్రీధర్ బాబు సంచలన
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ప్రజల పాలిట శాపంగా మారిందని, భూ లావాదేవీలన్నింటినీ ఆన్లైన్ ద్వారా నిర్వహించేందుకు తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సామాన్య ప్రజలకు ఇబ్బందులను తెచ్చిందని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం విమర్శలు చేసింది. భూముల వివరాలను రెవెన్యూ రికార్డుల నుంచి ధరణి పోర్టల్‌లో ఎక్కించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేసిందని ధ్వజమెత్తింది. దీంతో 20 లక్షలకు పైగా రైతులు ధరణి పోర్టల్ కారణంగా ఆగమయ్యారని ఆరోపించింది.
Also Read: Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు.. 110 మంది అరెస్టు