/rtv/media/media_files/2025/02/23/6zhkAoSNKZdoPLIvPiMk.webp)
Liquor prices
Liquor prices : ఎండలు మండిపోతున్నాయి. చల్లగా ఓ బీరేసీ బజ్జుందామనుకుంటున్నారా? అయితే మీకో బ్యాడ్ న్యూస్. అదెంటంటే తెలంగాణలో మద్యం ధరలు మరోసారి పెరగనున్నాయి. ఈ పాటికే మద్యం వ్యాపారస్తులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ర్టంలోని మద్యం సిండికేట్లందరూ ఇటీవల ప్రత్యేకంగా సమావేశమై మద్కం ధరలు పెంపుదలకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. దీనికోసం ప్రభుత్వంలోని పెద్దలను కలిసి ఒప్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ పెద్దలను కలిసిన మద్యం సిండికేట్ పెద్దలు ఈ మేరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. అంతా వారు అనుకున్నట్లు జరిగితే చీప్ లికర్, మీడియం, ప్రీమియం, విదేశీ దిగుమతి లికర్ ప్రాథమిక ధర (ఇష్యూ ప్రైస్) మీద 18 శాతం పెంచడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తరువాత ప్రభుత్వం మద్యం ధరల పెంపునకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉన్నదని ఏజెన్సీలు చెప్తున్నాయి.ఇటీవలి కాలంలో బీరు ధరలు పెంచిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తాజాగా బ్రాందీ, విస్కీ, స్కాచ్, రమ్ ధరలు పెంచాలని నిర్ణయించింది.
Also Read: ఆమె ప్రతి అంగంలో బంగారమే.. రన్యారావుపై బీజేపీ MLA వల్గర్ కామెంట్స్!
ప్రభుత్యం నియమించిన ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ వ్యాపారులతో మాట్లాడి వారి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్నది. వ్యాపారుల తరపున ఉత్తర తెలంగాణకు చెందిన ఒక ఎమ్మెల్యే వ్యవహారం నడిపినట్టు తెలిసింది. ఆయన సూచనలు, సలహాలకు అనుగుణంగానే మద్యం ధరల పెంపు మీద తుది కసరత్తు చేసినట్టు సమాచారం. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండటం కోసం ధరల నిర్ణయాల కమిటీ 15 శాతం నుంచి 20 శాతం వరకు ధరలు పెంచవచ్చని ప్రభుత్వానికి నివేదించినట్టు తెలిసింది. మధ్యే మార్గంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 18 శాతం పెంచటానికి అంగీకరించినట్టు తెలిసింది. ఈ మేరకు ఫైల్ ముఖ్యమంత్రి వద్ద ఉన్నట్టు తెలిసింది.
Also Read : అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..
మద్యం సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందం జూన్ 30తో ముగియనుంది. జూలై ఒకటి నుంచి కొత్త ఒప్పందం అమల్లోకి రానుంది. ఈ లోపే మద్యం ధరలు పెంచి, డిస్టిలరీలు, డిస్ట్రిబ్యూటర్స్, సప్లయ్ కంపెనీలతో ఒప్పందాలకు వెళ్లాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. ఏప్రిల్ మొదటి వారంలో ధరలు పెంచి, ఆ వెంటనే ఒప్పందాలు చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. మరోవైపు బీర్ల ధరలను కూడా మరోసారి సమీక్షించాలని బీర్ల ఉత్పత్తిదారులు కూడా ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. వేసవిలో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉండటంతో బీర్ల ఉత్పత్తి తగ్గుతుందని దీంతో ఉత్పత్తిదారులకు నష్టం వాటిల్లుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు బీర్లపై కూడా మరో రూ.10 పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: కుల వివక్షపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు