/rtv/media/media_files/2025/03/21/lbm6idHl1OZVc4XV1FC1.jpg)
Bhadrachalam
Bhadrachalam : భద్రాధ్రికొత్తగూడెం జిల్లా భద్రాచలం దేవస్థానంలో వైదిక కమిటీ, కార్యనార్వాహక విభాగం మధ్య అంతరాలపై ప్రభుత్వం సీరియస్ అయింది. శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో అర్చకులు, ఈవో మధ్య తలెత్తిన వివాదంపై విచారణ జరపాలని ప్రభుత్వం ఆదేశించింది. శ్రీసీతారాముల కల్యాణ బ్రహ్మోత్సవాల వేళ ఆలయంలో జరుగుతున్న పరిణామాలపై నివేదిక సమర్పించాలని దేవాదాయశాఖకు సూచించింది. విచారణ కోసం నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్ వెల్లడించారు.
Also Read: దెయ్యాలతో చెడుగుడు ఆడేస్తాం.. ఎనీ డౌట్స్..?
దీంతో దేవస్థానంలో అర్చకులు, ఈవో మధ్య తలెత్తిన వివాదంపై గురువారం విచారణ జరిగింది. హైదరాబాద్ నుంచి ఎండోమెంట్ అడిషనల్ కమిషనర్కృష్ణవేణి, హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్కృష్ణప్రసాద్, వరంగల్డిప్యూటీ కమిషనర్సంధ్యారాణి, ఖమ్మం అసిస్టెంట్కమిషనర్వీరస్వామి టీమ్ వచ్చి రంగనాయకుల గుట్టపైన అల్లూరి నిలయంలో ఇరువర్గాలతో మాట్లాడి వివరాలు తీసుకుంది. అంకురార్పణ పూజ ఆలస్యం, అర్చకులు, ఈవో మధ్య విభేధాలపై కమిటీ సభ్యులు ఎండోమెంట్ అడిషనల్ కమిషనర్ , హైదరాబాద్ డిప్యుటీ కమిషనర్ కృష్ణప్రసాద్, వరంగల్ డిప్యంటీ కమిషనర్ సంధ్యారాణి, ఖమ్మం అసిస్టెంట్ కమిషనర్ వీరస్వామి సుధీర్ఘ విచారణ జరిపారు.ఆలయ అర్చకులను, కార్యనిర్వాహక సిబ్బందిని పిలిపించి కమిటీ సభ్యులు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రమాదేవి వైఖరి కారణంగానే అంకురార్పణ పూజ ఆలస్యమైందని అర్చకులు సమాధానమిచ్చారు.
ఇది కూడా చదవండి: AP News: ఏపీకి మరో మూడు సార్లు అతనే సీఎం.. పవన్ సంచలన వ్యాఖ్యలు!
కళ్యాణ బ్రహ్మ శ్రీనివాస రామానుజం విషయంలో ఈవోను అభ్యర్థించినా మొండిగా వ్యవహరించినట్లు అర్చకులు ఆరోపించారు. అర్చకుడు శ్రీనివాస రామానుజను క్రమశిక్షణా చర్యల్లో భాగంగానే అనుసంధాన ఆలయం పర్ణశాల రామాలయానికి బదిలీచేసినట్లు విచారణ కమిటీ ఎదుట అభిప్రాయం వ్యక్తం చేసిన ఈవో రమాదేవి.ఇరు వర్గాల అభిప్రాయాలను సావధానంగా విన్న విచారణకమిటీ నివేదికను దేవాదాయ శాఖ కమిషనర్ కు సమర్పించనున్నట్లు విచారణ కమిటీ వెల్లడించింది.
ఇది కూడా చదవండి: AP News: SC వర్గీకరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం!
కాగా హోలీ సందర్భంగా ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ కార్యక్రమం ఆలస్యంగా జరిగింది. యాజ్ఞిక బ్రహ్మ శ్రీనివాస రామానుజం పర్ణశాలకు బదిలీ కాగా.. అతను సంప్రదాయం ప్రకారం ఉండాలని అర్చకులు పట్టుబట్టారు. ఈవోను అభ్యర్థించినా సమయానికి తీసుకురాకపోవడంతో నిరసన తెలిపారు. అదేరోజు సాయంత్రం 6 గంటలకు చేపట్టాల్సిన అంకురార్పణ కార్యక్రమం రాత్రి 9.30 గంటలకు జరిగింది.మూడున్నర గంటలు ఆలస్యం కావడంతో వివాదం తలెత్తింది. దీంతో ఎండోమెంట్కమిషనర్హరీశ్విచారణ చేయాలని అడిషనల్ కమిషనర్‌ను ఆదేశించగా ఆమె వచ్చారు. విచారణ కమిటీ ఎదుట తమకు సంప్రదాయాలు ముఖ్యమని అర్చకులు స్పష్టంచేశారు. ఎప్పటికప్పుడు ఈవోకు తెలిపిన లెటర్లను తీసుకోవడంతో పాటు ఈవో నుంచి కూడా వివరణ తీసుకుంది. అనంతరం అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి మాట్లాడుతూ వివాదంపై వివరాలు, పరిస్థితిని పరిశీలించమని కమిషనర్ఆదేశించడంతో వచ్చినట్లు చెప్పారు. ఇరువర్గాలతో మాట్లాడామని తెలిపారు.
Also Read : లాభాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..
తదనంతరం ఇటీవల బదిలీపై వచ్చి విధుల్లో అలసత్వం వహిస్తున్న శివరామ్, ఆగరెడ్డిలను ఎండోమెంట్ కమిషనర్ ఆఫీస్ కు అధికారులు సరెండర్ చేశారు.. యాదగిరిగుట్టకు దేవస్థానం నుంచి ఆగారెడ్డి, వేములవాడ నుంచి శివరామ్బదిలీల్లో భాగంగా భద్రాచలం దేవస్థానానికి వచ్చారు. శివరామ్జాయినింగ్ నాటి నుంచి లీవ్ పెట్టి హాజరు కావడంలేదు.ఆగారెడ్డి మద్యం తాగి మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ.. ఎలాంటి సమాచారం లేకుండా డ్యూటీకి డుమ్మా కొడుతురంటూ ఫిర్యాదులు వచ్చాయి. దీంతో వీరిని ఎండోమెంట్కమిషనర్ఆఫీసుకు సరెండర్ చేశారు.
Also Read: ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న 'లూసిఫర్2: ఎంపురాన్' ట్రైలర్..!