తాను కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు. తాను అన్నవి తన సొంత మాటలు కావని.. రాష్ట్రంలో ఉన్న చాలామంది ప్రజలు తమ వద్దకు వచ్చి అంటున్న మాటలని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం మారాలి అని రైతులు..రియల్టర్లు, పారిశ్రామిక వేత్తలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. మంత్రి పొంగులేటి తనని.. కేసీఆర్ ఆత్మ అని అంటున్నారు..కేసీఆర్ లేకుంటే పొంగులేటి ఎక్కడ ఉండేవాడని ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు పొంగులేటి మంత్రి పదవిలో ఉన్నాడు అంటే..అది కేసీఆర్ వల్లేనని తెలిపారు. కాంగ్రెస్ నాయకులకు వాళ్ల ప్రభుత్వం పై నమ్మకం లేకనే తమ పార్టీ నుండి పదిమంది ఎమ్మెల్యే లను తీసుకెళ్లారని విమర్శించారు. ఇప్పుడు కాకపోయిన ఇంకొద్దిరోజులు కైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని... వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం పక్క అని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే తనపై అక్రమ కేసులు పెడుతున్నారని...తనను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు కొత్త ప్రభాకర్ రెడ్డి.. తాను కేసులకు భయపడేవాన్ని కాదని తేల్చి చెప్పారు. కచ్చితంగా తాను పారిశ్రామికవేత్తనని.. కానీ డబ్బులు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదన్నారు. సేవ చేయడానికి మాత్రమే వచ్చానని ఆర్టీవీకీ ఆయన తెలిపారు.
ఎర్రబెల్లి బస్తిమే సవాల్
రేవంత్ సర్కార్ పై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన కామెంట్స్ చేశారు. మంత్రి వర్గ విస్తరణ పూర్తి కాగానే ప్రభుత్వం కుప్పకూలిపోతుందని అన్నారు. మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొర్రూరులో బీఆర్ఎస్ పార్టీ సన్నాహాక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్ రావు చీఫ్ గెస్టుగా పాల్గొని మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేందుకు ప్రభుత్వం భయపడుతుందని అన్నారు. రాసిపెట్టుకోండి.. స్థానిక సంస్థల్లో వార్ వన్ సైడ్.. ఎప్పుడు ఎన్నికలు పెట్టిన సరే.. బీఆర్ఎస్ సత్తా చాటడం ఖాయమని ఎర్రబెల్లి అన్నారు. సర్వేలన్ని కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్నాయన్న ఎర్రబెల్లి.. ఎన్నికలు పెట్టి చూడండి .. తమ సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు. తాను చెప్పింది నిజం కాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎర్రబెల్లి సవాల్ విసిరారు. మొత్తం రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలు ఉంటే.. అందులో కేవలం 10 నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఫేవర్‌గా ఉందని.. మిగతా చోట్ల బీఆర్ఎస్ పార్టీ గెలుస్తోందని జోస్యం చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం బయటపడుతోందని ఎర్రబెల్లి స్పష్టం చేశారు.
హైడ్రా అంటే భయం కాదు.. భరోసా: రంగనాథ్ సంచలన ప్రెస్‌మీట్
హైడ్రా అంటే భయం కాదు భరోసా అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. 'కొందరు హైడ్రాను బూచిగా చూపిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చెరువులు, నాలాలు కాపాడటమే హైడ్రా లక్ష్యం. పేదలను హైడ్రా ఇబ్బంది పెట్టట్లేదు' అని స్పష్టం చేశారు.
Hydra: హైడ్రా అంటే భయం కాదు భరోసా అని హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ అన్నారు. హైడ్రాపై కొంతమంది లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, సోషల్ మీడియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం జరుగుతుందని చెప్పారు. ఈ మేరకు శనివారం మీడియాతో మాట్లాడిన రంగనాథ్.. చెరువులు, నాలాలు కాపాడటమే హైడ్రా లక్ష్యమని తెలిపారు. అలాగే ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత మన అందరి పై ఉంటుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
హైడ్రా బూచి కాదు..
'మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే ఎక్కువగా సోషల్ మీడియానే హైడ్రాను ప్రచారం చేస్తుంది. హైడ్రా బూచి కాదు.. భరోసా ఇచ్చే సంస్థ. మేం కూల్చిన ఏ భవనానికి అనుమతులు లేవు. కొందరి తప్పుడు ప్రచారం వల్ల బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆక్రమణల్లో పేదలు ఉంటే వాళ్ల జోలికి వెళ్లడం లేదు. అక్రమ కట్టడాల వెనుక కొందరు బలవంతులు ఉన్నారు. తప్పులు చేసిన బిల్డర్లపై క్రిమినల్ కేసులు పెడుతున్నాం. ఇష్టారాజ్యంగా కట్టుకుంటూ పోతే కట్టడి చేయవద్దా? అమీన్‌పూర్‌లో ఓ భవనాన్ని కూల్చినా మళ్లీ కట్టారు. అమీన్ పూర్ లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తామన్న ధీమాతో కొందరు బడా వ్యక్తులు ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారని మండిపడ్డారు.
వారే మా అసలు టార్గెట్..
ఇక N కన్వెన్షన్ కూల్చినప్పుడు పక్కన ఉన్నటువంటి గుడిసెలను తొలగించలేదు. కొందరు అక్రమంగా బిజినెస్ లు చేస్తూ.. హైడ్రా వచ్చినప్పుడు కిరోసిన్, పెట్రోల్ తో ఆందోళన చేస్తున్నారు. కూకట్ పల్లి చెరువు దగ్గర ఉన్నవారికి ముందస్తు సమాచారం ఇచ్చాం. కొందరు సిరియస్ గా తీసుకోలేదు. అయిన వారిని ఖాలీ చేపించిన తరువాతనే కూల్చివేతలు స్టార్ట్ చేశాం. పేద వాళ్ళనీ ఇబ్బందులకు గురిచేసేందుకు హైడ్రా ఉండదు. ఇప్పటి వరకు హైడ్రా కూల్చింది ఖాలీగా ఉన్న భవనాలు మాత్రమే. మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఒవైసీ కాలేజీలు బఫర్ జోన్ లో ఉన్నట్లు మాకు ఫిర్యాదులు వచ్చాయి. పిల్లల అకాడమిక్ సంవత్సరం నష్టం జరుగుతుందని ఆలోచన చేస్తున్నాం. పేదల పట్ల ఒకలా, పెద్దోళ్ల పట్ల మరోలా హైడ్రా వ్యవహరించదు. అక్రమంగా నిర్మించిన పెద్ద వాళ్ళే ప్రథమ టార్గెట్ గా హైడ్రా కూల్చివేతలు చేస్తుంది. హైడ్రా సైలెంట్ గా ఏమి లేదు. హైడ్రా పని హైడ్రా చేసుకుంటూ వెళ్తోందని రంగనాథ్ చెప్పారు.
సుందరీకరణ కోసం కాదు..
ఇక IAS దాన కిశోర్ మాట్లాడుతూ.. మూసీపై ఈరోజు ముఖ్య పత్రికలు తప్పుడు వార్తలు రాయడం ఆందోళన కలిగిస్తోందన్నారు. నాటి నిజాం హయంలో భారి వరదలు వచ్చాయని, అప్పట్లో ఎంత ఇబ్బంది అయిందో అందరికీ తెలుసన్నారు. గత 5 యేండ్ల నుంచి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో పడుతున్నాయి. భారీ వర్షాలు వచ్చినప్పుడు మూసీ పరివాహక ముంపుప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల నుంచి హైదరాబాద్ ప్రజలను కాపాడుకునేందుకే. మూసీ రీ డెవలప్మెంట్. సుందరీకరణ కోసం కాదు. అక్టోబర్ నెలలో దక్షణ కొరియాకు వెళ్తున్నాం. ఈ టూర్ లో మూసీ పరివాహక ప్రాంత ఎమ్మెల్యేలు, మేయర్లు, కార్పొరేటర్లు ఉంటారు. మూసీ నీళ్లను శుద్ధి చేసేందుకు STP లను నిర్మించబోతున్నట్లు తెలిపారు.
