Bandi Sanjay : కొడుకు అరెస్ట్.. కొత్త పార్టీపై బండి సంజయ్ సంచలన ప్రకటన !

తాను కొత్త పార్టీ పెట్టే ఫాల్తు రాజకీయ నాయకుడిని కాదన్నారు కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్. సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని స్పష్టం చేశారు.

New Update
bandi sanjay

తాను కొత్త పార్టీ పెట్టే ఫాల్తు రాజకీయ నాయకుడిని కాదన్నారు కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్. సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

ఫాల్తు రాజకీయ నాయకుడిని కాదు

"నేను కొత్త పార్టీ పెట్టే ఫాల్తు రాజకీయ నాయకుడిని కాదు. నేనేంటో, నా ప్రాణపదమైన బీజేపీ కార్యకర్తలకు బాగా తెలుసు. ఒక కమిట్‌మెంట్‌తో పనిచేసే కార్యకర్తను నేను. చనిపోయాక నా శరీరంపై బీజేపీ జెండా కప్పాలని కోరుకునే వ్యక్తిని" అని ఎమెషనల్ అయ్యారు. ఎవరెవరో రాసే రాతలను కార్యకర్తలు ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

తన కొడుకు వివాదానికి సంబంధించిన కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని బండి సంజయ్ తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ కుటుంబంపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక తండ్రి తన కొడుకును చట్టానికి అప్పగించిన సందర్భం ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌లో కూర్చొని తనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని మాట్లాడుతున్నారని, ఆయన కొడుకు ఒక ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నడిపిస్తూ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.  తెలంగాణలో కేసీఆర్ అహంకార గడీల పాలనను కూల్చింది తామేనని బండి సంజయ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

కేంద్ర కేబినెట్ విస్తరణ కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ఉండి నిర్ణయిస్తున్నారా అని సంజయ్ ప్రశ్నించారు. పార్లమెంట్‌లో వాళ్లకు ఒక్క ఎంపీ సీటు కూడా లేదని, మరి ఆయన డిమాండ్ చేస్తే బర్తరఫ్ చేసే స్థాయిలో బీజేపీ ఉందా అని సంజయ్ నిలదీశారు.  సంజయ్ చేసిన ఈ కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌ గా మారింది.  

Advertisment
తాజా కథనాలు