/rtv/media/media_files/2025/11/07/wine-shops-2025-11-07-08-06-19.jpg)
Wine shops to be closed tomorrow
Hyderabad Wine Shops Closed : మద్యం ప్రియులకు పోలీసులు షాక్ ఇచ్చారు. హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గురువారం (ఏప్రిల్ 2) మద్యం షాపులు బంద్ ప్రకటిస్తూ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ఎక్సైజ్ చట్టం 1968లోని సెక్షన్ 20 ప్రకారం, గురువారం ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మద్యం అమ్మకాలను నిషేధించినట్లు అధికారులు ప్రకటించారు.
పోలీసుల ఉత్తర్వుల ప్రకారం అన్ని వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు మూసివేయాలని అధికారులు స్పష్టం చేశారు. అయితే, స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్బులలో ఉన్న బార్లకు మాత్రం ఈ నిబంధన నుండి మినహాయింపు ఇస్తు్‌న్నట్లు ప్రకటించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు ఉండటమే కాకుండా లైసెన్సులను కూడా రద్దు చేస్తామని కమిషనర్ హెచ్చరించారు.
ఫ్యూచర్ సిటీలో 24 గంటల పాటు..
హనుమాన్ జయంతి వేడుకల నేపథ్యంలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 24 గంటల పాటు మద్యం విక్రయాలపై నిషేధం విధిస్తూ కమిషనర్ జి. సుధీర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు ఏప్రిల్ 2వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఏప్రిల్ 3వ తేదీ ఉదయం 6 గంటల వరకు అన్ని రకాల వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్లు , రెస్టారెంట్లు మూసి ఉంచాలని సీపీ స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఎక్సైజ్ చట్టం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. అయితే, స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు మాత్రం ఈ నిబంధన నుండి మినహాయింపు ఉంటుంది.
భారీ బందోబస్తు ,శోభాయాత్ర ఏర్పాట్లు
హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలో నిర్వహించే భారీ శోభాయాత్ర కోసం పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున నిఘా ఏర్పాటు చేశారు. శోభాయాత్ర సాగే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉండే అవకాశం ఉంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు బలగాలను రంగంలోకి దించనున్నారు.
Follow Us