/rtv/media/media_files/2025/02/11/vM96u6gPNgu93U78xFvj.jpg)
Telangana beers
తెలంగాణలో మందుబాబులకు ముఖ్యంగా యూత్ కు బిగ్ షాక్ ఇచ్చింది కాంగ్రెస్ సర్కార్. బీర్ల ధరలను ప్రస్తుతం ఉన్న ధరపై 15శాతం పెంచుతూ సోమవారం రాత్రి ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ జడ్జి జైస్వాల్ నేతృత్వంలోని లిక్కర్ ధరల నిర్ణయ త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా ధరల పెంపు ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ ఎక్సైజ్ శాఖఉత్తర్వులు ఇచ్చింది. దీంతో పెరిగిన ధరలు మంగళవారం నుంచి అంటే ఇవ్వాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి. 15శాతం ధరలు పెరగడంతో ధరలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఒకసారి చూద్దాం.
లైట్ బీరు రూ.180, స్ట్రాంగ్ బీరు రూ.200
ప్రస్తుతం తెలంగాణలో లైట్ బీరు రూ. 150గా ఉండగా... స్ట్రాంగ్ బీరు రూ. 160గా ఉంది. ఇప్పుడు 15 శాతం ధరలు పెరగనుండటంతో రూ.150 ఉన్న లైట్ బీరు రూ.180 వరకు, రూ.160 ధర ఉన్న స్ట్రాంగ్ బీరు ధర రూ.200 వరకు పెరుగుతుందన్న మాట. కేసు లైట్ బీర్లు తీసుకోవాలంటే రూ. 2160 అవుతుంది. ఇక కేసు స్ట్రాంగ్ బీర్లు తీసుకోవాలంటే రూ. 2400 అవుతుంది. ఇప్పుడు పెరిగిన బీర్ల రేట్లతో ప్రతినెలా దాదాపుగా రూ.300 కోట్ల వరకూ ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాబోయేది సమ్మర్ కావడం, దీనికి తోడు ఐపీఎల్ కూడా ఉండటంతో బీర్ల సేల్స్ మరింత పెరగనున్నాయని అధికారులు లెక్కలు వేస్తున్నారు.
మద్యం అమ్మకాల వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీల రూపంలో ఈ ఆర్థిక సంవత్సరం (2024–25) లో రూ.36 వేల కోట్ల ఆదాయం వస్తుందని కాంగ్రెస్ సర్కారు అంచనా వేసింది. ఏప్రిల్, -సెప్టెంబర్ వరకు ఎక్సైజ్ శాఖకు ఎక్సైజ్ డ్యూటీ ద్వారా రూ.9 వేల 493 కోట్లు, వ్యాట్ ద్వారా రూ.8 వేల 40 కోట్ల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి సరాసరిగా రూ.90 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. నెలకు సగటున రూ.2,700 కోట్ల నుంచి రూ.3,000 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతుంది.
Also Read : బొక్క బోర్లా పడుతుందా.. కేజ్రీవాల్ చేసిన తప్పే చేస్తానంటున్న మమతా బెనర్జీ!