హైడ్రా వస్తుంది కూలగొడుతుంది..
మూసి రీ డెవలప్మెంట్ రివర్ లో ఇంటర్ నేష్నల్ ఏజెన్సీలు వస్తున్నాయని చెప్పారు. మొదటిగా 10 వేల కోట్లతో జూన్, జులై నెలలో మూసీ నీటిని శుద్ధి చేస్తాం. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. మూసీ పరివాహక ప్రాంతంలో ఎవరి ఇండ్లను కూలగోట్టడం లేదు. ఎవరిని బలవంతంగా బయటకు పంపించడం లేదు. హైడ్రా వస్తుంది కూలగొడుతుంది అని అనడం తప్పు. ఇప్పటి వరకు మూసి పరివాహక ప్రాంతంలో 50 కుటుంబాలు తమ ఇష్టంగా షిఫ్ట్ అయ్యారు. మరో 200 కుటుంబాలు ముందుకు రావొచ్చు. బఫర్ జోన్ లో ఉండి పట్టా భూమి ఉంటే తప్పకుండా డబుల్ పెమెంట్ చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంది. పారదర్శకంగా మాత్రమే వారిని షిఫ్ట్ చేస్తున్నాం. బలవంతగా పంపించడం లేదని దాన కిశోర్ స్పష్టం చేశారు.
ఇంకొద్ది రోజులకైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరో సంచలనం!
మంత్రి పొంగులేటి తనని.. కేసీఆర్ ఆత్మ అని అంటున్నారు..కేసీఆర్ లేకుంటే పొంగులేటి ఎక్కడ ఉండేవాడని ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
Sisters commit suicide : ఎంత కష్టమొచ్చిందో.. పురుగుల మందు తాగి అక్క చెల్లెలు ...
సికింద్రాబాద్ ఖార్ఖానాలో దారుణం .... ఇంట్లో పురుగులమందు తాగి అక్కాచెల్లెలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
🔴Live News Updates: న్యూస్ అప్డేట్స్
Stay updated with the latest live news Updates క్రైం | టెక్నాలజీ | Latest News In Telugu | జాబ్స్ | బిజినెస్ | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Telangana Women's Commission : శ్రీవర్షిణి కి షాక్...అఘోరీ శ్రీనివాస్ అరెస్ట్ ?
అఘోరీ శ్రీనివాస్ పై తెలంగాణ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు అందింది. శ్రీవర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో... అఘోరీ తన భర్త అంటూ మరో స్త్రీ బయటకు వచ్చింది.
Babu Mohan : రాజకీయాల నుంచి సేవారంగంవైపు... బాబుమోహన్ కీలక నిర్ణయం
ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్ తెలియనివారుండరు. తన హాస్యనటనతో ఎందరినో అలరించిన ఆయన ఆ తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేశారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
Saraswati Pushkaralu : సరస్వతి పుష్కరాలు.. ఎక్కడ, ఎప్పుడో తెలుసా?.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో ఈ సంవత్సరం మే 15 నుంచి 26 వరకు ఈ సరస్వతి పుష్కరాలు నిర్వహించనున్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
ఇంకొద్ది రోజులకైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరో సంచలనం!
Sisters commit suicide : ఎంత కష్టమొచ్చిందో.. పురుగుల మందు తాగి అక్క చెల్లెలు ...
🔴Live News Updates: న్యూస్ అప్డేట్స్
పశ్చిమ బెంగాల్లో హింస వెనుక ముఖ్యమంత్రి కుట్ర : కేంద్ర మంత్రి
MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్