/rtv/media/media_files/2026/05/09/bandi-sanjay-2026-05-09-12-49-06.jpg)
Bandi Sanjay's sensational statement
BIG BREAKING: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ కీలక నేత బండి సంజయ్ కుమార్ తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. శనివారం రాత్రి తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా వేదికగా ఆయన సుదీర్ఘ అధికారిక ప్రకటన విడుదల చేశారు. రాజకీయంగా తనను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేకనే ప్రత్యర్థులు నిరాశ నిస్పృహలతో తన పిల్లలను, కుటుంబాన్ని వివాదాల్లోకి లాగుతున్నారని ఆయన మండిపడ్డారు.
/filters:format(webp)/rtv/media/media_files/2026/05/09/bandi-sanjay-2026-05-09-21-27-26.jpeg)
తన సుదీర్ఘ ప్రజా జీవితంలో ఎల్లప్పుడూ చట్టాన్ని గౌరవించానని, రాజ్యాంగానికి కట్టుబడి పనిచేశానని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఒక సామాన్య కార్పొరేటర్‌గా ప్రస్థానం ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఒక బీసీ నేతగా కేంద్ర మంత్రి స్థాయికి చేరడాన్ని కొన్ని శక్తులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ జరగనున్న తరుణంలో.. తనను వ్యక్తిగతంగా దెబ్బతీసేందుకు పక్కా ప్రణాళికతో చేసిన ‘పొలిటికల్ హిట్ జాబ్’ (రాజకీయ కుట్ర) అని ఇది స్పష్టంగా అర్థమవుతోందని ఆరోపించారు. న్యాయవ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, కాలమే ప్రతి ఆరోపణకు సమాధానం చెబుతూ కుట్రలను బట్టబయలు చేస్తుందని పేర్కొంటూ ఆయన తన ప్రకటనను ముగించారు.
అసలు వివాదం ఏమిటి?
బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై హైదరాబాద్‌లోని పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదైంది. డిసెంబర్ 31న మొయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌లో ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ సదరు బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.
అయితే, ఈ వ్యవహారంపై బండి భగీరథ్ కూడా కరీంనగర్ పోలీసులకు కౌంటర్ ఫిర్యాదు చేశారు. సదరు బాలిక, ఆమె కుటుంబ సభ్యులు ఒక పథకం ప్రకారం తనతో స్నేహం చేసి.. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. తప్పుడు కేసులు పెడతామని బెదిరించి ఇప్పటికే తన వద్ద నుండి రూ. 50 వేలు వసూలు చేశారని, ఇప్పుడు అదనంగా మరో రూ. 5 కోట్లు ఇవ్వాలంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు (క్రిమినల్ ఇన్‌టిమిడేషన్, ఎక్స్‌టార్షన్) పాల్పడుతున్నారని భగీరథ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ పరస్పర ఫిర్యాదులు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు సరిగ్గా ఒకరోజు ముందు ఈ పరిణామాలు చోటుచేసుకోవడంతో రాజకీయం మరింత వేడెక్కింది. దీనిపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కేంద్రమంత్రి కుమారుడిపై వచ్చిన పోక్సో ఆరోపణలపై ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు. మరోవైపు, ఆదివారం హైదరాబాద్‌లో జరగనున్న పీఎం మోదీ అధికారిక కార్యక్రమాల ఆహ్వానితుల జాబితాలో బండి సంజయ్ పేరు లేకపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు పరస్పర కేసులపై పోలీసులు ప్రస్తుతం లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.
Follow Us